రాత్రివేళల్లో స్వయంగా ప్రకాశించే రోడ్డును ప్రారంభించిన నెథర్లాండ్స్
నెథర్లాండ్స్ దేశం స్వయం ప్రకాశిత రోడ్లను నిర్మిస్తున్నట్లు మనం గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ప్రచురించిన కథనంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ తరహా రోడ్లను ప్రజల కోసం ఓపెన్ చేస్తున్నట్లు నెథర్లాండ్స్ ప్రకటించింది. ఓస్స్‌లోని ఎన్329 జాతీయ రహదారిని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారు. ఈ స్వయం ప్రకాశిత రోడ్లను నెథర్లాండ్స్‌లో ప్రయోగపూర్వకంగా పరీక్షించిన తర్వాత ప్రజల కోసం వీటిని ఓపెన్ చేశారు.
ఈ రోడ్ రూపకర్తలు ఎవరు?
డాన్ రూస్‌గార్డ్ అనే డిజైనర్ మరియు పరిశోధకుడు డచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ హీజ్‌మ్యాన్స్‌తో కలిసి, స్మార్ట్ హైవే ప్రాజెక్టులో భాగంగా ఈ స్వయం ప్రకాశిత రోడ్లను ప్రారంభించారు.

ఈ రోడ్లను ఎలా నిర్మిస్తారు, ఇవి ఎలా పనిచేస్తాయి?
ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్ కలిగిన పెయింట్‌తో రోడ్డు పక్కల మార్కింగ్స్ వేస్తారు. ఈ ఫోటో ల్యూమినైజింగ్ పౌడర్‌కు ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. అదేంటంటే, ఈ పౌడర్ పగటిపూట సూర్యకాంతిని గ్రహించి చార్జ్ అయ్యి, రాత్రివేళల్లో నెమ్మదిగా కాంతిని విడుదల చేస్తూ లైట్ గ్రీన్ కలర్‌లో ప్రకాశిస్తూ ఉండి (రేడియం మాదిరిగా) వాహనా చాలకులకు దారి చూపుతుంది.

వాహన చాలకులకు ఈ రోడ్లు ఎలా ఉపయోగపడుతాయి?
సూర్యకాంతిని గ్రహించే ఈ పెయింట్ రాత్రివేళల్లో 8-10 గంటల వరకు ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా ప్రకాశించే రోడ్ సైడ్ మార్జిన్స్ వాహన చాలకులకు రోడ్డు గురించి దిశానిర్ధేశం చేయటమే కాకుండా, రాత్రివేళల్లో రోడ్డుపై విజిబిలిటీని పెంచేలా చేసి, ప్రమాదాలను అరికట్టేందుకు సహకరిస్తుంది.

వీధి లైట్ల సమస్య ఉండదు, విద్యుచ్ఛక్తి ఆదా!
ఈ రోడ్లు పూర్తిస్థాయిలో విజయవంతమైతే ఇక రోడ్లపై వీధి లైట్లను ఏర్పాటు చేయటం, వాటికి కరెంటును అందించటం వంటి సమస్యలు ఉండవు. దీని వలన కోట్ల రూపాయల విలువైన విద్యుచ్ఛక్తి ఆదా అవుతుంది.

Source: Smart Highway


Click it and Unblock the Notifications








