సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు, వాటి వెనక దాగున్న రహస్యాలు ...!!

By Anil

ఆధునిక కాలంలో దెయ్యాలు ఎక్కడున్నాయి అని వాదనలాడే వారు చాలా మంది ఉంటారు. దెయ్యాలు ఇంట్లో, బస్సుల్లో రోడ్ల మీద ఉంటాయి అని వినిఉంటాం. కాని సముద్రంలో శయినించే నౌకల్లో కూడా దెయ్యాలు ఉంటాయని విన్నారా ? ప్రపంచ వ్యాప్తంగా సముద్రం మార్గపు రవాణా ఎంతో కీలక భూమిక పోషిస్తోంది. కాని సముద్రం మీద ప్రయాణం నిరంతరం ఎన్నో సవాళ్లతో కూడకుని ఉన్నది.

అయితే చాలా వరకు నౌకలు మనుషులు లేకుండా నడవడం, సముద్రంలో తిరగడం, ఒంటరిగా నౌకలు గింగిరాలు తిరగడం లాంటి ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. అందులో కొన్నింటి గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము.

19. టి.టి జియాన్

19. టి.టి జియాన్

2012 లో 31 అడుగులు ఉన్న సెంటర్ కన్సోల్ జూపిటర్ అనే బోట్ తూర్పు లాస్ ఒలాస్ బౌలివార్డ్‌లోని ఫోర్ట్ లాడర్ డాల్ బీచ్‌లో ఒటరిగా తిరుగుతూ దర్శనమిచ్చింది. ఇందులోని లైట్లు ఇంజన్ వంటివి అన్ని కూడా ఆన్‌లో ఉన్నాయి. అయితే దీని ఓనర్ లేదా ఏ ఇతర మనుషులు ఇందులో లేరు. అయితే దీనిని ఎవరు నడుపుతున్నారు అనేది మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది.

18.యంగ్ టీజర్

18.యంగ్ టీజర్

1813 లో ఈ యంగ్ టీజర్ అనే నౌకను మహోని బే అనే ప్రాంతంలో నోావ స్కాటియ్ అనే వ్యక్తి చేత ధ్వంసం చేయంబడింది. ఇందులోని దెయ్యం బాధ భరించలేక ఆ కోపంతో దీనిని అంతం చేసినట్లు తెలిసింది. దీనిని నిర్మించిన తరువాత ఇది కేవలం రెండు సంవత్సరాల పాటు మాత్రమే సేవలందించింది.

Picture credit: upyim

17. జెబ్రినా

17. జెబ్రినా

జెబ్రినా అనే ఈ నౌక 1917 లో బొగ్గును రవాణా చేయడానికి సిద్దమైందో. ఇందులో ఐదు మంది వరకు సిబ్బంది ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే ప్రమాదానికి గురైనట్లు లేదా ఇబ్బందిని ఎదొర్కన్నట్లు ఎటుంవంటి సమాచారం ఆ నౌక నుండి రాలేదు. కాని అందులోని ఐదు మంది కూడా అదృశ్యమయ్యారు. దెయ్యాలను కలిగి ఉన్న ఈ నౌక వారిని అంతం చేసిందని తరువాత రోజుల్లో స్పష్టమైంది.

Picture credit: coolinterestingstuff

16. ఎస్‌వి లునాటిక్

16. ఎస్‌వి లునాటిక్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాన్ని చుట్టేయాలనే కోరికతో ఉన్న 70 సంవత్సరాల వయస్సున్న జురి స్ట్రెక్ అనే వ్యక్తి 2007 లో ఈ లునాటిక్ బోటును సిద్దం చేసుకున్నాడు. ఇందులో సమాచారం కోసం రేడియోను వినియోగించేవాడు. దీనిని బ్రాడ్ కాస్టింగ్ సంస్థ 2009 జనవరి 1 న సేవలందించడం నిలిపివేసింది. సరిగ్గా నెల తిరిగే సరికి ఆ బోటు ఆస్ట్రేలియా తీరంలో కనిపించింది. అయితే అందులో ఎవరూ లేరు. మూడు నెలల తరువాత అదే బోటు సముద్రానికి మధ్య భాగంలో ఉన్నట్లు సైన్స్ వెస్సల్ ఆర్‌వి వెగర్ రివెల్లి అనే వారు గుర్తించారు. అప్పటికీ ఇందులో ఎవరూ లేనట్లు గుర్తించారు.

