వర్షాకాలంలో కారులో కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్లు.. వీటి ఉపయోగాలు తెలుసా?

భారత్‌లో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా వానలు కురుస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కారులో కొన్ని ఫీచర్లు ఉంటే, ప్రయాణం చాలా సురక్షితంగా ఉంటుంది. ఆ సౌకర్యాలు, ఫీచర్ల కోసం ఈ ప్రత్యేక కథనం.

ఆటోమేటిక్‌ రెయిన్‌ వైపర్‌: వర్షాకాలంలో ప్రతి కారులో ఉండాల్సిన ఫీచర్‌ ఇది. వాహనం విండ్‌ షీల్డ్‌పై పడే వర్షపు నీటిని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. వెంటనే వైపర్‌లను యాక్టివేట్‌ చేస్తుంది. సాధారణ, భారీ వర్షాల సమయంలో ఈ ఫీచర్‌ సరైన విజిబిలిటీ ఉండేలా చూస్తుంది.

must have car features during monsoon

హైడ్రోఫోబిక్‌ గ్లాస్‌ కోటింగ్ : ఇది కారు విండ్‌ స్క్రీన్‌కు పూతగా ఉంటుంది. వైపర్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా వర్షం కురుస్తున్న సమయంలో విజిబిలిటీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. రెయిన్‌ గట్టర్లు : కారు కిటికీలు పాక్షికంగా తెరిచి ఉన్నప్పుడు క్యాబిన్‌లోకి వర్షపు నీరు చేరకుండా ఈ రెయిన్‌ గట్టర్‌లు సహాయపడతాయి. ఫలితంగా కారు లోపల భాగం తడి లేకుండా శుభ్రంగా ఉంటుంది.

ఆల్ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌: ఆల్‌ వీల్ డ్రైవ్‌ సిస్టమ్‌ ఇంజిన్‌ పవర్‌ను కారులోని నాలుగు చక్రాలకు పంపిణీ చేసేందుకు సహకరిస్తుంది. తడి రోడ్లపై మెరుగైన ట్రాక్షన్‌ కంట్రోల్‌ను అందిస్తుంది. సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన డ్రైవింగ్‌కు ఈ ఫీచర్‌ సాయపడుతుంది.

must have car features during monsoon

ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌: కారు టైర్లు, రోడ్డు ఉపరితలం మధ్య ట్రాక్షన్‌ను కంట్రోల్‌ చేసేందుకు ఈ ఫీచర్‌ సహాయపడుతుంది. తడి రోడ్లపై వేగంగా డ్రైవింగ్‌ చేసినప్పుడు వాహనం నియంత్రణ కోల్పోకుండా ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ నిరోధిస్తుంది. ఎలాంటి రోడ్లపైనైనా స్థిరంగా డ్రైవింగ్ చేసేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

వాటర్‌ రిపిల్లెంట్‌ అప్హోల్స్టరీ: కారులోని సీట్లు తేమను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా వర్షాకాలంలోనూ కారు సీట్లు చాలా శుభ్రంగా ఉంటాయి. కారు క్యాబిన్‌ను శుభ్రంగా ఉంటుంది. ABS -యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌ : వర్షాకాలంలో తడి రోడ్లపై బ్రేకింగ్‌ సమయంలో చక్రాలు లాక్ కాకుండా ABS నిరోధిస్తుంది. ఫలితంగా కారును సులభంగా నియంత్రించవచ్చు. రోడ్లపై వాహనాలు జారిపోకుండా ABS పనిచేస్తుంది.

must have car features during monsoon

గ్రౌండ్‌ క్లియరెన్స్ : వర్షాకాలంలో వరదలతో నిండిన రోడ్లపై డ్రైవింగ్‌ చేయాలంటే అధిక గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉండాలి. ఫలితంగా ఇంజిన్‌ లోపలికి నీరు ప్రవేశించే అవకాశం ఉండదు. మరియు ఆఫ్‌ రోడ్‌పై ప్రయాణించేటప్పుడు కూడా మంచి గ్రౌండ్‌ క్లియరెన్స్‌ చాలా ముఖ్యం.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య: వర్షాకాలంలో కారులో ప్రయాణించే సమయంలో ఈ ఫీచర్ల పని తీరును తనిఖీ చేయండి. ఈ ఫీచర్లు కచ్చితంగా ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యంగా ఉంచుతాయి. వర్షపు నీటి నుంచి ఎదురయ్యే సవాళ్లను సులభంగా ఈ ఫీచర్ల సాయంతో సమర్ధవంతంగా అధిగమించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 26, 2023, 19:11 [IST]
English summary
Must have car features during monsoon from abs to rain gutters
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+