800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

కార్లలో ఎయిర్‌బ్యాగ్ (Airbag) అనే సేఫ్టీ ఫీచర్ ఒకప్పుడు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన యాడ్ ఆన్ సేఫ్టీ ఫీచర్. పదేళ్ల క్రితం వరకూ ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉండేవి కావు. అధిక ధర కలిగిన టాప్-ఎండ్ వేరియంట్లలో ఆప్షనల్ గా ఈ సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉండేది. అయితే, ఇటీవలి కాలంలో కార్ల సేఫ్టీ విషయంలో అనేక మార్పులు తీసుకురాబడ్డాయి. మొదట్లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేయబడింది. ఆ తర్వాతి కాలంలో డ్రైవర్ మరియు డ్రైవర్ పక్కన కూర్చునే ఫ్రంట్ ప్యాసింజర్ కోసం కార్లలో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయబడ్డాయి.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

కాగా, ఇప్పుడు కార్లలో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్ లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఇది అన్ని కార్లలో తప్పనిసరి కానుంది. ఈ 6 ఎయిర్‌బ్యాగ్స్ లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ విండోస్‌కి ఇరువైపులా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు డ్రైవర్ కు కుడివైపు షోల్డర్ ఎయిర్‌బ్యాగ్‌ అలాగే ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎడమవైపు షోల్డర్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఈ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అత్యవస సమయాల్లో కారులో ఉండే ప్రయాణీకులకు అన్ని వైపుల నుండి రక్షణ అందించేలా డిజైన్ చేయబడ్డాయి.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

కాబట్టి, అన్ని కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం అనేది నిజంగా స్వాగతించదగిన విషయం. అయితే, చాలా మంది కార్ కంపెనీలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ద్వారా వాటి తయారీ ఖర్చు పెరిగిపోతుందని, ఫలితంగా తమ చిన్న కార్లను తక్కువ ధరకు విక్రయించడం సాధ్యం కాదని, ఈ నిర్ణయం వలన తమ అమ్మకాలు పడిపోయి నష్టాల బాట పట్టే అవకాశం ఉందని కార్లను తయారు చేసే కంపెనీ వాపోతున్నాయి.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

ప్రత్యేకించి, దేశంలో ఎక్కువగా కార్లను విక్రయించే మారుతి సుజుకి కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. మారుతి సుజుకి దేశీయ విపణిలో ఇతర కార్ కంపెనీల కన్నా తక్కువ ధరలకే వివిధ రకాల వాహనాలను విక్రయిస్తోంది. వీటిని సరసమైన ధరకే విక్రయించేందుకు కంపెనీ ఆయా కార్లలో అవసరమైన మేరకు మాత్రమే ఫీచర్లను అందిస్తుంది. అయితే, ఇప్పుడు కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అమర్చాలనే నిబంధన అమల్లోకి వస్తే మాత్రం ఈ కంపెనీ కార్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

అయితే, ఈ విషయంలో పరిశ్రమ నిపుణుల వాదన మాత్రం మరోలా ఉంది. కార్లలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం వలన ప్రయాణీకులకు అదనపు భద్రతను కల్పించడమే కాకుండా, ఆయా కార్ కంపెనీలపై కస్టమర్ల విశ్వసనీయత కూడా పెరుగుతుందనేది నిపుణుల అభిప్రాయం. మరోవైపు, కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్ ను అందించడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేమీ కాదు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం, కార్లలో చేర్చే ఒక్కో అదనపు ఎయిర్‌బ్యాగ్ కు కేవలం రూ. 800 మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

అంటే, కార్లలో ప్రస్తుతం ఉన్న రెండు ఎయిర్‌బ్యాగ్ లకు అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్ లను జోడించాలంటే, అందుకు కార్ కంపెనీలకు సుమారు రూ. 3,200 మాత్రమే ఖర్చు అవుతుంది. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే, రాబోయే నెలల్లో అన్ని కార్లలో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్ లతో పాటుగా రెండు సైడ్ మరియు రెండు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌ లను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయబోదని తెలుస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్ ల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కొన్ని కార్ కంపెనీలు కేంద్ర మంత్రిని కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

కాబట్టి, ఈ తప్పనిసరి నిబంధన పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చినట్లయితే, కార్ల తయారీదారులు తమ కార్లలో జోడించిన అదనపు ఎయిర్‌బ్యాగ్ లకు అయ్యే ఖర్చుని పూర్తిగా వినియోగదారులపై మోపే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా, కార్ల ధరలు మరో కొన్ని వేల రూపాయల వరకూ పెరిగే ప్రమాదం కూడా ఉంది. అంటే, రానున్న రోజుల్లో కొత్త కారును కొనుగోలు చేయడం మరింత ఖరీదైన విషయంగా ఉంటుదన్నమాట.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

ఇదిలా ఉంటే, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల గురించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, దేశంలో 21 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయని మరియు ఏడు కోట్లకు పైగా నాలుగు చక్రాల వాహనాలు మరియు అంతకంటే ఎక్కువ కేటగిరీల వాహనాలు దేశంలో నమోదయ్యాయని తెలిపారు. ఈ మొత్తం వాహనాల్లో 5,44,643 యూనిట్లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలేనని లోక్‌సభలో నితిన్ గడ్కరీ చెప్పారు. వీటితోపాటు 54,252 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఆయన తెలిపారు.

800 రూపాయల ఎయిర్‌బ్యాగ్ కోసం అంత ఏడుపు ఎందుకు? కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల గురించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయని, కొన్ని ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల కోసం 8 నుండి 10 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటోదని, 2030 నాటికి దేశంలో 10 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్న లిథియం అయాన్ బ్యాటరీల యొక్క ప్రత్యామ్నాయాల కోసం వివిధ కంపెనీలు పరిశోధిస్తున్నాయని, రానున్న రెండేళ్లలో బ్యాటరీ ధరలు భారీగా దిగొచ్చే అవకాశం ఉమదని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
New airbag costs only rs 800 govt plans to make 6 airbags mandatory for all cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X