భార్య కోసం కోట్లు విలువ చేసే లగ్జరీ కారు.. ఎయిర్ పోర్టులో శోభితను దింపిన నాగ చైతన్య..ఫోటోలు వైరల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో నాగచైతన్య (Naga Chaitanya). ఏమాయ చేశావే, 100% లవ్ లాంటి సినిమాతో తన కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 2017లో స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న చైతూ, నాలుగేళ్ల తర్వాత విడిపోయి ఇప్పుడు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala)తో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఈ ఇద్దరి పెళ్లి అభిమానులకు పండుగలా అనిపించింది. ఇప్పుడు శోభితను తన కొత్త, అత్యంత ఖరీదైన కారులో ఎయిర్‌పోర్ట్‌లో దింపిన నాగ చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభిత కారులో నుంచి దిగి నాగ చైతన్యకు చేయి ఊపి వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్భంలో నాగ చైతన్య ఇటీవల కొన్న బిఎమ్‌డబ్ల్యూ ఎం2 (BMW M2) కారు అందరి దృష్టిని ఆకర్షించింది.

Naga Chaitanya drops off Sobhita at the airport in a new luxury car Pictures go viral

2024లో భారతదేశంలో విడుదలైన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.03 కోట్లు. టాక్స్, ఇన్సూరెన్స్ వంటి ఇతర ఖర్చులతో కలిపి హైదరాబాద్‌లో ఈ లగ్జరీ కారు ఆన్-రోడ్ ధర ₹1.27 కోట్లు వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

బీఎమ్‌డబ్ల్యూ ఎం2 భారతదేశంలో ఒక కంప్లీట్లీ బిల్ట్ యూనిట్‌గా (CBU) వస్తుంది, అందుకే దీని ధర ఇంత ఎక్కువగా ఉంటుంది. ముందు, వెనుక భాగంలో సిల్వర్ రంగు సరౌండ్‌లు, నలుపు రంగులో ఉన్న క్వాడ్ ఎగ్సాస్ట్ పైప్‌లు, సిల్వర్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, టెయిల్ లైట్‌లు, వెనుక డిఫ్యూజర్ వంటివి ఈ కారుకు అందాన్ని ఇస్తాయి.

Naga Chaitanya drops off Sobhita at the airport in a new luxury car Pictures go viral

క్యాబిన్ లోపల, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, స్పోర్టీ ఎయిర్ కండిషనింగ్ వెంట్‌లు, ఆప్షనల్‌గా ఎరుపు రంగు యాక్సెంట్‌లు ఉన్న స్పోర్ట్ సీట్లు వంటివి ఉన్నాయి.

ఈ లగ్జరీ కారు ఆల్పైన వైట్, ఎం సాండ్‌వూర్ట్ బ్లూ, బ్రూక్లిన్ గ్రే, బ్లాక్ సఫైర్, ఫైర్ రెడ్, పోర్టిమావో బ్లూ, సావో పాలో ఎల్లో మరియు స్కైస్‌క్రాపర్ గ్రే వంటి రంగులలో లభిస్తుంది. ఇందులో నాగ చైతన్య స్కైస్‌క్రాపర్ గ్రే రంగు కారును ఎంచుకున్నారు. సేఫ్టీ విషయంలో ఈ కారులో ఎలాంటి రాజీ లేదు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ASC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), యాక్టివ్ ఎం డిఫరెన్షియల్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

Naga Chaitanya drops off Sobhita at the airport in a new luxury car Pictures go viral

బీఎమ్‌డబ్ల్యూ ఎం2 స్పోర్ట్స్ కూపేలో 3.0-లీటర్ టర్బోఛార్జ్డ్ ఇన్-లైన్-సిక్స్ ఇంజిన్ ఉంది. ఇది 473 బీహెచ్‌పీ పవర్, గరిష్టంగా 600 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కూడా ఆప్షనల్‌గా లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 5, 2025, 13:48 [IST]
English summary
Naga chaitanya drops off sobhita at the airport in a new luxury car pictures go viral
Read more on: #india #auto news #offbeat #bmw
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+