కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం నానాటికి అధికమవుతోంది. అయితే, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలతో పాటే, చార్జింగ్ మౌళిక సదుపాయాలు కూడా పెరగడం ఎంతో అవసరం. మెట్రో నగరాలలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా ఉన్నప్పటికీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మాత్రం అంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నోయిడాలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిటీ గవర్నమెంట్ ఇప్పుడు ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో చార్జింగ్ సమస్యలు త్వరలోనే ముగియనున్నాయి.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

నగరంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల దృష్ట్యా, నోయిడా పరిపాలన విభాగం ఇప్పుడు అన్ని కొత్త భవన ప్రాజెక్టులలో ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్ లేకుండా కొత్త బిల్డింగ్ ప్రాజెక్ట్ ఆమోదించబడదని నోయిడా పరిపాలన విభాగం చెబుతోంది. ఈ విషయంలో 2010 నిబంధనలను సిటీ గవర్నెన్స్ సవరించింది.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

ఈ ఏడాది మార్చి 25 నాటికి దేశంలో నమోదైన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10.75 లక్షలకు పైగా ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం, దేశంలో మొత్తం 1,742 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) పనిచేస్తున్నాయి. దేశంలోని 9 నగరాల్లో సుమారు 940 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నై నగరాలు ఉన్నాయి.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

దేశంలోని BEE, EESL, PGCIL, NTPC మొదలైన ప్రైవేట్ మరియు పబ్లిక్ ఏజెన్సీలను కలుపుకొని పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. వినియోగదారులకు అనుకూలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి, ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి అనేక ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

దేశంలో ఇ-మొబిలిటీ పరివర్తనను వేగవంతం చేసేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 14న "ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు - సవరించిన మార్గదర్శకాలు మరియు ప్రమాణాలు" విడుదల చేసింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క ఫేమ్ (FAME) ఇండియా స్కీమ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం మరియు తయారు చేయడం కోసం, ఈ పథకం కింద 68 నగరాల్లో 2,877 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు మంజూరు చేయబడ్డాయి.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నోయిడాలో 69 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అమర్చిన అన్ని ఛార్జింగ్ స్టేషన్లు ప్రామాణిక ఛార్జింగ్ సాకెట్లతో వస్తాయి మరియు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయగల సామర్థ్యాలను కలిగి ఉంటాయి. తాము తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి దారి తీస్తుందని, ఇది గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని నోయిడా పరిపాలన విభాగం తెలిపింది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతుందని, అందువల్ల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ముందుగానే ప్రారంభించాలని నోయిడా సిటీ సర్కార్ భావిస్తోంది.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

హైవేపై ఛార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి

కొత్త హైవే ప్రాజెక్ట్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడానికి కూడా ఆమోదం లభించిందని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. హైవేపై ఛార్జింగ్ స్టేషన్లను రోడ్ సైడ్ సౌకర్యంగా ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎలక్ట్రిక్ వాహనాల కోసం హైవే వెంబడి ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉండే 39 ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, వాటికి కావలసిన మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం కావలసినన్ని అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిచడం జరుగుతోంది. ఇందులో భాగంగానే బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'బౌన్స్ ఇన్ఫినిటీ' (Bounce Infinity) ఇప్పుడు దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీలలో ఒకటైన 'భారత్ పెట్రోలియం'తో ఓ భాగస్వామం కుదుర్చుకుంది.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

ఈ భాగస్వామ్యంలో భాగంగా 'బౌన్స్ ఇన్ఫినిటీ' ఇప్పుడు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను భారత్ పెట్రోలియంలో ఏర్పాటు చేయనుంది. ఇరు కంపెనీల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యంలో భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో దాదాపు 3,000 బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయాలని బౌన్స్ ఇన్ఫినిటీ లక్ష్యంగా పెట్టుకుంది. బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని ఖాళీ అయిన బ్యాటరీని మార్చుకోవాలనుకున్నప్పుడు బౌన్స్ యాప్‌లో సమీపంలోని స్వాపింగ్ లొకేషన్ కోసం వెతుక్కోవచ్చు.

కొత్త భవానాలకు ఆమోదం ఇవ్వాలంటే, వాటిలో ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉండటం తప్పనిసరి!

బౌన్స్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బ్యాటరీతో పాటుగా మరియు బ్యాటరీ లేకుండా రెండు విధాలుగా విక్రయిస్తోంది. బ్యాటరీ లేకుండా ఈ స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు ఇలాంటి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో తమ ఖాలీ బ్యాటరీని ఎక్సేంజ్ చేసుకొని, కొంత నామ మాత్రపు చార్జింగ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా కొత్త బ్యాటరీని తమ స్కూటర్ లో ఇన్‌స్టాల్ చేసుకొని ముందుకు సాగిపోవచ్చు. ఇది బ్యాటరీ చార్జింగ్ కోసం గంటలు తరబడి వేచి ఉండే సమయాన్ని ఆదా చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 9, 2022, 13:46 [IST]
English summary
New building projects to have mandatory ev charging stations in noida
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+