అభిమాని కొత్త బైక్‌పై నాగ చైతన్య ఆటోగ్రాఫ్.. చైతూ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా, వైరల్ అవుతున్న వీడియో
టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ఒకరు. వైవిధ్యమైన కథా చిత్రాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య సింప్లిసిటీకి నెటిజన్లు ఫుల్ ఫిదా అవుతున్నారు. తన స్టాఫ్ మెంబర్‌లో ఒకరు కొత్త బైక్ కొనడంతో అతని కోరిక మేరకు బైక్‌పై చైతూ ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
జోష్ సినిమాతో ఏ మాత్రం జోష్ తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తున్న నాగచైతన్యకు కార్లు, బైక్‌లంటే చాలా ఇష్టం. ఆ ప్యాషన్‌తో ఆయన గ్యారేజ్‌లో చాలా కలెక్షన్లు ఉన్నాయి. తాజాగా తన స్టాఫ్ మెంబర్ ఒకరు బైక్ కొనుగోలు చేయడంతో అతని కోరిక మేరకు బైక్‌పై తన ఆటోగ్రాఫ్ చేశారు. దీనికి అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే కాకుండా చైతూ ఆ బైక్‌పై రైడ్ చేశారు.

చైతూ ఫ్యాన్స్ అంతా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తన సిబ్బందితో ఫొటో దిగేటప్పుడు ఆ సమయంలో నాగచైతన్య పెట్ వచ్చింది. అప్పుడు చైతూ ఆ పెట్‌ని ఆప్యాయంగా పక్కకి పంపిన విధానం కూడా క్యూట్ ఉంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు సైతం చైతూ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా నాగ చైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తన గ్యారేజీలో చాలా మోడల్స్ కార్లు, బైక్స్ ఉన్నాయి. అవేంటంటే..

చైతూ బైక్స్, కార్ల కలెక్షన్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.. ఈ బైక్ లేదా కారు మన దగ్గర కూడా ఉంటే బాగుండేది అని అనుకోకుండా ఉండలేరు. ఆయన గ్యారేజీలో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది.. క్లాసీ ట్రయంఫ్ థ్రక్స్టన్(Classy Triumph Thruxton R ) R. ఈ ఆకర్షణీయమైన రెడ్ కలర్ ప్రైజ్డ్ రేస్ బైక్ విలువ దాదాపు 13 లక్షలు ఉంటుంది.
ఇక నాగ చైతన్య వద్ద ఆకర్షణీయమైన బ్లూ కలర్ Mercedes Benz G-Class G63 కారు ఉంది. దీని విలువ కూడా దాదాపు 1 కోటి ఉంటుందని సమాచారం. హీరో రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ వద్ద కూడా ఇలాంటి కారే ఉంది.

ఇక చైతూ వద్ద ఉన్న మరో లగ్జరీ కారు.. రెడ్ కలర్ ఫెరారీ 488 GTB. దీని ధర దాదాపు రూ. 3.88 కోట్లు.. దీన్ని బట్టి చైతూకి డ్రైవింగ్ ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో.. నాగ చైతన్య కార్ల కలెక్షన్ చూస్తే తనకి కేవలం సినిమాలంటేనే కాదు ఆటో మొబైల్స్ పట్ల కూడా ఎంత ప్యాషన్ ఉందో తెలుస్తుంది.
అయితే ఈ ఏడాది నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన కస్టడీ చిత్రంలో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇక చైతూ తన తదుపరి ప్రాజెక్టు డైరెక్టర్ చందూ మొండేటితో కలిసి చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








