బ్యాట్‌మ్యాన్ vs సూపర్‌మ్యాన్ చిత్రం కోసం సరికొత్త బ్యాట్‌మొబైల్
ఇద్దరు సూపర్ హీరోలు కలిసి ఒకే చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది.. అద్దిరిపోతుంది కదూ..! అలాంటి చిత్రమే బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్. అయితే, ఈ చిత్రం విడుదల కావాలంటే సరిగ్గా రెండేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణం ఆరంభ దశలోనే ఉంది.
ఈ నేపథ్యంలో, బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న దర్శకుడు జాక్ స్నైడర్, ఈ చిత్రంలో బ్యాట్‌మ్యాన్ పాత్ర ఉపయోగించబోతున్న సరికొత్త బ్యాట్‌మొబైల్ వాహనాన్ని మరియు బ్యాట్‌మ్యాన్ పాత్ర ఎలా కనిపించబోతున్నాడనే విషయాన్ని ట్విట్టర్‌లో ఫొటోల రూపంలో పోస్ట్ చేశారు.

బ్యాట్‌మ్యాన్ కార్టూన్లు, చిత్రాల్లో కనిపించే పురాతన క్లాసిక్ బ్యాట్‌మొబైల్‌ను తలపించేలా ఈ కొత్త బ్యాట్‌మొబైల్‌ను డిజైన్ చేశారు. దీని వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఇదివరకటి బ్యాట్‌మ్యాన్ చిత్రం ది డార్క్ నైట్ రైజెస్‌లో ఉపయోగించిన టంబ్లర్ వాహనంలోని యుద్ధ ట్యాంక్ ఫీల్‌ను అలాగే కొనసాగించినట్లు తెలుస్తోంది.
బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ జాక్ స్నైడర్ చిత్ర డైరెక్టర్ ట్విట్టర్‌లో ఈ సరికొత్త బ్యాట్‌మొబైల్‌తో పాటు బోనస్‌గా కొత్త బ్యాట్‌సూట్ ధరించిన బెన్ ఆఫ్లెక్ (బ్యాట్‌మ్యాన్ పాత్రధారి)ను కూడా చూపించాడు. ఇది ఫ్రాంక్ మిల్లర్ యొక్క ది బ్యాట్‌మ్యాన్ రిటన్స్ కామిక్‌లోని ఒరిజినల్ కాస్ట్యూమ్‌లా అనిపిస్తుంది. మే 6, 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications








