బైకును ఇలా కూడా డెలివరీ చేస్తారని మీకు తెలుసా? వీడియో చూస్తే ఫిదా అవుతారు!

ఏదైనా వాహనం కొనుగోలు చేయాలంటే ఎవరైనా దాదాపు డీలర్షిప్ దగ్గరకు వెళ్తారు. అయితే హోమ్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటే అలాంటి వాళ్లకు ఎలా డెలివరీ చేస్తారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన వివరాలు వివరంగా తెలుసుకుందాం.

నిజానికి ద్విచక్ర వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీంతో అనేక బ్రాండ్స్ ఎప్పటికప్పుడు టూ-వీలర్స్ లాంచ్ చేస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో ఏప్రిలియా కూడా సూపర్ బైకులను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. కంపెనీ ఇటీవల ఒక కస్టమర్‌కు హోమ్ డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎంతోమంది ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.

Aprilia RS457 Home Delivery

వీడియోలో గమనించినట్లయితే.. రోహిత్ పరాద్కర్ అనే వ్యక్తి ఏప్రిలియా (Aprilia) కంపెనీకి చెందిన ఆర్ఎస్457 (RS457) స్పోర్ట్స్ బైక్ హోమ్ డెలివెరీ చేసుకున్నాడు. ఈ బైకుని ఒక పెద్ద ట్రక్కులో తీసుకువస్తారు. అంతే కాకుండా ఈ బైకుని ఒక పెద్ద బాక్స్‌లో ప్యాక్ చేసి ఉంచారు. ఈ బైకుని ట్రక్కులో నుంచి చాలా జాగ్రత్తగా కిందికి దించడం కూడా వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు.

ఈ బాక్స్‌ను రెండు తాళ్లతో గట్టిగా కట్టి ఉంచారు. ట్రక్కు డ్రైవర్ సాయంతో కట్టును తీసివేసి అన్‌బాక్స్ చేస్తారు. బైకు భద్రంగా ఉండటానికి బైక్ చుట్టూ మెటల్ బోను ఏర్పాటు చేశారు. దానిని తీసి వేసిన తరువాత బైక్ చుట్టూ కవర్ ప్యాక్ చేసి ఉండటం చూడవచ్చు. వాటన్నింటిని తొలగిస్తారు. అప్పుడు బైక్ బయటపడుతుంది. బైక్ మొత్తం బ్లాక్ షేడ్‌లో రెడ్ గ్రాఫిక్స్‌తో చాలా స్పోర్టీగా ఉండటం చూడవచ్చు.

Aprilia RS457 Home Delivery

బైకును కస్టమర్ వద్దకు చేర్చే సమయంలో ఏదైనా ప్రమాదం జరగకుండా.. బైక్ ముందుకు, వెనుకకు కదలకుండా ఉండటానికి గట్టిగా కట్టి ఉంచారు. ఈ విధంగా గట్టిగా కట్టి ఉంచడం ద్వారా బైకుకు ఎలాంటి హాని జరగకుండా కస్టమర్ వద్దకు చేరింది. సరైన భద్రత కల్పించకపోతే.. సుదూర ప్రాంతం నుంచి బైకుని డెలివరీ చేసే సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగితే బైక్ డ్యామిజీకి గురయ్యే అవకాశం ఉంటుంది.

కంపెనీ ఈ బైకును గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ చేసింది. కాగా డెలివరీలు ఈ మధ్య కాలంలోనే ప్రారంభమయ్యాయి. బహుశా హోమ్ డెలివరీ చేసిన మొదటి ఏప్రిలియా ఇదే కావొచ్చని తెలుస్తోంది. ఇది దాని మునుపటి మోడల్ ఆర్ఎస్660 మాదిరిగా ఉంటుంది. ఆర్ఎస్457 బైక్ 457 సీసీ ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47 Bhp పవర్ మరియు 48 Nm టార్క్ అందిస్తుంది.

సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన ఈ బైక్ పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ యొక్క ముందు వైపు 41 మిమీ USD పోర్క్ మరియు వెనుక వైపు మోనోషాక్‌ ఉంటుంది. రెండూ ప్రీలోడ్ అడ్జస్టబుల్. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

ఈ మోటార్‌సైకిల్ మూడు రైడింగ్ మోడ్‌లు, త్రీ లెవెల్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటి అనేక ఇతర ఫీచర్స్ ఉన్నాయి. ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ దాని విభాగంలో కెటిఎమ్ RC390, కవాసకి నింజా 400 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. సరికొత్త ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ ధర రూ. 4.10 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2024, 13:00 [IST]
English summary
New aprilia rs457 sports bike home delivery video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+