మూడేళ్లలో మూడు బ్లాక్‌బస్టర్లు.. స్టైల్‌లో తగ్గేదేలే.. నేషనల్ క్రష్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ అదిరిపోయిందిగా!
ప్రస్తుతం 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న (rashmika-mandanna) వరుస సినిమా హిట్లతో దూసుకుపోతుంది. మొదట కన్నడలో నటించి ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి హిట్ సాధించి స్టార్ హిరోల ప్రక్కన నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా హిట్ సినిమాలు చేసి దేశవ్యాప్తంగా అందరి ఫేవరెట్ హీరోయిన్‌గా ఉంది. తన అభిమానులు ఆమెను ముద్దుగా 'నేషనల్ క్రష్' అని పిలుస్తారు. తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ తరువాత ఇప్పుడు రష్మిక మందన్న ట్రెండింగ్‌లో ఉంది. పుష్ప సినిమాతో ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తర్వాత యానిమల్ సినిమా కూడా ఆమెకు బంపర్ హిట్ ఇచ్చింది.
పుష్ప1,2 తరువాత యానిమల్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన 'ఛావా' సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో ఈ అమ్మడి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. తాజాగా నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించాయి. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఛావా సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లను వసూలు చేసింది.

'పాన్ ఇండియన్' హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నటి భారీగానే సంపాదిస్తుంది. ఒకవైపు సినిమాలతో పాటు, అటూ వివిధ ప్రకటనలు కూడా చేస్తూ, చేతి నిండా సినిమాలతో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. సంపాదనకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. ముఖ్యంగా రష్మిక మందన్నకు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా మరో కారును కొనుగోలు చేసింది.
రష్మిక లగ్జరీ కారు మోడల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్(mercedes-benz-s-class). తాజాగా ఇదే కారుతో ముంబై విమానాశ్రమంలో కనిపించారు. మూడేళ్లలో మూడు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన నేషనల్ క్రష్ సికిందర్ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వచ్చి ఉంటారని తెలుస్తుంది. మెరిసే S450 లగ్జరీ కారులో అందంగా ఉన్న హీరోయిన్ రావడంతో అందరి చూపు ఆమె మీదే ఉంది. కారు నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో చూసినట్లయితే మెర్సిడెస్ బెంజ్ S450 బ్లాక్ కలర్‌లో వెలిగిపోతుంది. ప్రస్తుతం ఆమె కారు గురించి ఆటో ప్రేమికులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ లగ్జరీ కారు గురించి మరింత తెలుసుకుందాం. బెంజ్ ఎస్-క్లాస్ పలు ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుంది. ధర విషయానికి వస్తే, డీజిల్ వేరియంట్ ధర రూ.1.79 కోట్లు, హైబ్రిడ్ మోడల్ ధర రూ.1.90 కోట్లు.ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంటాయి.
రష్మిక మందన్న మెర్సిడెస్ బెంజ్ S450 కారు పెట్రోల్ మోడల్ అని సమాచారం. ఇది అధునాతన లగ్జరీ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లతో LED హెడ్‌ల్యాంప్‌లు, కీలెస్ గో సదుపాయం, లెదర్ అప్హోల్స్టరీ, పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, అన్ని సీట్లకు మసాజ్, వెంటిలేషన్, వెనుక సీట్లలో రెండు ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








