మిచాంగ్ తుపాన్ సమయంలో ప్రయాణాలు చేస్తున్నారా.. మీ కారులో ఈ ఫీచర్లున్నాయా?
మిచాంగ్ తుపాన్ (Michaung cyclone) కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షసూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంద్ర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలను రద్దు చేసుకోవడం చాలా ఉత్తమం. అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం కారులో కొన్ని ఫీచర్లు కచ్చితంగా ఉండాలి. ఫలితంగా ప్రయాణం చాలా సురక్షితంగా మారుతుంది. తుపాన్ వంటి పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రత్యేక కథనం మీకోసం.

ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ : కారు లేదా వాహన టైర్లు మరియు రోడ్డు ఉపరితలం మధ్య ట్రాక్షన్‌ను కంట్రోల్ చేసేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. తడి రోడ్లపై వేగంగా డ్రైవింగ్ చేసినప్పుడు వాహనం నియంత్రణ కోల్పోకుండా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ నిరోధిస్తుంది. ఎలాంటి రోడ్లపైనైనా స్థిరంగా డ్రైవింగ్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఆటోమేటిక్ రెయిన్ వైపర్ : వర్షాకాలంలో ప్రతి కారులో ఉండాల్సిన ఫీచర్‌లో ఇది ఒకటి. వాహనం విండ్ షీల్డ్‌పై పడే వర్షపు నీటిని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. వెంటనే వైపర్‌లను యాక్టివేట్ చేస్తుంది. సాధారణ, భారీ వర్షాల సమయంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ సరైన వాహన డ్రైవర్‌కు సరైన విజిబిలిటీ ఉండేలా చూస్తుంది.
హైడ్రోఫోబిక్ గ్లాస్ కోటింగ్ : కారు విండ్ స్క్రీన్‌కు పూతగా ఉంటుంది. వైపర్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా వర్షం కురుస్తున్న సమయంలో విజిబిలిటీని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
ABS : వర్షాకాలంలో తడి రోడ్లపై బ్రేకింగ్ సమయంలో చక్రాలు లాక్ కాకుండా ABS - యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ నిరోధిస్తుంది. ఫలితంగా కారును సులభంగా నియంత్రించవచ్చు. రోడ్లపై వాహనాలు జారిపోకుండా ABS పనిచేస్తుంది.
వాటర్ రిపిల్లెంట్ అప్హోల్స్టరీ : కారులోని సీట్లు తేమను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా వర్షాకాలంలోనూ కారు సీట్లు చాలా శుభ్రంగా ఉంటాయి. కారు క్యాబిన్‌ను శుభ్రంగా ఉంటుంది.
రెయిన్ గట్టర్లు : కారు కిటికీలు పాక్షికంగా తెరిచి ఉన్నప్పుడు క్యాబిన్‌లోకి వర్షపు నీరు చేరకుండా ఈ రెయిన్ గట్టర్‌లు సహాయపడతాయి. ఫలితంగా కారు లోపల భాగం తడి లేకుండా శుభ్రంగా ఉంటుంది.
ఆల్‌వీల్ డ్రైవ్ సిస్టమ్ : ఆల్‌వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇంజిన్ పవర్‌ను కారులోని నాలుగు చక్రాలకు పంపిణీ చేసేందుకు సహకరిస్తుంది. తడి రోడ్లపై మెరుగైన ట్రాక్షన్ కంట్రోల్‌ను అందిస్తుంది. సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన డ్రైవింగ్‌కు సాయపడుతుంది.
గ్రౌండ్ క్లియరెన్స్ : వర్షాకాలంలో వరదలతో నిండిన రోడ్లపై డ్రైవింగ్ చేయాలంటే అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. ఫలితంగా ఇంజిన్ లోపలికి నీరు ప్రవేశించే అవకాశం ఉండదు. మరియు ఆఫ్ రోడ్‌పై ప్రయాణించేటప్పుడు కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ముఖ్యం.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: తుపాన్లు, భారీ వర్షాల సమయంలో కారులో ప్రయాణించే సమయంలో ఈ ఫీచర్లు పనితీరును తనిఖీ చేయండి. ఈ ఫీచర్లు కచ్చితంగా ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యంగా ఉంచుతాయి. వర్షపు నీటి నుంచి ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించవచ్చు.


Click it and Unblock the Notifications








