Live Video వాణిజ్య నౌక హైజాక్.. యుద్ధనౌకను పంపిన ఇండియన్ నేవీ.. మెరైన్ కమాండర్ల దెబ్బకు పరారైన హైజాకర్లు..!
సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండియన్ నేవీ సహా ఇతర దేశాల నావికాదళాలు దీనిపై నిఘాపెట్టాయి. అయితే తాజాగా భారత్ నౌకాదళం తన సత్తా చూపింది. గురువారం ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణం చేస్తున్న ఓ వాణిజ్య నౌక ఎం ను కొందరు దుండగులు హైజాక్ చేశారు. ఈ సమాచారాన్ని యునైడెట్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ద్వారా ఇండియన్ నేవీకి అందింది.
హైజాక్ అయిన షిప్‌లో 15 మంది భారత సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఇండియన్ నేవీ అప్రమత్తం అయింది. INS చెన్నై నౌకతోపాటు, యుద్ధ విమానాన్ని, డ్రోన్లను రంగంలోకి దింపింది. ఈ INS చెన్నై (INS Chennai) .. వాణిజ్య నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేసుకుంది.

హైజాకర్లకు తీవ్ర హెచ్చరిక జారీచేసింది. నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించింది.
అనంతరం ఇండియన్ నేవీ మెరైన్ కమాండర్లు ఎంవిలీలా నౌకలోకి (Mv Lila ship) ప్రవేశించారు. సిబ్బందిని క్షేమంగా కాపాడారు. అయితే తమ కమాండర్లు వెళ్లేసరికే హైజాకర్లు పారిపోయినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ఇండియన్ నేవీగా నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.
అయితే ఈ రెస్క్యూ మిషన్ కోసం ఇండియన్ నేవీ INS చెన్నైనే ఎందుకు పంపింది. ఈ ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధ నౌకలో అనేక ఆధునిక ఆయుధాలు, సెన్సార్లు ఉంటాయి. దీంతోపాటు శత్రు యుద్ధ నౌకలపైనే కాకుండా శత్రు విమానాలపైన కూడా సమర్థవంతంగా దాడిచేయగలదు. ఇందుకోసం అనేక ఆయుధాలను కలిగి ఉంది.

INS చెన్నై యుద్ధనౌకను భారత్‌లోనే డీఆర్‌డీవో సాయంతో నిర్మించారు. ఈ యుద్ధనౌకలో నాలుగు AK-630 గన్స్‌ను కలిగి ఉంటుంది. మెరుపు వేగంతో శత్రులవు తూటాలను దూసుకెళ్లేలా చేయగలవు. దీంతోపాటు ఈ నౌకలో MR గన్ సౌకర్యం కూడా ఉంది. దీంతోపాటు ట్విన్ బోర్ టార్పెడో లాంచర్‌లు, రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. సూపర్ సోనిక్ బ్రహ్మో్స్ క్షిపణులను ఈ షిప్‌ను సిద్ధం చేశారు. మరియు ఎటువంటి వాతావరణంలోనైనా సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది.
ఎంవీ లీలా వాణిజ్య నౌకను సురక్షితంగా రక్షించినందుకు ఆ నౌక యజమాని స్టీవ్ కుంజర్ ఇండియన్ నేవీకి ధన్యవాదాలు తెలిపారు. INS చెన్నై.. జూన్ 2019లో విధుల్లోకి చేరింది. ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17.4 మీటర్లు, 7500 టన్నుల బరువును కలిగి ఉంటుంది. గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








