Amitabh and Anushka Sharma హెల్మెట్‌ లేకుండా బైక్‌పై అమితాబ్‌, అనుష్క.. చలానా విధించిన పోలీసులు

బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, అనుష్క శర్మ ఈ మధ్య ఇద్దరూ సోషల్‌ మీడియాలో నెటిజన్లకు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వారు చేసిన పనికి ఓ వైపు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిసినా.. మరో వైపు వారి నుంచి విమర్శలూ ఎదుర్కొన్నారు. షూటింగ్‌కు ఆలస్యమవుతుండగా బైకర్ల సాయం తీసుకున్న వారికి ముంబయి పోలీసుల నుంచి చుక్కెదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

అమితాబ్‌ బచ్చన్‌, అనుష్క శర్మ.. ఇద్దరూ పెద్ద సెలబ్రిటీలు. వారికి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. అలాంటి వారు ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. హెల్మెట్‌ లేకుండా అభిమాని బైక్‌పై అమితాబ్‌, బాడీగార్డ్‌ బైక్‌పై అనుష్క షూటింగ్‌కు వెళ్లారు. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని ఇద్దరూ షేర్‌ చేసుకోవడంతో అది వారిని చిక్కుల్లో పడేసింది.

Amitabh and Anushka Sharma

వారి పోస్టుపై స్పందించిన నెటిజన్లు బైకర్లు ఇద్దరూ హెల్మెట్‌లు పెట్టుకోలేదని కామెంట్లు చేశారు. రూల్స్‌ సాధారణ ప్రజలకేనా.. సెలబ్రిటీలకు లేవా అంటూ ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేశారు. దీనిపై స్పందించిన ముంబయి పోలీసులు.. యాక్షన్‌ తీసుకున్నారు. అనుష్క బాడీగార్డ్‌ కమ్‌ డ్రైవర్‌ సోనూ షేక్‌కు రూ. 10,500 జరిమానా విధించారు. అమితాబ్‌కు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి సైతం రూ. 1000 ఫైన్‌ విధించారు. ఇద్దరూ ఆ మొత్తాన్ని చెల్లించినట్లు పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్‌ - ముంబైలో ఇటీవల అమితాబ్‌ కారులో షూటింగ్‌కు వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు అటుగా వెళ్తున్న బైకర్‌ సాయంతో లొకేషన్‌కు సమయానికి చేరుకున్నారు. ఆ విషయాన్ని ఫొటోతో సహా అమితాబ్‌ స్వయంగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. సాయం చేసినందుకు థాంక్స్‌ బడ్డీ అంటూ ధన్యవాదాలు తెలిపారు.

Amitabh and Anushka Sharma

అనుష్క తన రేంజ్‌ రోవర్‌ కారులో షూటింగ్‌కు వెళ్తుండగా దారిలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో అనుష్క తన బాడీగార్డ్‌ బైక్‌(Bazaz Pulsar 220) పై అతని సాయంతో షూటింగ్‌కు బయలుదేరింది. ఆ వీడియోను అనుష్క సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.

వారి సింప్లిసిటీకి నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. మరో వైపు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం నెటిజన్ల విమర్శలను ఎదుర్కొన్నారు. అమితాబ్‌, అనుష్క.. ఇద్దరూ హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో పలు రకాల కామెంట్లు చేశారు. సమయానికి గమ్య స్థానం చేరుకోవడం అవసరమే.. అంతకంటే ముందుగా బాధ్యత, జాగ్రత్త కూడా ముఖ్యమంటూ కామెంట్లు పెట్టారు.

Amitabh and Anushka Sharma

ఇద్దరినీ బెక్‌ ఎక్కించుకొని డ్రైవ్‌ చేసినవాళ్లు హెల్మెట్‌ పెట్టుకోకపోవడంతో హెల్మెట్‌ పెట్టుకోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. రూల్స్‌ సామాన్యులకేనా.. సెలబ్రిటీలకు కాదా అంటూ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేస్తూ పోస్టులు చేశారు. స్పందించిన పోలీసులు వారికి లిఫ్ట్‌ ఇచ్చిన బైకర్లకు జరిమానా విధించారు.

ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం రైడర్ భద్రతకు చాలా అవసరం. భారత్‌లో హెల్మెట్ ధరించడం ప్రభుత్వం చట్టపరం చేసింది. హెల్మెట్‌ను పట్టీలతో తలకు భద్రపరచడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అది నిరుపయోగంగా మారుతుంది. దానిని సరిగా అమర్చుకోవాలి. హెల్మెట్‌లు పెద్ద వాహనాల ద్వారా జరిగే ప్రమాదాల నుండి రక్షించలేనప్పటికీ, అనేక ఇతర పరిస్థితుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రస్తుతం అమితాబ్‌.. ప్రభాస్‌ హీరీగా నటిస్తున్న 'ప్రాజెక్టు కె'(Project K) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల, అతను రిభు దాస్‌గుప్తా రచన, దర్శకత్వం వహించిన సెక్షన్ 84 సినిమా షూటింగ్‌లోనూ తిరిగి బిజీ అయిపోయారు. ఇందులో డయానా పెంటీ, అభిషేక్ బెనర్జీ మరియు నిమ్రత్ కౌర్ నటిస్తున్నారు. అనుష్క.. భారత మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'చక్దా ఎక్స్‌ప్రెస్‌'లో నటిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, May 18, 2023, 9:07 [IST]
English summary
Mumbai police imposed fine on amitabh and anushka sharma for not wearing helmets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+