రాంగ్ సైడ్‌లో ప్రయాణిస్తే జరిమానా కాదు, ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదే..!!
రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది చాలా ప్రమాదకరమైన అలవాటు. కొద్ది దూరమే కదా ఏమవుతుందిలే అని చాలా మంది తప్పని తెలిసి కూడా తప్పుడు దారి (రాంగ్ రూట్) లో ప్రయాణిస్తుంటారు. ఇది కేవలం వారికి మాత్రమే కాకుండా, ఎదురుగా ప్రయాణించే వారికి కూడా ప్రమాదకరమే. అందుకే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం, ఇప్పటి వరకూ పోలీసులు ఈ ట్రాఫిక్ నేరాకి జరిమానాలు మాత్రమే విధించే వారు, అయితే ఇకపై సీన్ మరోలా ఉండనుంది. రాంగ్ సైడ్ లో ప్రయాణించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అది ఎక్కడో, ఆ వివరాలేంటో చూద్దాం రండి.

దేశ వాణిజ్య రాజధానికిగా పేరుగాంచిన ముంబై మహా నగరంలో రాంగ్ సైడ్ డ్రైవర్లతో చిర్రెత్తిపోయిన పోలీసులు అధికారులు, ఇకపై ఇలా రాంగ్ సైడ్ లో వాహనాలను నడిపే వారికి జరిమానాలు విధించడం కాకుండా వారిపై నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించారు. రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అధికారులు ఆదేశించారు. ఇలా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడిన వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.

భారతదేశంలో చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను సరిగ్గా పాటించరు. మనదేశంలో వాహనదారులు చేసే అత్యంత సాధారణ ట్రాఫిక్ నేరాలలో రాంగ్ సైడ్ లో ప్రయాణించడం ఒకటి. దీంతో ఎదురుగా వచ్చే వాహనదారులకు ఆటంకం ఏర్పడుతోంది. రాంగ్ సైడ్‌లో ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు, అయినా అదే పని చేస్తుంటారు.

ప్రజలు రాంగ్ రూట్ లో వెళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చుట్టూ తిరిగి రావడాన్ని తగ్గించుకోవడం, సమయాన్ని ఆదా చేయడం, ఇంధనాన్ని ఆదా చేసుకోవడం మరియు నిర్లక్ష్యం వంటివి ఈ ట్రాఫిక్ నియమ ఉల్లంఘనకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. జాతీయ రహదారులు, నగర రహదారులు, గ్రామీణ రహదారులు ఇలా అన్ని రకాల రోడ్లపైనా రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వాహనదారులను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.

రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం కారణంగా వాహనదారులు తరచూ ఈ తప్పిదాన్ని చేస్తూనే ఉంటటారు. ఈ నేపథ్యంలో, అయితే రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ విషయంలో మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో రాంగ్ సైడ్ లో ప్రయాణించే వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

రాంగ్ సైడ్ లో ప్రయాణించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా అవసరమైన వారి వాహనాన్ని కూడా జప్తు చేస్తామని తెలిపారు. కాబట్టి, ఇకపై ముంబైలో రాంగ్ సైడ్ లో ప్రయాణించే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పబ్లిక్ రోడ్లపై బైక్ రేసుల్లో పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు చెప్పారు.

పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై ముంబైలోని కమ్యూనిటీ కార్యకర్తలు మాట్లాడుతూ, "చాలా కాలంగా రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వాహనదారులపై మేము ముంబై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాము. దీని కోసం మేము ఫోటోలు మరియు వీడియోలను కూడా సమర్పించాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ప్రకటించడం శుభపరిణామం" అని అన్నారు. ఈ నిర్ణయంతో వాహనదారుల్లో మరింత అవగాహన పెరుగుతుందని భావిస్తున్నామని, వాహనదారులు ఇకపై రాంగ్ సైడ్‌లో ప్రయాణించకుండా ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు.

ఈ నిర్ణయం ప్రస్తుతానికి ముంబై నగరానికి మాత్రమే పరిమితం అని ఇతర రాష్ట్రాలలోని వారు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఎందుకంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో రాంగ్ సైడ్‌లో ప్రయాణించే వారిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో మరణాలు మరియు గాయాల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా క్రమక్రమంగా ఇలాంటి కఠినమైన ట్రాఫిక్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలు, గాయపడే వారి సంఖ్యను తగ్గించవచ్చు. కాబట్టి రోడ్ సేఫ్టీ విషయంలో అన్ని నియమాలను సరిగ్గా అనుసరించడం మీకు అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ప్రమాదానికి గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది మరియు అనవసరమైన జరిమానాలను నివారిస్తుంది. రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించడం ఇతర వాహనదారులకు కూడా మేలు చేకూరుస్తుంది.
గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమేనని గమనించగలరు.


Click it and Unblock the Notifications