రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఇప్పటికీ ఓ పెద్ద సమస్యగా ఉన్నాయి. దేశంలో గతేడాది ప్రజలు ఎక్కువగా కరోనాతో చనిపోతే, మరోవైపు రోడ్డు ప్రమాదాల్లో కూడా ఎక్కువగా చనిపోయిన వారు ఉన్నారు. దేశంలో అసహజ మరణాలకు రోడ్డు ప్రమాదాలు అతి పెద్ద కారణాలలో ఒకటిగా నిలిచాయి మరియు ప్రతి ఏటా దేశవ్యాప్తంగా రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన వార్షిక 'క్రైమ్ ఇండియా' నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, గతేడాది దేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ప్రతిరోజూ సగటున 328 మంది ప్రజలు వివిధ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

ఈ నివేదిక ప్రకారం, గత 2020 లో రోడ్డుపై నిర్లక్ష్యం వ్యవహరించడం కారణంగా సంభవించిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.2 లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

గడచిన 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఎక్కువ భాగం కర్ఫ్యూ/లాక్‌డౌన్ విధించబడింది. అంతర్‌రాష్ట్ర ప్రయాణాలపై కూడా ఆంక్షలు అమలులో ఉండేవి. ఫలితంగా, రోడిలపై జన/వాహన సంచారం తక్కువగా ఉండి ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉండేది. అయినప్పటికీ, ఇంత అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నిర్లక్ష్యం కారణంగా మూడేళ్లలో 3.92 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన వార్షిక 'క్రైమ్ ఇండియా' నివేదికలో వెల్లడించింది. ఒక్క 2020 లోనే 1.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు 2019 లో 1.36 లక్షలు మరియు 2018 లో 1.35 లక్షలుగా ఉన్నాయి.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

దేశంలో 'హిట్ అండ్ రన్' (Hit and Run) కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. రోడ్డు ప్రమాదాలకు కారణమై (రోడ్డుపై ఏదైనా వాహనాన్ని లేదా వ్యక్తిని ఢీకొట్టి), ప్రమాద స్థలం నుండి పారిపోవడాన్ని హిట్ అండ్ రన్ అంటారు. గత 2018 నుండి దేశంలో 1.35 లక్షల "హిట్ అండ్ రన్" కేసులను నమోదయ్యాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే NCRB నివేదికలు చెబుతున్నాయి.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

గత 2020 లో 41,196 హిట్ అండ్ రన్ కేసులు నమోదు కాగా, 2019 లో 47,504 మరియు 2018 లో 47,028 కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం, గడచిన సంవత్సరంలో సగటున ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 112 హిట్ అండ్ రన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

అలాగే, 2020 లో ప్రజా మార్గాల (పబ్లిక్ రోడ్స్)పై ర్యాష్ లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా గాయపడిన వారి కేసులు సంఖ్య 1.30 లక్షలుగా ఉందని ఈ నివేదికలో తెలిపారు. ఈ కేసులు 2019 లో 1.60 లక్షలు మరియు 2018 లో 1.66 లక్షలుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం (2020లో) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య 85,920 గా ఉంది. ఇది 2019 లో 1.12 లక్షలు మరియు 2018 లో 1.08 లక్షలుగా ఉంది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

రోడ్డు ప్రమాదాలే కాకుండా, రైలు ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారనే సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది (2020 లో) అనుకోకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించినప్పుడు 52 మంది రైలు ఢీకొని మరణించారు. గత 2019 లో ఇలా మొత్తం 55 మంది మరణించగా, 2018 లో రైలు ఢీకొనడం వలన 35 మంది మరణించినట్లు నివేదించారు.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

ఇవన్నీ అధికారిక లెక్కలు మాత్రమే. లెక్కల్లోకి ఎక్కకుండా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారు మరియు గాయపడిన వారు కూడా ఎక్కువగానే ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, రోడ్ సేఫ్టీని పెంచేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకుంటోంది. వాటి ఫలితంగా, మునుపటి సంవత్సరాలతో పోలిస్తే, గతేడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య కొద్దిగా తగ్గింది.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రత్యేకించి, ట్రాఫిక్ నేరాలకు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించడం మరియు అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతంలో ప్రమాదాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వివిధ చర్యలు తీసుకోబడ్డాయి.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

చిన్న కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు : గడ్కరీ

ఇదిలా ఉంటే, రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించేందుకు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల చిన్న కార్లలో కూడా మెరుగైన సేఫ్టీ ఫీచర్లను అందించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే చిన్న కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లైనా ఉండాలని ఆయన అన్నారు.

రోడ్డుపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది 1.2 లక్షల మంది మృతి; అంటే, రోజుకి 328 మంది!

ధనికులు కొనుగోలు చేసే పెద్ద కార్లలో మాత్రమే కార్ల తయారీ సంస్థలు ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌ లను ఎందుకు అందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వాహన తయారీదారులు ధనికులకు ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌ లను అందిస్తునప్పుడు, మధ్యతరగతి వినియోగదారులు ఉపయోగించే ఎకానమీ మోడల్ కార్లలో మాత్రం కార్ కంపెనీలు కేవలం రెండు లేదా మూడు ఎయిర్‌బ్యాగ్‌‌లను మాత్రమే అందించడం ఎంత వరకు సరైందని గడ్కరీ ప్రశ్నించారు.

Most Read Articles

English summary
Ncrb data reveals 1 2 lakh people died in road accidents in 2020 due to negligence
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X