నీటిపై కూడా బైక్ నడిపే వీరులు.. (వీడియో)
రోడ్డుపై ఎవరైనా బైక్ నడపగలరు. కానీ నీటిపై నడపగలరా..? నీటిపై బైక్ నడపటమా ఇదే చిత్రం అనుకుంటున్నారా.. అసలు ఇది సాధ్యమా అనే అనుమానం వస్తుందా..? అయితే ఈ వీడియోను వీక్షించండి. మీరే ఒప్పుకుంటారు ఇది సాధ్యమని.
సరే నేరుగా విషయానికి వచ్చేస్తే.. ప్రముఖ సైన్స్ ఛానెల్ డిస్కవర్ 'మిత్‌బస్టర్స్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో సైన్సుకు అంతపట్టని నిజాలను తెలియజేస్తుంటారు. ఇందులో భాగంగానే నీటికి, బైక్‌కు మధ్య ఉన్న సీక్రెట్‌ను వివరించారు. రోడ్లపై బైక్ నడిపినప్పుడు, నీటిపై ఎందుకు నడపకూడదనే ఆలోచన వారికి వచ్చింది. అంతే, ఈ ప్రయోగం చేశారు.
ఆడమ్ సావేజ్, జామీహైన్‌మ్యాన్‌లు నీటిపై బైక్ నడిపి చూపించారు. అయితే, నీటిపై కొద్ది దూరం మాత్రమే వీరు బైక్ నడపగలిగారు. ఓ డర్ట్ బైక్‌ను వేగంగా నేలపై నుంచి నడుపుకుంటూ వచ్చి నేరుగా నీటిపైకి తీసుకువెళ్లారు. అలా ఆ వేగంతో దాదాపు 300 మీటర్ల దూరం నీటిపై నడపగలిగారు. ఆ విచిత్రం ఏమిటో మీరు కూడా క్రింది వీడియోలో తిలకించండి.


Click it and Unblock the Notifications








