నయన్‌ బర్త్‌ డేకు విఘ్నేశ్‌ శివన్‌ సూపర్‌ గిఫ్ట్‌ ఇదే.. రూ. 3 కోట్ల ఖరీదైన ఈ లగ్జరీ కారులో అదిరిపోయే ఫీచర్లు.!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు బర్త్‌డే సందర్భంగా తన భర్త విఘ్నేశ్‌ శివన్‌.. ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. నయన్‌ 39 వ బర్త్‌డే సందర్భంగా కారును తన ప్రేమకు గుర్తుగా బహుకరించాడు. అయితే ఆ కారేంటనేది స్పష్టంగా తెలియలేదు. ఇప్పుడు దానిపై ఓ క్లారిటీ వచ్చింది.

నయన్‌ తన బర్త్‌డే గిఫ్ట్‌కి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అయితే ఆ కారు ఏంటనేది నయన్‌ దంపతులు వెల్లడించలేదు. కేవలం కారు లోగోను మాత్రమే ఫొటో తీసి షేర్‌ చేశారు. ఆ ఫొటోల ఆధారంగా నయన్‌కు విఘ్నేశ్‌ శివన్‌ మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ ఎస్‌ క్లాస్‌ బహుమతిగా ఇచ్చినట్లుగా ఊహించాం. అయితే అది ఎస్‌ క్లాస్‌ కాదని. మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 అని తెలిసింది.

Nayanthara-Birthday-Mercedes-Maybach-GLS-600

నయనతార తాజాగా తాను నటించిన అన్నపూర్ణి సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ని చూడటానికి థియేటర్‌కి వెళ్లింది. అయితే అక్కడికి నయన్‌ తన భర్త బహుమతిగా ఇచ్చిన కారులో వచ్చింది. అది ఇప్పుడు మెర్సిడెస్‌ మేబ్యాచ్ GLS600 కారు అని తేలింది. కాగా ఈ కారు ధర రూ. 2.96 కోట్లు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

అయితే ఈ ధర ఎక్స్‌ షోరూమ్‌ ధర మాత్రమే.. కానీ ఆన్‌ రోడ్ ధర రూ. 3 కోట్లకు పైగానే ఉంటుంది. నయన్‌ ఖరీదైన మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 కారులో రావడంతో ఈ వీడియోకు లైకుల వర్షం కురుస్తోంది. కాగా Mercedes Maybach GLS600 ఆకట్టుకునే డిజైన్‌తో పాటు ఇందులో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Nayanthara-Birthday-Mercedes-Maybach-GLS-600

దీనిని మొబైల్ లగ్జరీ మాన్షన్ అని కూడా కార్ ప్రియులు ముద్దుగా పిలుచుకుంటారు. అందుకనుగుణంగా ఈ కారులో అనేక అధునాతన లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. మేబ్యాచ్‌-ఇన్ ఎక్స్‌క్లూజివ్ గ్రిల్, 22-అంగుళాల అల్లాయ్ వీల్స్, మేబ్యాచ్‌ బ్యాడ్జ్‌లతో అందంగా రూపొందించారు. ఇంకా ప్రయాణికుల కోసం అనేక విలాసవంతమైన ఫీచర్లను అందించారు.

ప్రయాణికులకు విలాసవంతమైన రైడ్‌ కోసం మసాజ్, ఎలక్ట్రికల్‌ అడ్జస్టబుల్‌, కూలింగ్, హీటింగ్ సౌకర్యాలతో కూడిన సీట్లను కలిగి ఉంటుంది. దీంతో పాటుగా, కారులో చిన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌లు, పానీయాలను చల్లగా ఉంచడానికి చిన్న ఫ్రిజ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

Nayanthara-Birthday-Mercedes-Maybach-GLS-600

అంతేకాకుండా మేబ్యాచ్‌ GLS 600లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ కంట్రోల్‌లతో కూడిన స్టీరింగ్ వీల్, మేబ్యాచ్‌ ఎంబ్లెమ్‌తో కూడిన ఫుట్ పెడల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైట్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, కీలెస్‌ ఎంట్రీ వంటి అద్భుతమైన టెక్నాలజీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Nayanthara-Birthday-Mercedes-Maybach-GLS-600

ఇక మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ జీఎల్‌ఎస్‌ 600లో ఇంజిన్ విషయానికొస్తే, ఇందులో అదే 4.0 లీటర్ V8 ట్విన్ టర్బోచార్జ్డ్ మోటార్ ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 557 PS పవర్, 730 Nm గరిష్ఠ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో ఆల్-వీల్ డ్రైవ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి.

Nayanthara-Birthday-Mercedes-Maybach-GLS-600

వీటితో పాటు, మెర్సిడెస్‌ మేబ్యాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 కారులో 48 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా అందించారు. ఈ సిస్టమ్‌ అదనంగా 22 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అధిక మైలేజ్‌ను అందిస్తుంది. నయన్‌ పుట్టినరోజు కానుకగా విఘ్నేష్ శివన్ అలాంటి సూపర్ లగ్జరీ సౌకర్యాలు ఉన్న కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.

More from DriveSpark

Article Published On: Saturday, December 2, 2023, 9:10 [IST]
English summary
Nayanthara spotted in rs 3 crore worth mercedes maybach gls 600
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+