ఈ రోడ్లపై ఇంజిన్ ఆఫ్ చేసి డ్రైవ్ చేయొచ్చు.. ఇక్కడి వింతలు చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.!!
ఏ వాహనం అయినా సరే దానిని సవ్యంగా నడపాలంటే ఇంజిన్ తప్పనిసరి. కానీ ఇక్కడ ఆ అవసరమేమీ లేకుండా మీ వాహనాన్ని సులభంగా నడపవచ్చు. కొన్ని రోడ్లపై కార్లు ఫ్యూయెల్ సాయం లేకుండా వెళ్తుంటాయి.
కారును నడపాలంటే అందులో ఇంజిన్ లేదా ఎలక్ట్రిక్ మోటార్ పవర్ తప్పనిసరి. ఫ్యూయెల్ అయిపోయినా లేదంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయినా కారు ఆగిపోతుంది. కానీ మీకు తెలుసా.. ఆ దేశాల్లోని కొన్ని రోడ్లపై ఇంజిన్ సాయం లేకుండా, బ్యాటరీ ఛార్జింగ్ లేకపోయినా సునాయాసంగా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అదెక్కడా, ఆ అద్భుతాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి మరి..

1. మౌంట్ అరగట్స్, అర్మేనియా: టర్కీ , అర్మేనియా సరిహద్దుల మధ్య మౌంట్ అరగట్స్ ఉంది. ఈ ప్రాంతంలో కారును న్యూట్రల్‌లో పార్క్ చేసినా, గ్రావిటీ లేకపోవడంతో అది ఆటోమేటిక్‌గా పైకి మూవ్ అవుతుంది. ఈ ప్రాంతాన్ని మరో గ్రావిటీ హిల్ అంటారు. ఈ వింతను చూసేందుకు పర్యాటకులు వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఈ కొండలో ఒక నది కూడా పైకి ప్రవహించడం విశేషం.
2. హూవర్ డ్యామ్, యునైటెడ్ స్టేట్స్: అమెరికాలోని హూవర్ డ్యామ్‌పై ఫ్యూయెల్ లేదా ఎలక్ట్రిక్ పవర్ లేకపోయినా కార్లు నడుస్తాయి. ఇక్కడ గాలి దిశ చాలా రెట్లు వేగంగా పైకి తిరుగుతుంది. దీని ద్వారా వాహనాలు ఆటోమేటిక్‌గా పైకి వెళ్తుంటాయి. 224.1 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ డ్యామ్ నుంచి సీసాలోంచి నీరు కిందికి పోసినా కింద పడదు. బదులుగా పైకి నీటి బిందువులు ఎగురుతుంటాయి.

3. మాగ్నెటిక్ హిల్, లద్దాఖ్: లద్దాఖ్‌లోని మాగ్నెటిక్ హిల్‌పై వాహనాలు ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొండపైకి వెళ్తుంటాయి. లేహ్-కార్గిల్ హైవే నుంచి ఇది 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ కార్లు ఆటోమేటిక్‌గా పైకి వెళ్తుంటాయి. 20 కి.మీ వేగంతో వాహనాలు ఆటోమేటిక్‌గా ముందుకు వెళ్తుంటాయి..
4. స్పోక్ హిల్, యునైటెడ్ స్టేట్స్: సెంట్రల్ ఫ్లోరిడాలో ఉన్న మరో ఫేమస్ 'గ్రావిటీ హిల్' స్పోక్ హిల్. ఇక్కడ కొండపైకి వాహనాలు ఎటువంటి ప్రొపల్షన్ లేకుండా పైకి వెళ్తాయి. ఇది కూడా ఆప్టికల్ భ్రమనే అని చెప్పవచ్చు. ఇక్కడ గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతున్నారు. ఈ అద్భుతాన్ని అనుభవించేందుకు తరచూ పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు.

5. మాగ్నెటిక్ హిల్, సౌత్ ఆస్ట్రేలియా: సౌత్ ఆస్ట్రేలియాలోని బ్లాక్ రాక్ సమీపంలోని ఓరోరూ యొక్క మాగ్నెటిక్ హిల్ ప్రకృతి అందించిన మరో అద్భుతమైన కానుక. ఈ మాగ్నెటిక్ హిల్‌పై వెళ్తున్నట్లయితే మీ వాహనాన్ని కొండపైకి లాగుతున్నట్లు మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంజిన్ సాయం లేకుండా మీ కారు ఈజీగా కదులుతుంది.
ప్రకృతి ఒడిలో ఇలాంటి అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించాం. ఈ రోడ్లపై మీరు వెళ్తున్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసి హాయిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. ఇక్కడ గురుత్వాకర్షణ ఒక రహస్యమైన రీతిలో పనిచేస్తుండటంతో మీ కారు ఇంజిన్ అవసరం లేకుండా ముందుకుపోతుంటుంది.



Click it and Unblock the Notifications








