కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి 2020 మార్చి 24 నుంచి దేశం లాక్‌డౌన్ అమలు చేయబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో బస్సులు, ఆటో మరియు టాక్సీలతో సహా అన్ని రకాల ప్రజా రవాణా సేవలను నిషేధించారు.

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

ప్రైవేట్ మరియు ద్విచక్ర వాహనాల ట్రాఫిక్ కూడా పరిమితం చేయబడింది. ఈ పరిమితిని ఉల్లంఘిస్తూ అనవసరంగా బయట తిరుగుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారణంగా, లాక్ డౌన్ సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశలవారీగా లాక్ డౌన్ సడలించడం జరిగింది.

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

దీనివల్ల నేడు వాహనాల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. కరోనావైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లాక్ డౌన్ ఇప్పటికీ అమలులోనే ఉంది. ఇటువంటి ప్రాంతాలలో ముంబై కూడా ఒకటి.

MOST READ:టెస్టింగ్ దశలో మహీంద్రా మోజో బిఎస్6; త్వరలో విడుదల - వివరాలు

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

కరోనావైరస్ హాట్ స్పాట్‌గా అవతరించిన ముంబైలో అనవసరంగా బయట తిరిగే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం, ముంబై పోలీసులు ఏ కారణం లేకుండా ఏ వ్యక్తి అయినా 2 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించరాదని ఒక నిబంధన కూడా జారీ చేశారు.

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

ఈముంబై లో 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారై వాహనాలు స్వాధీనం చేసుకోబడుతున్నాయి. కానీ ఆఫీసులకు వెళ్లి అవసరమైన సేవలను అందించే వారికి ఈ నియమం నుండి మినహాయింపు ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారి వాహనాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 3దాదాపు 4,000 వాహనాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ముంబై పోలీసులు ఇప్పుడు కొత్త తలనొప్పిని ఎదుర్కొంటున్నారు.

MOST READ:ఆటో రిక్షాలకు సరి & బేసి విధానం, ఎక్కడో తెలుసా ?

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

స్వాధీనం చేసుకున్న వాహనాల పార్కింగ్‌కు తగినంత స్థలం లేకపోవడమే దీనికి కారణం. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు దొంగిలించబడతాయనే భయంతో పోలీసులు వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇచ్చారు.

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

దీని గురించి మాట్లాడుతూ, జప్తు చేసిన వాహనాలు దొంగిలించబడవచ్చు లేదా దెబ్బతినే అవకాశం ఉంది. వాహన యజమానులు వారి పరిస్థితి గురించి ఫిర్యాదు చేయడాన్ని మేము అంగీకరించాము. ఈ కారణంగా వాటిని వారి యజమానులకు తిరిగి ఇవ్వడం జరుగుతోంది.

MOST READ:మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే

కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి

పార్కింగ్ సమస్య నుండి వాహనాలు సులభంగా బయటపడగలవు కాబట్టి అనవసరంగా ఇంటి నుండి బయట తిరగ కూడదని పోలీసులు విజ్ఞప్తి చేసారు. పోలీసుల చర్యలు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మారవచ్చు. కరోనా సమస్య ముగిసే వరకు అనవసరమైన ప్రయాణం చేయకపోవడం, అనవసరంగా బయట తిరగటం వంటివి చేయకపోవడం చాలా మంచిది.

ఎందుకంటే రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి నివారణలో భాగంగా పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటే ప్రజలు వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరగటం ఏ మాత్రం సబబు కాదు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి కరోనా నివారణలో తమ వంతు సహాయంగా ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి.

Most Read Articles

English summary
Mumbai police returning seized vehicles to owners. Read in Telugu.
Story first published: Monday, July 6, 2020, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X