లేటెస్ట్ హోండా స్పోర్ట్స్ బైక్‌ను రిజిస్టర్ చేయించిన నాగచైతన్య

Naga Chaitanya
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య మరో సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను కోనుగోలు చేశారు. 'ఏం మాయ చేసావే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం నాగచైతన్యకు విలాసవంతమైన (లగ్జరీ) కార్లు, బైక్‌లంటే భలే ఇష్టమట. బైక్‌ రైడింగ్‌లంటే మనోడికి భలే సరదా కూడాను. నాగచైతన్య ఇటీవలే రూ. 9.50 లక్షలు వెచ్చించి హోండా కంపెనీకు చెందిన ఓ సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేశారట.

కాగా.. ఆ హోండా బైక్‌కు నాగచైతన్య "ఎపి 09 సిసి 2003" అనే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను కూడా చేయించాడు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయానికి నాగచైతన్యే స్వయంగా వెళ్లి ఈ బైక్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నిబంధనలను పూర్తి చేసిన నాగచైతన్య డిజిటల్‌ సంతకం చేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ముగించాడు.

రహదారి భద్రతపై యువతకు సందేశం ఇచ్చేందుకు తన వంతు బాధ్యతగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటానని నాగచైతన్య హామి ఇచ్చారు. గతంలో నాగచైతన్య యమహా కంపెనీకు చెందిన యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 అనే స్పోర్ట్స్ బైక్‌ను (రిజిష్టర్ నంబర్ ఏపి 9 బిఎక్స్ 4568) రూ. 12.40 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, April 5, 2011, 17:56 [IST]
English summary
Taloywood star hero Akkineni Nagarjuna's son Naga Chaitanya recently purchased a all new sports bike from Honda worth rs. 9.50 lakh and he visited Khairatabad Road Transport Authority (RTA) officer to get it registered.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+