Alert: మీ కారులో ఇవి మర్చిపోతే పేలిపోయే ప్రమాదం..

ఈ రోజుల్లో చాలా కార్ల నుంచి మంటలు చెలరేగుతున్నాయి. దానికి కారణం కారులో సాంకేతిక లోపం కావచ్చు కానీ.. మనం చేసే పొరపాట్లు కూడా ఇలాంటి అనర్థాలకు దారితీస్తుంది. మన అలసత్వం వల్ల కొన్ని సార్లు ప్రమాదాన్ని మనం ఏరి కోరి తెచ్చుకున్నట్లే. అయితే కారులో మంటలు చెలరేగకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, చాలా మంది తమ నిత్యావసర వస్తువులను కారులో ఉంచడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి మొదలు ఇతర అనవసరమైన వస్తువులను అలానే ఉంచి ప్రయాణించే అలవాటు ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఈ అలవాటు కూడా మీకు చాలా కష్టాలకు కారణం కావచ్చు. ఈ కథనంలో, మీ కారులో ఎప్పుడూ ఉంచకూడని 5 విషయాల గురించి మేము మీకు తెలుసుకుందాం..

శానిటైజర్

శానిటైజర్..

కొవిడ్ పుణ్యామా అని ఈ రోజుల్లో అందరూ ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ ను తమ వద్ద ఉంచుకుంటున్నారు. ప్రజలు కూడా తమ వాహనాల్లో శానిటైజర్లను క్యారీ చేస్తున్నారు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ కు మండే స్వభావం కలదు. కాబట్టి మీరు బాటిల్‌ పై నేరుగా సూర్యకాంతి ఉన్న ప్రదేశంలో కారును నిలిపినట్లైతే పేలుడుకు కారణమవుతుంది.

శానిటైజర్ కారణంగా పేలుడు జరిగిన సంఘటనలు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా విదేశాల్లో చూస్తున్నాం. నేరుగా సూర్యకాంతి పడే ప్రదేశంలో ఉంచవద్దు అలా చేస్తే మీ కారు ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. మీరు బయటకు వెళ్లేటప్పుడు శానిటైజర్ ని మీతో పాటు తీసుకెళ్లండి అలా కారులో ఉంచినట్లైతే ఎప్పటికి ప్రమాదమే.

కాస్మొటిక్స్

చర్మ సౌందర్య సాధనాలు..

మీ కారులో సౌందర్య సాధనాలను ముఖ్యంగా ఫేస్ క్రీమ్స్ ఉంచవద్దు. అవి కొత్త సమస్యలను దారి తీయగలవు. కారులో నేరుగా సూర్యకాంతి పడినప్పుడు కారు క్యాబిన్ వేడెక్కుతుంది. ఆ తర్వాత కారులో ఉంచిన క్రీమ్స్ కాస్మెటిక్ వేడెక్కుతుంది. దానిని మీరు మరలా ఉపయోగించేటప్పుడు మీ చర్మంపై ఆ క్రీమ్ ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే కాస్మొటిక్స్ ని మర్చిపోతాము. ఇకపై అలా చేయకండి.

మందులు

ఔషదాలు..

కారులో మనం మరిచిపోయే మరొక వస్తువు ఔషదాలు. వీటిని డైలీ రొటీన్ లో భాగంగా తమ కారులో ఉంచుకునే అలవాటు ఉంటుంది. కారులో ఉష్ణోగ్రత తరచూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు మీరు ఏసీని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు మీరు కారును ఒకే చోట ఎక్కువసేపు పార్క్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, క్యాబిన్ ఉష్ణోగ్రత మళ్లీ మారుతూ ఉంటుంది. ఇది మందులపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది సాధారణ ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచే మందులపై తీవ్ర ఎఫెక్ట్ చూపుతుంది. తద్వారా అవి పనిచేయకపోవచ్చు.

లైటర్

లైటర్..

ధూమపానం చేసేవారు తమ కారులో లైటర్‌ ని వదిలివేయడం ఎప్పటికీ మర్చిపోకూడదు. లైటర్లలో ఉపయోగించే ద్రవ వాయువు చాలా వేగంగా మండుతుంది. కారు లోపల ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత లైటర్‌ కు మంటలు అంటుకునే అవకాశం ఉంటుంది.ఇది కాకుండా, ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత, మండే ద్రవం లీకేజీ ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితిలో, కారులో ఉంచిన లైటర్ కూడా మీ ఇబ్బందులను పెంచుతుందని ఒక పరిశోధనలో వెల్లడైంది.

వైన్ బాటిల్స్

వైన్ బాటిల్..

కొంతమందికి తమ కారులో వైన్ బాటిల్ దాచుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా మండే పదార్థం అని గుర్తుంచుకోండి. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల మాదిరిగానే అదే జాగ్రత్తలు తీసుకోవాలి. కారు క్యాబిన్‌ లో ఉష్ణోగ్రత పెరుగుదల బాటిల్ పై పడి పేలుడుకు దారితీస్తుంది. పైన పేర్కొన్న పదార్థాలను అవాయిడ్ చేయడం మూలంగా పేలుడు సంభవించకుండా జాగ్రత్త పడవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, March 4, 2023, 16:19 [IST]
English summary
Never leave these things inside the car it leads to fire
Read more on: #కారు #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+