నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వారు, ప్రమాదంలో ఎక్కువగా గాయపడే వారు లెక్కకుమించి ఉన్నారు. అంతే కాకుండా వాహనాలు లోయల్లో పడిపోవడం, లేకుంటే రోడ్డుపై బోర్లా పడిపోవడం వంటి సంఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

ఈ విధంగా వాహనాలు బోర్లా పడినప్పుడు క్రేన్లు వంటి వాటిని ఉపయోగిస్తారు. కానీ ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అయితే ఈ బోల్తాపడిన కారుని తీయడానికి క్రేన్లు ఉపయోగించలేదు. రోడ్డుపై ఉన్న చుట్టుపక్కల ప్రజలే దీనిని సరిచేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

నివేదికల ప్రకారం ఈ సంఘటన దక్షిణ ముంబైలోని వల్కేశ్వర్ లో జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ రోడ్డుపై బోల్తాపడినట్లు తెలుస్తుంది. వీడియోలో రోడ్డుపై ఉన్న ఒక పోలీసు రోడ్డు మీద నడుస్తున్న ప్రజలను బోల్తాపడిన కారును సరిచేయడానికి ఆహ్వానించాడు.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

ఆ సమయంలో అక్కడున్న ప్రజలు కొంతమంది అక్కడ బోల్తా పడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని యధావిధిగా ఉంచడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఆ కారు బోల్తాపడటానికి సరైన కారణం తెలియదు. కానీ మొత్తానికి బోల్తా పడింది.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

రోడ్డుపైన 10 నుంచి 15 మంది కారును నిఠారుగా చేయడానికి ప్రయత్నిస్తుండటం మీరు వీడియో గమనించవచ్చు. ప్రజలు చేసిన ఈ సాహసానికి కారు కొంత సమయానికి యధావిధిగా నిలబడింది. ఈ వీడియో చూస్తుంటే ఎంత కష్టమైన పని అయినా కలిసి చేస్తే విజయం సాధించవచ్చని మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

వీడియోలో మీరు చూస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ బ్లాక్ కలర్ లో ఉంది. కారు బోల్తా పడటం వల్ల కారు యొక్క ముందు భాగం కొద్దిగా వంగి ఉండగా, విండ్‌స్క్రీన్‌ పగిలింది. ఈ కారు బోల్తాపడినప్పటికీ ఆ ప్రమాద సమయంలో ఎవరికీ ఎటువంటి కానీ, ప్రాణనష్టం కానీ జరిగినట్లు నివేదికలో ఎవల్లడించలేదు.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. అందులో కొంతమంది ముంబై ప్రజలు సహాయంచేయడంలో ఎప్పుడు ముందుగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ముంబై ప్రజలు ఎంత కష్టమైన పనినైనా కలిసికట్టుగా పనిచేసి అందులో తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు.

అది మాతర్మే కాకుండా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క బలాన్ని కొందరు ప్రశంసించారు. కారు పూర్తిగా బోల్తాపడిన తర్వాత కూడా మంచి స్థితిలో ఉండటం నిజంగా ప్రశంసనీయం. ఎకోస్పోర్ట్ స్థానంలో వేరే వాహనం ఉంది ఉంటె తప్పకుండా భారీ ప్రమాదానికి గురి కావలసి వచ్చేదని వారు అభిప్రాయపడ్డారు.

నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి

భారతీయ మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యాంబియంట్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ మరియు స్పోర్ట్ అనే ఐదు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ ఎస్‌యూవీ టాప్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు. కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో బిఎస్ 6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది.

Most Read Articles

English summary
Ford EcoSport Turns Turtle In Mumbai. Read in Telugu.
Story first published: Monday, June 21, 2021, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X