నేటి వీడియో: నీడ్ ఫర్ స్పీడ్ మూవీ ట్రైలర్..

By Ravi

కార్ ఛేజింగ్ సీన్స్‌తో కూడిన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టపడే వారికి, స్పీడ్ అంటే పిచ్చెక్కిపోయే కుర్రకారు కోసం ఓ కొత్త హాలీవుడ్ సినిమా త్వరలోనే థియేటర్ల ముందుకు రాబోతుంది. 'నీడ్ ఫర్ స్పీడ్' (Need For Speed) పేరుతో రాబోతున్న ఈ యాక్షన్ ఫ్లిక్ కోసం దర్శక నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఈ సినిమాలో దాదాపు అన్ని రకాల సూపర్ కార్లను, వాటి ఛేజింగ్‌లను మనం చూడొచ్చు. నీడ్ ఫర్ స్పీడ్‌కు సంబంధించి ఇటీవలే ఓ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, ఈ సినిమాలో బోలెడంత యాక్షన్, లెక్కలేనన్ని సూపర్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఇదే చివరి పార్ట్ అట.

నీడ్ ఫర్ స్పీడ్ పేరుతో ఇప్పటికే వీడియో గేమ్స్ కూడా అత్యంత పాపులర్ అయిన సంగతి తెలిసినదే. పోలీస్ ఛేజ్‌లు, కార్ క్రాష్‌లు, సూపర్ కార్ల రేసింగ్ అబ్బో ఈ సినిమా అంతా దాదాపు ఓ కార్ల ప్రపంచం మాదిరిగా ఉండబోతుంది. ఈ సినిమాలో ప్రధానంగా కొయినిగ్‌సెగ్, లాంబోర్గినీ సెస్టో ఎలిమెంటో, బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్, మెక్‌లారెన్ పి1 వంటి అనేక సూపర్ కార్లను చూడొచ్చు.

డ్రీమ్‌వర్క్స్ పిక్చర్స్ బ్యానెర్‌పై తెరకెక్కుతున్న నీడ్ ఫర్ స్పీడ్ చిత్రం మార్చ్ 14, 2014న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపుగా మనం కూడా ఈ మూవీ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/e73J71RZRn8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, November 20, 2013, 9:01 [IST]
English summary
The first extended Need For Speed movie trailer is out, giving us the first proper look at the characters, the cars and the action and a hint about the story. It's all about revenge. Need For Speed, produced by DreamWorks Pictures, will arrive in theaters on March 14, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+