నయనతారకు ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ వ్యక్తి

దక్షిణ భారత సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా నిలిచిన అరుదైన నటి నయనతార (Nayanathara). తన అందం, నటన, కరిస్మా ఈ మూడు కలిసి తెరపై కనిపించగానే ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఆమెకుంది. మలయాళంలో కెరీర్ ప్రారంభించిన ఆమె, కొద్దికాలంలోనే తెలుగు-తమిళ పరిశ్రమల్లోనూ స్టార్‌డమ్ అందుకుంది. చంద్రముఖి, తులసి, అదుర్స్, శ్రీరామరాజ్యం, సింహ, సీమారాజు వంటి సినిమాల్లో ఆమె నటనకు ఎప్పటికప్పుడు ప్రశంసలు లభించాయి. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పరిశ్రమ ప్రముఖులు నుంచి అభిమానుల వరకు అందరూ ఆమెకు ప్రేమతో, అభిమానంతో శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపించింది.

అయితే వీటిలో ప్రత్యేకంగా నిలిచింది భర్త విఘ్నేష్ శివన్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్. ఆమెపై తన ప్రేమను మరోసారి ప్రకటించినట్టుగా, విలాసవంతమైన రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారును కానుకగా అందించాడు. తన భార్య, తమ పిల్లలతో కలిసి కొత్త కారు ముందు నిల్చొని తీసుకున్న ఫోటోను కూడా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ కారు చాలా ఖరీదైనది.

Nayanthara Receives Rolls Royce Spectre From Vignesh Shivan

రోల్స్‌ రాయిస్‌ స్పెక్టర్ నిజంగా విలాసవంతమైన ఎలక్ట్రిక్ లగ్జరీ కార్ల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. స్పెక్టర్‌ను ఒకసారి చూసినవారికి ఇది కేవలం కారు కాదు, ఒక కళాఖండం అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కూపే సెడాన్‌గా రూపొందించబడిన ఈ మోడల్‌ అత్యున్నత డిజైన్‌, బలమైన పనితీరు, రాజసంగా ఉండే లగ్జరీ ప్యాకేజీగా నిలుస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.50 కోట్ల నుండి రూ. 9.50 కోట్ల వరకు ఉంటుంది.

బేస్, బ్లాక్ బ్యాడ్జ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రత్యేకంగా బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్ మరింత స్పోర్టీ, కస్టమైజ్డ్ లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. స్పెక్టర్ డిజైన్ విషయానికి వస్తే, స్మూత్ లైన్స్‌, శార్ప్ కర్వ్స్‌, క్లాసిక్ రోల్స్‌ రాయిస్‌ స్టాన్స్‌, ప్రతి అంగుళంలోనూ కనిపించే ప్రీమియం ఫినిషింగ్ ఇవి చూసినవారిని వెంటనే ఆకర్షిస్తాయి. 2-డోర్ కూపే స్టైల్ ఉన్నప్పటికీ, లోపల 4 సీట్లు ఉండడం ప్రయాణికులకు సౌకర్యం తగ్గకుండా ఉంచింది.

Nayanthara Receives Rolls Royce Spectre From Vignesh Shivan

ముందు మాత్రమే కాదు, వెనుక కూర్చునే వారికి కూడా లగ్జరీ లభిస్తుంది. లగేజీ కోసం కూడా స్పెక్టర్ మంచి స్పేస్ ఇస్తుంది. 380 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం వల్ల వీకెండ్ ట్రిప్స్‌కి, సెలవుల్లో లాంగ్ డ్రైవ్స్‌కి ఎంత లగేజీ ఉన్నా సులభంగా సరిపోతుంది. పనితీరులో స్పెక్టర్ మరింత ఆకట్టుకుంటుంది. ఇందులో 102 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు.

ఈ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 576.6 bhp పవర్, 900 Nm టార్క్‌తో తగిన శక్తివంతమైన డ్రైవింగ్ అనుభూతి లభిస్తుంది. వేగం విషయానికి వస్తే , టాప్ స్పీడ్: 250 km/h, 0 నుండి 100 km/h వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో చేరుతుంది. ఈ పరఫార్మెన్స్ గణాంకాలు స్పోర్ట్స్ కార్లను తలపించే స్థాయిలో ఉంటాయి. అంత పవర్ ఉన్నప్పటికీ, శబ్దం లేకుండా స్మూత్‌గా నడవడం స్పెక్టర్ ప్రత్యేకత.

ఈ కారులో అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, USB ఛార్జర్‌లు, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, వెనుక AC వెంట్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్లు వంటి వివిధ అంశాలు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని అధునాతన ఫీచర్స్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 19, 2025, 13:03 [IST]
English summary
Nayanthara receives rolls royce spectre from vignesh shivan on birthday details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+