సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

భారతదేశం రోజు రోజుకి ప్రగతి వైపు పరుగులు తీస్తున్న సమయంలో మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రతి ఇంటికి ఒక వాహనం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది కేవలం కొత్త కార్లను మాత్రమే కాదు సెకండ్ హ్యాండ్ పాత కార్లను కూడా కొనుగోలు చేస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

అయితే గతంలో సెకండ్ హ్యాండ్ కార్లు కొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ రోజులు మారుతున్నాయి. కావున చాలామంది వాహనదారులు సెకండ్ హ్యాండ్ కార్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కానీ ఇప్పటికి కూడా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలుచేసి వారి మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో సెకండ్ హ్యాండ్ కార్లపై వాహనదారులకున్న అనుమానాలేంటి, అవి ఎంతవరకు వాస్తవం అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం.. రండి.

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

ఉపయోగించిన కారు కంటే కొత్త కారు కొనడం లాభదాయకం

సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే వారిలో ఒక పెద్ద అనుమానం పాత కారుకంటే కొత్త కారు కొంటేనే అద్భుతంగా ఉంటుంది అని. కానీ ఇది కొంతవరకు నిజమే అయినా, కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఇవి కొత్త కార్ల కంటే కూడా ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి.

MOST READ:అప్పుడే అమ్ముడుపోయిన 2021 హయాబుసా మొదటి బ్యాచ్.. ఇక సెకండ్ బ్యాచ్ ఎప్పుడంటే

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

కొత్త కార్లకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి ఆ వాహన మొదటి యజమాని చెల్లించి ఉంటాడు. కావున వాడిన కార్లను కొనడం వల్ల రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం ఉండదు. ఇది కూడా వాహనదారునికి చాలా వరకు కలిసి వస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉండదు.

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

సెకండ్ హ్యాండ్ కార్లకు సమస్యలు ఉంటాయి

సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసే వారికి వచ్చే సాధారణ అనుమానం, కారులో ఏదో సమస్య ఉంది, అందుకే అమ్ముతున్నారు అని. కానీ ఈ అనుమానం చాలా వరకు తప్పు. ఎందుకంటే కార్లను వివిధ కారణాల వల్ల అమ్ముతారు. ఉదాహరణకు ఎవరైనా కొత్త కారు కొంటే వారు తమ పాత కారును అమ్మేయాలని చూస్తారు.

MOST READ:హార్లే డేవిడ్సన్ బైక్‌తో దుమ్మురేపుతున్న నవదీప్ సైని [వీడియో]

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

కావున ఇలాంటి కార్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన సర్వీస్ రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పత్రాలు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేవారికి సహాయపడతాయి. ఇప్పుడు కొన్ని షోరూమ్ లు సైతం సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తున్నాయి.

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

సెకండ్ హ్యాండ్ కారుపై ఒక స్పష్టత ఇచ్చే ఈ డాక్యుమెంట్స్ కారులో ఏ విడిభాగాలను మార్చారు, కారుకి ఏ రకమైన సర్వీస్ చేయించారు అనే మొత్తం సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా కారు ఏదైనా ప్రమాదానికి గురయ్యిందా లేకుంటే ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అని కూడా ఈ రికార్డ్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.

MOST READ:ఈ వాహనాలు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు; కర్ణాటక గవర్నమెంట్

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

లేటెస్ట్ ఫీచర్స్ ఉండవు

చాలామంది క్లాసిక్ మరియు పాతకాలపు కార్లను సేకరిస్తారు. ఈ రకమైన కార్లలో కొంత వరకు లేటెస్ట్ ఫీచర్స్ ఉండక పోవచ్చు, కానీ ఇటీవల అమ్ముడైన చాలా సెకండ్ హ్యాండ్ కార్లలో ఎసితో సహా అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంతే కాకుండా మోడల్ ని బట్టి ఇందులో మ్యూజిక్ సిస్టం మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటిని కూడా మార్చవచ్చు.

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

ఇటీవల కాలంలో అమ్ముడవుతున్న సెకండ్ హ్యాండ్ కార్లలో యుఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. నిజానికి అన్ని పాత కార్లలో అన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఉండవు, అలా అని అన్ని కార్లలో లేటెస్ట్ ఫీచర్స్ లేకుండా కూడా ఉండవు.

MOST READ:కొత్త అవతార్‌లో కనిపిస్తున్న మాడిఫైడ్ మహీంద్రా బొలెరో; వివరాలు

సెకండ్ హ్యాండ్ కారు కొనే వారిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్.. ఇది చూడండి

ఇవన్నీ మీరు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఆధారపడి ఉంటుంది. అది మారుతి సుజుకి అయినా, మసెరటి అయినా, ప్రతిదీ కొనుగోలు చేయబడిన కారుపై ఆధారపడి ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్, కెమెరా వంటి ఫీచర్లు కూడా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లలో చూడవచ్చు.

Most Read Articles

English summary
Myths About Second Hand Cars Purchase. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X