మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని మనందరికీ తెలిసినదే. ఈ విషయం గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, మందుబాబులు మాత్రం మొండిగానే వ్యవహరిస్తుంటారు. భారీ జరిమానాలు వేసినా, జైలు శిక్ష విధించినా లేదా లైసెన్స్ రద్దు చేసినా సరే ఈ అలవాటు మాత్రం మానుకోరు.

అందుకే, ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలే ఈ సమస్యకు కొత్త పరిష్కారాన్ని కనుగొనేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

డ్రంక్ అండ్ డ్రైవింగ్ సమస్యను నివారించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కొత్త టెక్నాలజీని సిద్ధం చేస్తుంటాయి. ఈ టెక్నాలజీలో భాగంగా వాహనం నడిపే డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని కారు గుర్తిస్తే, ఇది ఇక డ్రైవర్ మత్తు దిగేవరకూ ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం. ఇందుకోసం కారులో కొన్ని సెన్సార్లు ఉంటాయి. ఇవి డ్రైవర్ శ్వాసను గుర్తించి, అతడు ఆల్కహాల్ త్రాగినట్లుగా నిర్ధారించుకుంటే కారు ఇంజన్ స్టార్ట్ అవ్వదు.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

డ్రైవర్ ఎంత ప్రయత్నించినప్పటికీ, కారు ఇంజన్ ఆన్ అవ్వదు. కాబట్టి, సదరు డ్రంక్ డ్రైవర్ ఆ సమయంలో కారును నడపడానికి వీలు ఉండదు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ త్వరలోనే కార్లలో అందుబాటులోకి రాబోతోంది. కార్ల కంపెనీలు మద్యం వినియోగం కోసం డ్రైవర్లను తనిఖీ చేసే ఫీచర్లను చేర్చవలసి ఉంటుందని అమెరికాలోని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) వాహన తయారీదారులకు సూచించింది.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

అమెరికాలోని అన్ని కొత్త వాహనాలు ఈ సాంకేతికతతో రావాలని, మద్యం సేవించి వాహనం నడిపే డ్రైవర్‌లను ఆపగలిగేలా సదరు కార్లలో బ్లడ్ ఆల్కహాల్ మానిటరింగ్ సిస్టమ్‌లను రూపొందించబడాలని ఎన్‌టిఎస్‌బి సిఫార్సు చేస్తోంది. డ్రంక్ డ్రైవింగ్‌ను అరికట్టడానికి ఇలాంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించాలనే ఆలోచన ఎప్పటి నుండో ఉన్నప్పటికీ, గడచిన మంగళవారం నుంచి ఈ ప్రయత్నం వేగవంతం అయింది.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

ఇకపై, దేశంలోని అన్ని కొత్త వాహనాల్లో ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్స్ (ADS)ని అమర్చాలని NTSB కోరుకుంటుంది. ఆటోమొబైల్ సాంకేతికతలో ఈ కొత్త డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ టెక్నాలజీ చాలా పురోగతిన చెందిన సాంకేతికతగా తాను భావిస్తున్నాని, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్న నేపథ్యంలో, కార్లలో సేఫ్టీని పెంచేందుకు ఇలాంటి సాంకేతికత చాలా అవసరమని శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ మరియు టెక్ నిపుణుడు అహ్మద్ బనాఫా అన్నారు.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

పాసివ్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్‌ల గురించి బనాఫా చాలా కాలంగా పనిచేస్తున్నారు. సాధారణంగా డ్రైవర్లు తన శరీరంలో ఉండే ఆల్కహాల్ స్థాయిని గుర్తించేందుకు బ్రెత్అనలైజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ, కార్లలో ఈ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినట్లయితే, డ్రైవర్‌లు రోడ్డుపైకి వచ్చే ముందు బ్రెత్అనలైజర్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే, కారులో ఉండే సెన్సార్లు ఈ విషయాన్ని గుర్తించి, ఇంజన్ పనిచేయడాన్ని నిలిపివేస్తాయి.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

మద్యం సేవించకుండా వాహనం నడిపే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా లేదా వారి దృష్టిని మద్యం సేవించి వాహనం నడపివే ఆలోచనవైపుకు మరల్చకుండా ఉండేలా ఈ టెక్నాలజీ రూపొందించబడింది. అదే సమయంలో మద్యం తాగిన డ్రైవర్లు కారు స్టీరింగ్ వీల్ పట్టుకోగానే ఇందులో ఉండే ఆటోమేటిక్ సెన్సార్లు తాగిన డ్రైవర్‌ను కార నడపకుండా ఆపుతాయి. ఈ టెక్నాలజీ సమర్థవంతంగా పనిచేయాలంటే, కేవలం మద్యం సేవించిన డ్రైవర్ శ్వాసను మాత్రమే పరీక్షిస్తే సరిపోదు.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

