Lakshadweep Agatti Airport లక్షద్వీప్‌లో ఉన్న ఏకైన అగత్తి ఎయిర్‌పోర్టు గురించి తెలుసా..?

లక్షద్వీప్‌ ప్రస్తుతం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతం కోసం లక్షలాది మంది ఆన్‌లైన్‌ వేదికగా శోధిస్తున్నారు. ఆన్‌లైన్‌ శోధనలో గత 20 సంవత్సరాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుందని కేంద్ర సంస్థల లెక్కల ఆధారంగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా చిన్న ద్వీప దేశం మాల్దీవుల నేతల వ్యాఖ్యలతో ఒక్కసారిగా లక్షద్వీప్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోడీ అక్కడ సముద్ర తీరంలో కాసేపు సేద తీరారు. స్నార్కెలింగ్‌ చేశారు. ఆ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. సాహసాలు చేయాలనుకొనే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను చేర్చుకోవాలని సూచించారు. అయితే మోడీ వ్యాఖ్యలపై మాల్దీవుల ఎంపీ సహా ముగ్గులు మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

lakshadweep-beach-wide-view

పర్యాటకంగా మాల్దీవులతో పోటీపడడం భ్రమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే.. లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందంటూ అక్కసు వెళ్లగక్కారు. మాల్దీవులు అందించే సౌకర్యాలు లక్షద్వీప్‌లో ఎలా అందిస్తారని, పరిశుభ్రతపైనా అహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య అంటూ ట్వీట్‌ చేశారు.

వ్యాఖ్యలపై పెద్ద దూమరం రేగింది. భారత్‌ చెందిన అనేక ముంది సెలబ్రీటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు కొద్ది గంటల్లోనే బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. భారతీయలంతా మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌లో పర్యటించాలని పలువురు పిలుపునిచ్చారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ వ్యాఖ్యలపై సంబంధం ఉన్న మంత్రులపై వేటు వేసింది.

 lakshadweep-agatti-airport

లక్షద్వీప్‌లో వసతులు సహా రవాణా సౌకర్యాలపై చాలా మంది ఆరా తీస్తున్నారు. భారత్‌లోని ఏ ప్రాంతం నుంచి లక్షద్వీప్‌కు వెళ్లాలన్న సముద్ర లేదా వాయు మార్గాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. లక్షద్వీప్‌లో అగత్తి పేరిట ఒకే ఒక ఎయిర్‌పోర్టు ఉంది. దీన్ని 1987-88 నిర్మించారు. అనంతరం దశలవారీగా విస్తరించారు.

అగత్తి విమానాశ్రయం ల్యాండింగ్‌ ప్యాడ్‌కు రెండు వైపులా సముద్ర తీరం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ కూడా ఎంతో అందమైన అనుభూతిని ఇస్తుంది. చుట్టు పక్కల వాతావరణాన్ని ఆశ్వాదిస్తూ మరియు అన్ని ద్వీపాలను చూస్తు ల్యాండింగ్‌, టేకాఫ్‌ కావొచ్చు. అయితే భారత్‌ ప్రభుత్వం లక్షద్వీప్‌లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేస్తోంది.

 lakshadweep-boat-on-shallow-sea

మినికోయ్‌ దీవుల్లో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించాలని భావిస్తోంది. అయితే వాస్తవానికి మినికోయ్‌ దీవుల్లో ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించాలని గతంలోనే రక్షణ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. సముద్ర తీరంలో నిఘా సహా ఇతర అవసరాల కోసం ఎయిర్‌ఫీల్డ్‌ నిర్మించాలని గతంలోనే కోస్ట్‌గార్డ్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

నౌకలు, హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు : దీంతోపాటు సముద్ర మార్గం ద్వారా కూడా లక్షద్వీప్‌ చేరేలా ఏర్వాట్లు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం నౌకలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. లక్షద్వీప్‌కు పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో కొత్తగా హోటళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు.

 lakshadweep-sunset

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 10, 2024, 16:12 [IST]
English summary
Need to know about lakshadweep agatti airport and center plans for another
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+