Picture credit: yachttrack

15. కాజ్ 11

15. కాజ్ 11

33 అడుగులు పొడవున్న ఈ నౌకను ఆస్ట్రేలియా సముద్ర తీరానికి సుమారుగా 88 నాటికల్ మైళ్ల దూరంలో 2007 లో గుర్తించారు. దీనిని గుర్చించిన సమయంలో ఇందులోని ఇంజన్, రేడియే, సాంకేతిక వ్యవస్థ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మరియు ఈ బోటులోని డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేయడానికి ఆహార పదర్థాలు కూడా సిద్దంగా ఉన్నాయి. అయితే ఇందులో మనుషులే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

Picture credit: coolinterestingstuff

14. జింగ్ సెంగ్

14. జింగ్ సెంగ్

2006 లో ఆస్ట్రేలియాకు చెందిన తీర దళం దీనిని గుర్తించింది. ఇందులో ఎటువంటి మానవ చర్యలు జరగలేదని వారు గుర్తించారు. కాని ఇందులో ఎన్నో అనధికారక కార్యకలాపాలు జరిగినట్లు తెలిసింది. ఒక వేళ ఇందులో మత్సకారులు వెళ్లి ప్రమాదానికి గురయ్యారేమో అని అనుమానాలు కూడా వచ్చాయి. వారు మునకకు గురైతే నౌక కూడా మునిగిపోవాలి కదా అనే సందేహం వచ్చింది. అలాగే ఒటరిగా తిరుగుతున్న నౌక ఎట్టకేలకు నావికా దళ సిబ్బందికి

దొరికిపోయింది.

Picture credit: thesun

13. ఔరంగ్ మేడమ్

13. ఔరంగ్ మేడమ్

ఇది 1947 కాలంనాటి డచ్‌కు చెందిన సరుకు రవాణా నౌక. ఇండోనేషియా సముద్రంలో ఇది మునిగిపోయింది. ఇది మునిగిపోవడానికి కారణ వెతకడానికి దర్యాప్తు బృందాలు కూడా వచ్చాయి. ఇందులో ప్రయాణిస్తున్న అందరి చేతులు మరియు మొహాలు భయంకరమైన రీతిలో దాడి చేయబడి ఉన్నాయి. అయితే ఒక చోట చార్ట్‌రూమ్‌లో ఉన్న బ్రిడ్జి కూలిపోవడం వలన ఆఫీసర్లు మరియు కెప్టెన్ అందరూ మరణించారు అని రాసి ఉంది. అందరూ మరణించి ఉంటే ఇలా ఎవరు వ్రాస్తారు అనే విషయం ఇప్పటికీ అంతు చిక్కకుండా ఉంది.

Picture credit: YouTube

12. బెల్ అమికా

12. బెల్ అమికా

2006 లో క్లాసిక్ స్టైల్‌కు చెందిన స్కూనర్ నౌక ఇంతకు ముందు గుర్తించిన నౌకల్లా కాకుండా ఇది సార్దినియా దీవికి సమీపంలో ఉన్న తీరం ప్రాంతంలో నిలిచి ఉన్నప్పుడు దీనిని గుర్తించారు. దీనిని గుర్తించిన సమయంలో ఇందులో ఈజిప్ట్‌కు చెందిన సగం భోజనం, దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్రెంచ్ మ్యాపులు, కొన్ని దుస్తులు మరియు లక్సెంబర్గ్‌కు చెందిన జాతీయ పతాకం ఇలాంటివి ఇందులో కనిపించాయి. వేరు ప్రాంతాలకు చెందిన వేరు పదార్థాలు ఇందులో ఉండటం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Picture credit: weburbanist

