కొత్త బ్యాట్‌మ్యాన్ చిత్రంలో ఉపయోగించనున్న వాహనం ఇదే
బ్యాట్‌మ్యాన్ సినిమా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్యాట్‌మ్యాన్ కాన్సెప్ట్‌తో ఇప్పటికే అనేక సిరీస్‌ల సినిమాలు, సీరియల్స్ మరియు కామిక్స్ కూడా వచ్చాయి. ప్రతి బ్యాట్‌మ్యాన్ చిత్రంలోను ఆ పాత్రను పోషించే వ్యక్తి ఉపయోగించే వాహనం (బ్యాట్‌మొబైల్)కి ప్రత్యేక స్థానం ఉంటుంది. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో ఈ వాహనాలను తయారు చేస్తుంటారు.
తాజాగా వస్తున్న బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ చిత్రంలో కూడా ఓ సరికొత్త బ్యాట్‌మొబైల్‌ను ఉపయోగించనున్నారు. ఈ సరికొత్త బ్యాట్‌మొబైల్ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్లో విడుదలైంది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్నదే సరికొత్త బ్యాట్‌మొబైల్. బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ చిత్రంలో బ్యాట్‌మ్యాన్ పాత్ర పోషిస్తున్న బెన్ అఫ్లిక్ ఈ బ్యాట్‌మొబైల్‌ను ఉపయోగించనున్నాడు.

ఈ కొత్త బ్యాట్‌మొబైల్ ఇదివరకటి సిరీస్ బ్యాట్‌మ్యాన్ చిత్రంలో ఆ పాత్ర పోషించిన క్రిస్టియన్ బేల్ ఉపయోగించిన టంబ్లర్ బ్యాట్‌మొబైల్ మాదిరిగానే ఉంటుంది. అయితే, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా మాత్రం ఇందులో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. చూడటానికి యుద్ధ ట్యాంక్‌లా భీకరంగా కనిపించే ఈ బ్యాట్‌మొబైల్‌లో మెషీన్ గన్స్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది.
బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ చిత్రాన్ని జాక్ స్నైడర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో బెన్ ఆఫ్లెక్ బ్యాట్‌మ్యాన్ పాత్రను పోషిస్తున్నారు. మే 6, 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








