కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

భారతదేశంలో అధికంగా వ్యాపిస్తున్న కరోనా ఇప్పటికే ఎంతోమంది ప్రజల ప్రాణాలను హరించింది. ఇప్పటికే ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. గడిచే ప్రతిగంట ఎంతోమంది ప్రాణాలు తీసుతున్న ఈ భయంకరమైన మహమ్మారి రోజురోజుకి చాలా వేగంగా వ్యాపిస్తోంది.

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ దీనిని పూర్తిగా ఆరికట్టలేకపోతున్నారు. దేశంలో పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా హాస్పిటల్స్ లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు సరిపోవడం లేదు. ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల కూడా చాలామంది మృత్యువాతపడుతున్నారు.

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

భారతదేశం కరోనా కోరల్లో నలుగుతున్న వేళ చాలామంది స్వచ్చందంగా ప్రజలకు సేవచేయడానికి ముందుకు వస్తున్నారు, ఇందులో మొన్న బీహార్ కి చెందిన గౌరవ్ రాయ్, నిన్న ముంబైలోని మలాడ్‌లో నివసిస్తున్న షహనావాజ్ ప్రజలకు స్వచ్చందంగా ఆక్సిజన్ అందిస్తున్నారన్న విషయం అందరికి తెలిసిందే, అయితే ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్యారే ఖాన్ వెలుగులోకి వచ్చాడు.

MOST READ:మీరు మీ వాహనంతో తరచూ రాష్ట్రాలు మారుతుంటారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్..

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

కరోనా అధికంగా వ్యాపిస్తున్న కారణంగా నాగ్‌పూర్‌లో కూడా ఆక్సిజన్ కొరత ఉంది. కావున ప్యారే ఖాన్ అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఏకంగా 1 కోటి రూపాయలు ఖర్చు చేసి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను అందించి రియల్ హీరో అయ్యాడు.

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

నివేదికల ప్రకారం ప్యారే ఖాన్ ట్రాన్స్పోర్టర్ నడుపుతున్నాడు. ఈ రోజు ఈ ట్రాన్స్పోర్టర్ విలువ 400 కోట్లు. అతను 1995 లో నాగ్‌పూర్‌ రైల్వే స్టేషన్ వెలుపల నారింజ అమ్మకం ప్రారంభించిన ఒక చిన్న కిరాణా వ్యాపారి కుమారుడు. అయితే ఈ రోజు అష్మి రోడ్ క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించి 1,200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాడు.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

ఇక పొతే కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారు. మొదట ఆక్సిజన్ కోసం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వారిని సంప్రదించారు. అయితే ఇప్పుడు ఆక్సిజన్ కి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా సాధారణ ధరకంటే మూడు రేట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఖాన్ రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలుచేశాడు.

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

కొనుగోలు చేసిన తరువాత వాటిని నాగ్‌పూర్‌కు పంపాడు. తర్వాత విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సరఫరా చేయాలనుకున్నాడు, ఇక్కడ ఆక్సిజన్ సరఫరా చేయడానికి నాగ్‌పూర్ ఎంపి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకరించారని ఆయన అన్నారు. విశాఖపట్నం నుండి ఐదు ట్యాంకర్లను తీసుకురావడానికి తన కంపెనీ డ్రైవర్లను పంపించానని ఖాన్ చెప్పాడు.

MOST READ:కరోనా వేళ అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట; నోయిడా పోలీస్

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

ఇప్పటివరకు సుమారు 20 నుండి 22 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. దీని కోసం మేము సుమారు 1 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. నాగ్‌పూర్ జిల్లాకు ఆక్సిజన్ రవాణా చేయడానికి ఖాన్ మరియు అతని బృందం సహాయం చేస్తున్నాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

ప్యారే ఖాన్ కరోనా రోగుల పట్ల దేవునిగా నిలిచాడు. ఈ కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అలంటి వారిని బ్రతికించడానికి ఖాన్ మరియు అతని బృందం నిజంగా ప్రశంసనీయం. ఖాన్ లాంటి ఎంతోమంది ప్రజలకు సేవ చేయడానికి తమ వంతు సహాయం అందిస్తూ ముందుకు వస్తున్నారు.

MOST READ:మే 2021లో విడుదల కానున్న కొత్త కార్లు: అల్కజార్, సెల్టోస్, సోనెట్, గుర్ఖా, టైగన్

Most Read Articles

English summary
Nagpur Transporter Arranges 20 Oxygen Tankers For Covid 19 Infected People. Read in Telugu.
Story first published: Friday, April 30, 2021, 9:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X