11. కారుల్ ఏ డీరింగ్

11. కారుల్ ఏ డీరింగ్

ఈ నౌక బ్రెజిల్‌లోని రియో డి జానీరో అనే ప్రాంతం నుండి సముద్రం మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభంచింది. ఇప్పటికీ ఎంతో మందికి, ఎన్నో పరిజ్ఞానాలకు అంతు చిక్కని బెర్ముడా ట్రాయాంగిల్ మీదుగా అది ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే బెర్ముడా ట్రయాంగిల్ దాటిని తరువాత ఆ నౌక నుండి ఏ విధమైన సమాచారం కూడా అందలేదు. ఆ నౌకతో సంభందాలు పూర్తిగా తెగిపోయాయి. కాని దీనిని గుర్తించడానికి వెల్లిన బృందం కాపె హెట్టారస్ అనే ప్రాంతంలో దీనిని గుర్తించారు. అయితే ప్రయాణిస్తున్న వారి జాడ మాత్రం తెలియలేదు. ఇది ఇలాగే ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది.

Picture credit: Wiki Commons

10.లేడి లోవిబాండ్

10.లేడి లోవిబాండ్

1748 కాలంలో ఈ లేడి లోవిబాండ్ నౌక ఆగ్నేయ ఇంగ్లాండ్‌లేని కెంట్ అనే తీరంలో శిథిలమైపోయింది. అదే ఏడాది ఫిబ్రవరి 13 న ఈ నౌక యొక్క కెప్టెన్ తన పెళ్లి తంతును ఆనంచడానికి పోర్చుగల్ మార్గంలో తన భాగస్వామితో బయలుదేరాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని తన మిత్రుడు ఆ నౌకను నడుపుతూ సముద్రంలో ఉన్న పెద్ద ఇసుక కొండలకు ఢీకొట్టించాడు. దాంతో అందరూ మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు ఇది ఒక ప్రమాదం మాత్రమే. కాని ప్రతి 50 ఏళ్లకొకసారి ఇక్కడ ఒవ నౌక ప్రమాదాన్నిగురికావడం మొదలైంది అది అలాగే కొనసాగుతూ వస్తోంది. 1998 లో కూడా ఒక ప్రమాదం ఇదే ప్రాంతంలో జరిగింది.

Picture credit: vimeo

09. ఎమ్‌వి తై చింగ్ 21

09. ఎమ్‌వి తై చింగ్ 21

2008 అక్టోబర్‌లో తైవాన్‌కు చెందిన చేపలు పట్టే నౌక ప్రయాణాన్ని ప్రారంభించి ఒక నెల రోజులు తరువాత ఖాళీగా తిరుగూ దర్శనిమిచ్చింది. ఇందులో వెళ్లిన సుమారుగా 29 మంది ఆచూకీలేకుండా పోయారు.

Picture credit: hanshuttel

08. హై ఎయిమ్ 6

08. హై ఎయిమ్ 6

తైవాన్‌కు చెందిన మరొక నౌకను 2003లో ఆస్ట్రేలియా తీరానికి సమీపంలో గుర్తించారు. కొన్ని వేల మైళ్ల ప్రయాణించిన ఇందులో తినడాని కోసం అన్నట్లు సముద్రపు ఆహారాన్ని గుర్తించారు. ఇందులో ఉన్న ఇంజనీరు మరియు కెప్టెన్‌ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఏ కారణం లేకుండా నౌకలో ఉన్న వ్యక్తులు అంతం అయిపోవడం నౌక మాత్రం భద్రంగా సముద్రం మీద తేలియాడుతూ ఉండటం వలన ఇది కూడా దెయ్యాలు ఉన్న నౌకల విభాగంలోకి చేర్చబడింది.

Picture credit: bbs.voc

07. స్కూనర్ జెన్నీ

07. స్కూనర్ జెన్నీ

1823 సమయంలో ఈ స్కూనర్ జెన్నీ నౌక నుండి సమీప సమాచార కేంద్రానికి, నేను ప్రయాణిస్తున్న నౌకలో అందరూ చనిపోయారు కాని నేనొక్కడినే 71 రోజుల పాటు ఆహారం లేకుండా బ్రతికున్నాను. అని సమాచారం అందింది. అయితే ఇతను నౌకలో కలం చేతితో పట్టుకుని కుర్చీలో కూర్చున్నట్లుగానే అంటార్కిటికా వాతావరణం అతన్ని చంపేసింది. 17 ఏళ్ల తరువాత తిమింగలాల వేట కోసం వెళ్లిన నౌక అతడిని గమనించి అదే ప్రాంతంలో అతన్ని ఖననం చేశారు.

