సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతూ విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంతో పోల్చితే, ఉత్తర భారతదేశంలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య మరియు మరణాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

ఇటువంటి కష్ట సమయంలో ఉదారంగా మరియు స్వచ్చందంగా సేవలను అందించడానికి కొంతమందివ్యక్తులు బయటకు వస్తున్నారు. కరోనావైరస్ బారిన పడిన ప్రజలకు ప్రధాన సమస్య సాధారణంగా శ్వాస తీసుకోవడం. కావున అలాంటి వారికి కృత్రిమంగా మెడికల్ ఆక్సిజన్ అవసరం.

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

భారతదేశంలో గత కొన్ని రోజులుగా, కరోనా రోగులు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. ఈ సమయంలో టాటా గ్రూప్, రిలయన్స్ కంపెనీలు ఆక్సిజన్ సిలిండర్ల కొరత నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్ల తయారీకి ముందుకు వచ్చాయి. కంపెనీలు తమవంతు సహాయం చేస్తుండగా, ముంబై మహానగరంలో ఒక వ్యక్తి స్వచ్చందంగా సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాడు.

MOST READ:ఒకే ఫ్యామిలీ నాలుగు హారియర్ ఎస్‌యూవీలను కొనేసింది.. ఎందుకంటే?

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

నివేదికల ప్రకారం ముంబైలోని మలాడ్‌లో నివసిస్తున్న షహనావాజ్ తన ఫోర్డ్ ఎస్‌యూవీని కొన్ని నెలల క్రితం రూ. 22 లక్షలకు విక్రయించి, ఆ డబ్బును 160 ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించారు. ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ అవసరమైన వారికి సకాలంలో పంపిణీ చేయబడతాయి.

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

షహనావాజ్ దీని కోసం ఒక టీమ్ మరియు హెల్ప్‌లైన్ నంబర్ వంటివి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. షహనావాజ్ బృందం గత సంవత్సరం నుండి 4,000 మందికి పైగా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేశారు. అంతే కాకుండా, వారు ఆక్సిజన్ సిలిండర్లను ఎలా ఉపయోగించాలో కూడా ప్రజలకు వివరిస్తున్నారు.

MOST READ:కరోనా టైమ్‌లో ఆటో సర్వీస్ ఫ్రీ.. కేవలం వారికి మాత్రమే.. ఎక్కడంటే

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

షహనావాజ్ ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయడం వెనుక ఒక విషాద కన్నీటి గాథ ఉంది. షహనావాజ్ స్నేహితుడి భార్య గత సంవత్సరం ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించింది. ఈ సంఘటన షహనావాజ్‌ను బాగా కలవరపెట్టింది.

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

ఈ కారణంగా, షహనావాజ్ అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరగడం షహనావాజ్‌ను మరింత దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్ పొందడానికి ప్రతిరోజూ 500 నుండి 600 మంది తనకు ఫోన్ చేస్తున్నారని తెలిపాడు.

MOST READ:శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో బీహార్ చెందిన 'గౌరవ్ రాయ్' అనే వ్యక్తి తన మారుతి సుజుకి వాగన్ఆర్ లో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. గౌరవ్ రాయ్ ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి స్వచ్చందంగా అందిస్తున్నారు. డీఐ కోసం ఏ మాత్రం డబ్బు తీసుకోవడం లేదు.

సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

కరోనా నేపథ్యంలో ప్రజలకు తమ వంతు సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చి రియల్ హీరోలుగా నిలుస్తున్నారు. మొన్న గౌరవ్ రాయ్, ఈ రోజు షహనావాజ్. ఏది ఏమైనా సొంత ఖర్చులతో ప్రజలకు సేవ చేయడం అనేది నిజంగా అభినందనీయం.

MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి

Source: Tamil.Behindwoods

Most Read Articles

English summary
Mumbai Man Sells His Ford SUV To Help Covid 19 Patients. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X