Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 12 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 13 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా?
సినీ పరిశ్రమలో కేవలం హీరోలకు మాత్రమే హీరోయిన్లకు (కథానాయకి) కూడా కార్లంటే చాలా ఇష్టం. కావున ఇప్పటికే చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ నటి 'అపర్ణ బాలమురళి' ఇటీవల ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.
Recommended Video
ఇంతకీ అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కారు ఏది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
నటి అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎమ్‌జి జిఎల్ఏ 35' (AMG GLA 35). దీనికి సంబందించిన ఫోటోలను కూడా నటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన చాలామంది అభిమానులు కొత్త కారు కొనుగోలు చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన కొత్త Mercedes Benz AMG GLA 35 ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.40 లక్షలు. ఇది అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ కారుని ఇంతకుముందు విదేశీ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకునే వారు. అయితే ఇప్పుడు కంపెనీ భారత్‌లో తన ప్రధాన కార్లను అసెంబ్లింగ్ చేస్తోంది. కావున కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు.
కొత్త Mercedes Benz AMG GLA 35 కారులో అప్‌గ్రేడ్ చేయబడిన గ్రిల్ డిజైన్, రీడిజైన్ చేయబడిన బంపర్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్, అగ్రెసివ్ ట్విన్ ఎగ్జాస్ట్, ఆకర్షణీయమైన AMG బ్యాడ్జ్ వంటి అనేక అప్‌గ్రేడ్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ కారుని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.
Mercedes-Benz GLA 35 కారులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ ఉంటాయి. ఇందులోని 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ 161 బిహెచ్పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. అదే సమయంలో ఇది కేవలం 8.7 సెకన్లలో 0 నుండి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
ఇక 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 189 బిహెచ్పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఇది 7.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.
ఇక చివరగా 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 304 బిహెచ్పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది. Mercedes-Benz GLA 35 ఆధునిక భద్రతా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
అపర్ణ బాలమురళి భారతదేశానికి చెందిన ప్రముఖ గాయని మరియు నటి కూడా. ఈమె తమిళ నటుడు సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం ద్వారా స్టార్‌గా పేరుతెచ్చుకుని ఆ సినిమాలోని అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఆ తరువాత మహేశ్ఇంతే ప్రతీకారం మరియు యాత్ర తుదరున్ను వంటి మలయాళీ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
నటి అపర్ణ బాలమురళి కేవలం మలయాళీ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే సినిమాలో నటించింది. ఇది మలయాళీ సినిమా అయిన సూరరై పోట్రు సినిమాకి తెలుగు అనువాదం.