స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు

కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ రోజు రోజుకి చాలా ఎక్కువగా విస్తరిస్తోంది. ఈ మహమ్మరి వల్ల ప్రతి రోజు దాదాపు 3 లక్షల నుండి 4 లక్షల మంది వ్యాధి భారిన పడుతున్నారు. ఈ కరోనా నివారణకు ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ మరియు లాక్ డౌన్ వంటివి అమలుచేశారు.

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

అంతే కాకుండా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి కూడా కొన్ని షరతులతో అనుమతించారు. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి భారిన పడిన చాలామంది ఆక్సిజన్ కొరతతో మరణించారు. ఇంకా కొంత మంది ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్నారు.

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

ఇదిలా ఉండగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే రోజులో 30,000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు మరియు వైద్య పరికరాల కొరత ఏర్పడింది. దీనితో పాటు అతయవసర సమయంలో అంబులెన్సులు కొరత కూడా ఏర్పడింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్‌లను పిలిచినప్పటికీ వాటికి సేవలు అందించడం లేదని ఫిర్యాదులు కూడా వచ్చాయి.

MOST READ:ఆటో పైలట్ మోడ్‌లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

అంబులెన్సుల కొరతను తీర్చడానికి చెన్నై మెట్రోపాలిటన్ పోలీసులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై నగరానికి కొత్తగా నియమితులైన గగన్ దీప్ సింగ్ బేడి కార్లను అంబులెన్స్‌లుగా మార్చాలని ఆదేశించారు. కరోనా సోకిన వారిని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు లేవని తెలుసుకుని అతడు ఉత్తర్వులు జారీ చేశారు.

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

నగరంలోని కొన్ని ప్రధాన ఆసుపత్రులలో బెడ్లు కూడా సరిపోకపోవడం వల్ల, రోగులు అంబులెన్సులలోనే ఆసుపత్రి గేట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీనివల్ల చాలా మంది అంబులెన్స్‌లలోనే ఉండాల్సి వస్తోంది.

MOST READ:బెంగళూరులో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బస్సులు; పూర్తి వివరాలు

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో అంబులెన్స్‌ల కొరతకు ఇది ఒక ప్రధాన కారణంగా మారింది. దీనిని తగ్గించడానికి, నగర పాలసీ కమిషనర్ కార్లను అంబులెన్స్‌లుగా మార్చాలని సూచించారు. ఇందుకోసం సుమారు 250 కార్లను అంబులెన్స్‌లుగా మార్చినట్లు సమాచారం.

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

ఈ అంబులెన్సులు ప్రభుత్వ మెడికల్ స్పెషల్ ఎమర్జెన్సీ వెహికల్ పేరుతో పనిచేస్తున్నాయి. ఈ తాత్కాలిక అంబులెన్స్‌లలో వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్‌తో సహా ప్రధాన వైద్య పరికరాలు ఉన్నాయి. ఈ కార్లు అంబులెన్సులను దీటుగా నడుస్తాయి.

MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్‌లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

అంబులెన్స్‌ల కొరతను తగ్గించడానికి ఈ అంబులెన్స్‌లను 15 జోన్లలో మోహరించారు. ఈ అంబులెన్స్‌లలో కొన్ని చిన్న మార్పులు చేయబడ్డాయి. ఈ అంబులెన్స్‌లలో, రోగి నిద్రిస్తున్న సీటును ఫోల్డ్ చేయవచ్చు. ఆక్సిజన్ సిలిండర్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను దానిపై ఉంచారు. అంబులెన్స్‌లకు అధిక డిమాండ్ ఉన్న చోట ఈ వాహనాలు వినియోగించవచ్చు.

స్పెషల్ కార్ అంబులెన్స్‌ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మెట్రోపాలిటన్; వివరాలు

మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక యువ పారిశ్రామికవేత్త ఇటీవల తమ కార్లన్నింటినీ అంబులెన్స్‌లుగా మార్చడం ద్వారా పేద ప్రజలకు సహాయం చేయడం కూడా గమనార్హం. ఏది ఏమైనా ఈ కరోనా కష్ట సమయంలో చాలామంది స్వచ్చందంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో తమ విశాల హృదయాన్ని చాటుకుంటున్న వ్యక్తులు నిజంగా ప్రశంసనీయులు.

MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే

Most Read Articles

English summary
Municipal Commissioner Starts Special Car Ambulance Service In Chennai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X