హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా, అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయడం జరిగింది. మోటార్ వాహన చట్టాన్ని కూడా మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఇందులో ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకుంటే భారీ జరిమానాలు విధించడంతో పాటు.. కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.

అయితే ఇటీవల ముంబై ట్రాఫిక్ పోలీసులు మోటార్‌సైకిల్‌లో వెనుక ప్రయాణించే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని ప్రకటించారు. దీని గురించి మరింత సమాచారం వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

ముంబైలో ఈ నియమం మరో 15 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నియమం అమలులోకి వచ్చిన తరువాత ద్విచక్ర వాహన వినియోగదారులు ఉల్లంగించినట్లైతే వారికి రూ. 500 వరకు జరిమానా విధించబడుతుంది. అంతే కాకూండా వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడు నెలలపాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

రోడ్డు ప్రమాదాల్లో రైడర్ మాత్రమే హెల్మెట్ ధరించి మిగిలినవారు ధరించకపోతే ప్రమాదాల్లో వారికి మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. కావున దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ కొత్త నియమం తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ముంబై ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి రూ.500 జరిమానా లేదా వారి లైసెన్స్‌లను కొన్ని రోజులపాటు సస్పెండ్ చేస్తున్నారు.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

అయితే ఇప్పుడు ప్రకటించిన ఏ రూల్ కూడా తప్పనిసరిగా పాటించాలి. లేకుంటే వారికి కూడా అదే వర్తిస్తుంది. ఈ నియమ మరో 15 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది. ఇది ఒకింత వాహన వినియోగదారులకు కష్టంగా ఉన్నా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే సురక్షితమైన ప్రయాణం కావాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

ఇప్పటికే మనదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైడర్ తో పాటు పిలియన్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. లేకుంటే వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ నియమం రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల్లోకి వ్యాపిస్తుంది. తద్వారా తప్పకుండా ప్రమాదాలలో మరణాల రేటు బాగా తగ్గుతుంది అని ఆశిస్తున్నాము.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

ఇదిలా ఉండగా ఇటీవల మరో కొత్త నియమం కూడా అమలులోకి వచ్చింది. దీని ప్రకారం హెల్మెట్ సరిగ్గా ధరించకపోతే వారికి రూ. 2,000 వరకు జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అంతే కాకూండా హెల్మెట్ ధరించి, హెల్మెట్ పట్టీ తెరిచి ఉంటే వారికి రూ. 1,000 వరకు జరిమానా విధించబడుతుంది. కావున వాహన వినియోగదారులు తప్పకుండా ఈ నియమాలను దృష్టిలో ఉంచుకోవాలి.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

అంతే కాకుండా.. వాహన వినియోగదారులు ఉపయోగించే హెల్మెట్స్ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' చేత తప్పకుండా ధృవీకరించబడి ఉండాలి. ఆలా ద్రువీకరించబడకపోతే రూ. 1,000 జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనితోపాటు మీరు హెల్మెట్ ధరించి ఉండి కూడా ట్రాఫిక్ సిగ్నెల్ క్రాస్ చేసినా.. మీకు రూ.2000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కావున ద్విచక్ర వాహనదారులు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

ఇప్పటికే భారతదేశంలో సురక్షితం కానీ హెల్మెట్స్ అమ్మకం కానీ.. వినియోగించడం కానీ పూర్తిగా నిషేదించింది. ఇది 2021 జూన్ నుండి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలో బిఐఎస్ సర్టిఫికేట్ లేని హెల్మెట్ల ఉత్పత్తి మరియు అమ్మకాలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు మార్కెట్లో బీఐఎస్ సర్టిఫికేట్ లేకుండా ఉండే హెల్మెట్‌లను విక్రయించడం శిక్షార్హమైన నేరం.

హెల్మెట్ ధరించడంపై కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇక తప్పకుండా అలా చేయాల్సిందే..!!

ఈ నోటిఫికేషన్ ప్రకారం, కొత్త నిబంధన జూన్ 1, 2021 నుండి అమలు చేయబడింది. ఇప్పుడు ఐఎస్‌ఐ లేని హెల్మెట్‌లను విక్రయిస్తే కనీసం 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించబడే అవకాశం ఉంది. ఈ నిబంధన ఐఎస్‌ఐ కాని హెల్మెట్‌ల తయారీదారులకు, దిగుమతిదారులకు మరియు అమ్మకందారులకు సమానంగా వర్తిస్తుంది.

Most Read Articles

English summary
Mumbai pillion rider no helmet fine rs 500 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X