Picture credit: Aberdeenshire Museums Service

06. కొబెన్నావెన్

06. కొబెన్నావెన్

1920లో దీనిని విద్యార్థులకు నౌకలను నడిపేందుకు శిక్షణ ఇచ్చేందుకు సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే చివరి సారిగా 1928 లో మంచు కొండను ఢీకొన్న ప్రమాదంలో అందరూ ప్రమాదం పాలైనట్లు ఈ నౌక నుండి సమాచారం వచ్చింది. అందులో సుమారుగా 75 మంది ప్రజలు మరియు 45 మంది వరకు క్యాడెట్లు ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదానికి గురైన ప్రదేశంలో కొంత మందికి ఈ నౌక మళ్లీ మళ్లీ కనిపించినట్లు తెలిసింది.

Picture credit: Wiki Commons

05.రూస్ సైమన్స్

05.రూస్ సైమన్స్

చికాగోలో దీనిని సరకు రవాణా కోసం 1912 నుండి వినియోగించడం మొదలుపెట్టారు.ఇది ప్రయాణం ప్రారంభించిన తరువాత సముద్రం మధ్య భాగంలో ఉండగా భారీ స్థాయిలో వచ్చిన తుఫాను ఈ నౌకను నాశనం చేసింది. అయితే అందులో ఒక వ్యక్తి, నేడు శుక్రవారం మేం అందరం ప్రమాదంలో ఉన్నాం అందరమూ చనిపోబోతున్నాం అని సమాచారాన్ని వ్రాసి బాటిలో ఉంచాడు.

Picture credit: husheduphistory

04. కలియూచి

04. కలియూచి

దెయ్యాల నౌకలలో ఇదో మిస్టరీని సృష్టిచింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశంలో రాత్రివేళల్లో అక్కడ పెద్దగా నవ్వడం , గట్టిగా నవ్వడం మరియు వింత శబ్దాలతో పాటు లైటింగ్ ఎక్కువుగా అక్కడ ఉంటుంది.

03. ఎస్ఎస్ వాలెన్సియా

03. ఎస్ఎస్ వాలెన్సియా

cఈ నౌక వాంకోవర్ తీరానికి సమీపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ప్రమాద భారిన పడింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న 108 మందిలో 37 మంది లైఫ్ బోట్ల ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ ప్రమాదం జరిగిన తరువాత అటుగా వెళ్లిన మత్యకారులు అక్కడ వారికి సంభందిచిన అస్థిపంజరాలను గుర్తించారు. కొన్ని శతాబ్దాల తరువాత ఇలాగే గుర్తించగలుగుతున్నారు.

02. ది బేచిమో

02. ది బేచిమో

దీనిని సుమారుగా 1920 ప్రాంతంలో తయారు చేశారు. నిత్య జీవితంలో ఇది 1931 నాటికి పూర్తిగా దెయ్యం చేత నడపబడింది. స్వతహాగా అలస్కా సముద్రం మొత్తం చుట్టేయడం మొదలెట్టింది. సుమారుగా 38 సంవత్సరాల పాటు దీని ప్రయాణం కొనసాగింది. అయితే 1969 తరువాత ఇది ఎక్కడా ఎవ్వరికీ అంతు చిక్కకుండా పోయింది. దీనికి చెందిన మిస్టరీ వీడకుండానే దీనిని మరచిపోవాల్సి వచ్చింది.

01. జోయితా

01. జోయితా

1955 లో చేపల వేటకు ఈ నౌక దక్షిణ పసిఫిక్ సముద్రం మీదుగా వెల్లింది. అయితే ఐదు వారాల తరువాత ఇది మునిగిపోయింది అనే విషయం తెలిసింది. అయితే ఎయిర్ సెర్చ్ దీని కోసం గాలింపు చేపట్టనా ఎటువంటి వివరాలు తెలియరాలేదు. అయితే అది సుమారు 600 మైళ్ల లోతులో మునిగిపోయినట్లు దానికి చెందిన వ్యాపార సంస్థ తెలిపింది.

సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు... !

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

Most Read Articles

English summary
Mysterious Ghost Ships Their Haunted Stories
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X