లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

ప్రముఖ బ్రిటీష్ సూపర్‌కార్ల తయారీ సంస్థ లోటస్ కార్స్ తమ సరికొత్త మోడల్ 'ఎమిరా' (Emira)ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. లోటస్ బ్రాండ్ లైనప్‌లో ఎలిస్, ఎక్సిజ్ మరియు ఎవోరా ( Elise, Exige and Evora) మోడళ్ల మాదిరిగా ఎమిరా పేరు కూడా 'E' అక్షరంతో ప్రారంభమవుతుంది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

కాకపోతే, లోటస్ బ్రాండ్ నుండి వస్తున్న చివరి పెట్రోల్ పవర్డ్ ఇంటర్నల్ కంబస్టియన్ ఇంజన్ కలిగిన కారు కూడా ఇదే. లోటస్ కార్స్ ఇకపై భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారను చేయనుంది. అందుకే, చివరిగా ఈ పెట్రోల్ పవర్డ్ లోటస్ ఎమిరా కారును రూపొందించింది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

ఇప్పటి వరకూ లోటస్ అందించిన ఎలిస్, ఎక్సిజ్ మరియు ఎవోరా మోడళ్లను ఈ సరికొత్త ఎమిరా రీప్లేస్ చేయనుంది. మనదేశంలో మహీంద్రా తమ కార్లన్నింటినీ 'O' అక్షరంతో ముగించినట్లుగానే, లోటస్ సంస్థ కూడా తమ కార్ల పేర్లు E అనే ఆంగ్ల అక్షరంతో ప్రారంభిస్తుంది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

లోటస్ కార్ల నామకరణ వ్యూహం వెనుక ఉన్న రహస్యాన్ని బ్రిటిష్ ఆటోమొబైల్ సంస్థ వెల్లడించింది. ఈ కార్ బ్రాండ్ 1950 కాలంలో 'E' అక్షరాన్ని ఉపయోగించి ఈ నామకరణ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది, అయితే దీని మూలాలు 1948 నాటివని కంపెనీ తెలిపింది..

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

గత నివేదికల ప్రకారం, లోటస్ సంస్థ వ్యవస్థాపకుడు, కోలిన్ చాప్మన్ తమ మొదటి లోటస్ రోడ్ కారుకు మార్క్ I అనే పేరును పెట్టారు. కంపెనీ తమ కార్ల పేరుకి రోమన్ అంకెలను ఎంచుకుంది. ఆ తర్వాత ఈ కంపెనీ మార్క్ X (వరుసగా 10 మోడళ్ల వరకు) కార్లను విడుదల చేసింది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

ఈ ట్రెండ్ ప్రకారం, ఆ తర్వాత విడుదల చేయేబోయే మోడల్‌ను లోటస్ మార్క్ XI అని పిలవాలి. కానీ, ఈ ఆటోమోటివ్ బ్రాండ్ కేవలం లోటస్ XI అని పిలవడం ప్రారంభించింది. ఆ తర్వాత, దీని నామకరణ వ్యూహాన్ని మార్చాలని చాప్మన్ నిర్ణయించుకున్నాడు.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

మార్క్ II మాదిరిగానే కనిపించే అరబిక్ నంబర్ 11తో ఎదురయ్యే గందరగోళాన్ని నివారించడానికి, అతను ఈ కారుకు లోటస్ ఎలెవెన్ (Eleven) అనే పేరు పెట్టాడు. ఇకపై ఆ తరువాత వచ్చే లోటస్ కార్లన్నీంటికీ మొదటి అక్షరం 'E'తో ప్రారంభమయ్యేలా పేర్లను పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. అలా, ఇప్పటి వరకూ వచ్చిన లోటస్ కార్ల పేరు 'E' అక్షరంతోనే మొదలవుతుంది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

లోటస్ ఎమిరేట్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. లోటస్ ఎమిరా ఈ బ్రాండ్ నుండి వస్తున్న చివరి అంతర్గత దహన ఇంజన్ (ఐసియూ) వాహనంగా ఉండటంతో ఇది ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. దీని తరువాత, లోటస్ భవిష్యత్ లైనప్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

లోటస్ ఎమిరా విషయానికి వస్తే, ఇది ప్రారంభంలో లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ మోడల్‌గా ప్రారంభించబడుతుంది. ఇందులో టొయోటా నుండి గ్రహించిన 3.5-లీటర్ సూపర్ఛార్జ్డ్ వి6 పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. లోటస్ ఎవోరా జిటిలో కూడా ఇదే రకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

లోటస్ యొక్క అన్ని కార్ల పేర్లు 'E' అక్షరంతో ప్రారంభం కావడం వెనకున్న సీక్రెట్!?

కాగా, 2022 వేసవి నాటికి లోటస్ ఎమిరాలో కంపెనీ రెండవ ఇంజన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో మెర్సిడెస్-ఏఎమ్‌జి బ్రాండ్ నుండి గ్రహించిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-4 ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్‌ను ప్రస్తుత మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ45 వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
New 2022 Lotus Emira Revealed; The Story Behind Lotus Nameplates Starting With Letter 'E'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X