జపనీస్ స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం: అక్కినేని నాగచైతన్య
యువ నటుడు అక్కినేని నాగచైతన్య నిజంగా తండ్రికి తగ్గ తనయుడే. మన టాలీవుడ్ మన్మధుడు అక్కినేన నాగార్జున స్పోర్ట్స్ బైక్‌లన్నా, స్పోర్ట్స్ కార్లన్నా ఎంతో ఇష్టం. సూపర్ చిత్రంలో సూపర్ బైక్ రేస్‌తో అభిమానుల మనసు కొల్లగట్టాడు ఈ కింగ్. అలాగే నాగచైతన్యకు కూడా స్పోర్ట్స్ బైక్‌లన్నా వేగంగా వెళ్లే కార్లన్నా మహా ఇష్టం.
నాగచైతన్య వద్ద ఓ యమహా వైజెడ్ఎఫ్-ఆర్1 స్పోర్ట్స్ బైక్, హోండాకు చెందిన మరో స్పోర్ట్స్ బైక్‌తో పాటుగా పలు విలాసవంతమైన కార్లు కడా ఉన్నాయి. రియోట్ ఇంజన్‌కు హీరో అక్కినేని నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వూలో తన సూపర్‌బైక్ లవ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నాగచైతన్యకు కార్ల కన్నా బైకులంటే ఎక్కువ మక్కువ. అందరి మాదిరిగానే తాను తొలుత వివిధ రకాల 100సీసీ బైక్‌లపై బైక్ రైడింగ్ నేర్చుకున్నాని, తన తొలి బైక్ హోండా సిబిఆర్ 600 ఆర్ఆర్ అని చెప్పారు. ఈ బైక్‌ను ఓ ఏడాది నడిపిన తర్వాత కవాసకి నిన్జా జెడ్ఎక్స్-636 బైక్‌కు మారానని నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
నాగచైతన్య చెప్పిన మరిన్ని విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్1
నాగచైతన్య 2010లో యమహా కంపెనీకు చెందిన వైజెడ్ఎఫ్ ఆర్1 అనే స్పోర్ట్స్ బైక్‌ను (రిజిష్టర్ నంబర్ ఏపి 9 బిఎక్స్ 4568) అప్పట్లో సుమారు రూ. 12.40 లక్షలకు చెల్లించి కొనుగోలు చేశారు.

జపనీస్ బైక్‌లంటే ఇష్టం
నాగచైతన్యకు జపానీస్ స్పోర్ట్స్ బైక్‌లంటే ఎక్కువగా ఇష్టమట. సిటీ రైడ్ కోసం 600 సీసీ బైక్‌లు చక్కగా ఉంటాయని, రద్దీగా ఉండే రోడ్లపై వీటి హ్యాండ్లింగ్ చక్కగా ఉంటుందని ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

క్రూయిజ్ బైక్‌లు వాడను
అమెరికాకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హ్యార్లీ డేవిడ్‌సన్ భారత్‌లో క్రూయిజ్ బైక్‌లను విక్రయిస్తోంది, అయితే తనకి క్రూయిజ్ బైక్‌ల కన్నా స్పోర్ట్స్ బైక్‌లంటేనే ఎక్కువ ఇష్టమని నాగచైతన్య చెప్పారు.

ఆల్‌టైమ్ ఫేవరేట్ బైక్
తాను ఇప్పటి వరకూ అనేక బైక్‌లను నడిపానని, అందులో ముఖ్యంగా డ్యుకాటి 1098, ఎమ్‌వి అగస్టా ఎఫ్4 1000లు తనకు బాగా గుర్తుండిపోయేవని చైతన్య చెప్పారు. తనకు ఆల్ టైమ్ ఫేవరేట్ బైక్ అంటే ఎమ్‌వి అగస్టా ఎఫ్4 1000 అయర్టాన్ సెన్నా లిమిటెడ్ ఎడిషన్ బైకేనని ఆయన అన్నారు.

కారుతో డ్రాగ్ రేస్‌లు
హీరో నాగచైతన్య కార్/బైక్ రేస్‌లు చూడటమంటే ఇష్టమట. తాను చెన్నైలో ఉన్నప్పుడు ల్యాన్సర్ కారుతోను, హైదరాబాద్‍కు వచ్చిన తర్వాత ఫెరారీ కారుతోనూ సరాదాగా డ్రాగ్ రేస్‌లు చేసేవాడట.
మూలం: రియోట్ ఇంజన్
మూలం: రియోట్ ఇంజన్


Click it and Unblock the Notifications