ఉదాహరణకు, డ్రైవర్ మద్యం సేవించనప్పటికీ, కారులోని ఇతర ప్రయాణీకులు మద్యం సేవించి ఉన్నట్లయితే, కారులోని ఈ టెక్నాలజీని దానిని పొరపాటుగా గుర్తించి కారును నడపకుండా చేస్తే పెద్ద సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి, ఈ టెక్నాలజీ డ్రైవరు కారును స్టార్ట్ చేస్తున్నప్పుడు, అతని శ్వాసను గ్రహించడానికి ప్రయత్నించడంతో పాటుగా, వారి స్పర్శను కూడా అధ్యయనం చేస్తుంది. టచ్ టెక్నాలజీ సాయంతో శరీరంలో ఆల్కహాల్ ఏ స్థాయిలో ఉందో ఇది గమనిస్తుంది.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

కారులోని ఈ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ (ఏడిఎస్) తాగి వాహనం నడపాలని ప్రయత్నించే డ్రైవర్ విషయంలో వివిధ పారమితులను అంచనా వేసిన తర్వాత కారును ఆన్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటుంది. ఇందుకోసం నిర్ధిష్ట బ్లడ్ ఇన్ ఆల్కహాల్ శాతాన్ని నిర్దేశించడం జరుగుతుంది. మద్యం సేవించిన డ్రైవర్ శరీరంలో ఆల్కహాల్ శాతం నిర్ధిష్ట మోతాదు కన్నా తక్కువగా ఉంటే ఇంజన్ ఆన్ అవుతుంది. అలాకాకుండా, అది నిర్దిష్ట మోతాదు కన్నా ఎక్కువగా గుర్తిస్తే ఇంజన్ ఆన్ కాకుండా చేస్తుంది.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

అమెరికాలోని ఫ్రెస్నో సమీపంలో 2021లో జరిగిన ఘోర ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా మంగళవారం NTSB ఈ టెక్నాలజీ గురించి సిఫార్సు చేసింది. గతేడాది కొత్త సంవత్సరం రోజున మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ మరొక వాహనాన్ని ఢీకొట్టడంతో పెద్దల డ్రైవర్లు మరియు 6 నుండి 15 సంవత్సరాల వయస్సు గల ఏడుగురు పిల్లలు మరణించారు. దీంతో కార్లలో ఈ టెక్నాలజీ చాలా అవసరమని మదర్స్ ఎగైనెస్ట్ డ్రంక్ డ్రైవింగ్ (MADD) యొక్క చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ ఆఫీసర్ స్టెఫానీ మన్నింగ్ అభిప్రాయపడ్డారు.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

సదరు కారు ప్రమాదంలో మరణించి "ఆ పిల్లలు మరియు పెద్దలు ఈ రోజు జీవించి ఉండాలి", కానీ ఓ నిర్లక్ష్యపు డ్రైవర్ వలన వారంతా ఈ లోకాన్ని విడిపెట్టి వెళ్లారు అని ఆమె అన్నారు. ఆ రోజు ఆ ప్రమాదం సంభవించడానికి ఎటువంటి కారణం లేదు, ఎందుకంటే ఆ క్రాష్‌నే కాదు ఇలా నిత్యం జరిగే ఎన్నో ప్రమాదాలను నిరోధించే సాంకేతికత మన వద్ద ఉందని ఆమె చెప్పారు.

మందుకొట్టి కారు ఎక్కారో.. అది ముందుకు వెళ్లనని మొరాయించడం ఖాయం.. కొత్త టెక్నాలజీ వస్తోంది..

స్వీడన్ కార్ కంపెనీ వోల్వో కూడా ఇలాంటి టెక్నాలజీపై చాలా కాలంగా పనిచేస్తోంది. డ్రైవర్‌ను నిత్యం పర్యవేక్షించడానికి మరియు వారు మత్తులో లేదా పరధ్యానంగా ఉన్న విషయాన్ని గుర్తించి, కారు ఆటోమేటిక్‌ా జోక్యం చేసుకోవడానికి కారులో కెమెరాలు మరియు ఇతర సెన్సార్‌లను ఉపయోగించడం ద్వారా వోల్వో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ పరిమాణాలను బట్టి చూస్తుంటే, రాబోయే కొన్నేళ్లలో అన్ని కార్లలో ఈ తరహా టెక్నాలజీ ఓ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి, మందు బాబులు పారాహుషార్.. మీరు తాగితే తాగండి కానీ, తాగినప్పుడు మాత్రం ఎలాంటి వాహనం జోలికి వెళ్లకండి.

Most Read Articles

English summary
New alcohol detection systems ads technology in cars will not allow drunk srivers to drive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X