రామ్‌గోపాల్ వర్మ 'బెజవాడ'లో బుల్లెట్‌పై నాగచైతన్య సవారీ

Naga Chaitanya
సాధారణంగా సినిమాల్లో సినీ తారలు బైకులు, కార్లు వంటి వాహనాలను ఉపయోగించడం సాధారణమైన విషయమే. అయితే, వారు ప్రత్యేకించి ఎంచుకునే వాహన బ్రాండ్‌ల ద్వారా సదరు బ్రాండ్ వాహనాలకు ఫ్రీ పబ్లిసిటీ లభించడమే కాకుండా.. వారిని అభిమానించే వారు కూడా సదరు హీరో/హీరోయిన్ వాడిన వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం "ఢమరుకం" కోసం టొయోటా కంపెనీకు చెందిన ప్రీమియం ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "ఫార్చ్యూనర్"ను ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విషయాన్ని ఇదివరకటి కథనంలో మేము ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా.. నాగార్జున తనయుడు, ఏం మాయ చేశావే ఫేమ్ హీరో అక్కినేని నాగచైత్య కూడా తన తాజా చిత్రంలో ఓ మోటార్‌సైకిల్‌ను ఉపయోగించాడు. చైతుకు బైకులన్నా, బైక్ రేసులన్నా మహా ఇష్టం.

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం "బెజవాడ"లో ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను 'చైతు' ఉపయోగించాడు. ఇటీవలి కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను సినిమాల్లో తరచూ ఉపయోగిస్తుండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. బాలీవుడ్ సెక్సీ భామ కత్రినా కైఫ్ నటించిన జిందగీ నా మిలేగీ దుబారా చిత్రంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 500 సీసీ క్లాసిక్ బుల్లెట్ నడిపి ఆ సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అంతెందుకు అందరివాడు చిత్రంలో చిరంజీవి, సింహాద్రి చిత్రంలో జూ. ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడ లిస్టే అవుతుంది. దశాబ్ధాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు రాయల్ లుక్‌ను కలిగి ఉండి హీరోలకు కొత్త హీరోయుజాన్ని ఇస్తాయి కాబట్టి చిత్రాల్లో ఎక్కువగా ఈ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను ఉపయోగిస్తుంటారు. దీంతో ఈ బ్రాండ్‌కు ఫ్రీ పబ్లిసిటీ లభించినట్లవుతుంది. అందుకేనేమో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్కువగా ప్రకటనలు, ప్రచారాలు చేయడం లేదు.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2011, 13:48 [IST]
English summary
Tollywood actor Naga Chaitanya rides Royal Enfield Bullet in his latest film Bejawada, which is directed by Ram Gopal Varma.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+