Car Smell కొత్త కారులో లాంగ్‌డ్రైవ్ చేస్తున్నారా.. కాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ: స్టడీ
మేము చెప్పే ఈ విషయం మిమ్మల్నీ షాకింగ్‌కి గురిచేయవచ్చు. కొత్త కారు కొన్నామని సంబుర పడిపోకండి. దానివల్ల జరిగే నష్టం తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే దానివల్ల మీకు కొత్త వ్యాధి రానుంది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా అదే నిజం. అసలు ఆ భయంకరమైన వార్త ఏంటో తెలుసా..
మంచి డబ్బు సంపాదించాక సొంతిళ్లు కట్టుకోవడం. ఓ మంచి కారు కొనుక్కోవడం అందరికి కామన్‌గా ఉండే చిన్న చిన్న ఆశలు. అయితే మీరు కొన్న కొత్త కారు మీకు చిక్కులు తెచ్చి పెట్టనుంది. ఎందుకంటే కొత్త కారు వాసన వాస్తవానికి చాలా ప్రమాదకరమని ఓ అధ్యాయనంలో తేలింది. కొత్త కార్లలో లాంగ్ డ్రైవ్ లు చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని తాజా అధ్యయనం వివరాలు సామాన్యులను షాక్‌కి గురిచేస్తుంది.

హార్వర్డ్ యూనివర్సిటీ, చైనాలోని బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, కొత్త వాహనం లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని అలానే దాదాపు 20 నిమిషాలు డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదకరమని నివేదిక పేర్కొంది.
కొత్త కార్లలో వివిధ పదార్థాలను గుర్తించడానికి పలు సెన్సార్లను ఉపయోగించి, పరిశోధకులు కొత్త కార్లలో గాలి నాణ్యతను పరిశోధించారు. వరుసగా 12 రోజుల పాటు వాటిని మూసివేసి భిన్న పర్యావరణ పరిస్థితులలో వెలుపల ఉంచి పరీక్షించారు. దాని నుంచి ఉత్పత్తి అయ్యే వాసన క్యాన్సర్ కి దారితీస్తుందని వెల్లడించింది. ఫార్మాల్డిహైడ్ అనే కాలుష్యకారకం కొత్త కార్లలో చైనా జాతీయ భద్రతా అవసరాల కంటే 34.9% ఎక్కువ స్థాయిలో ఉందని వివరించింది.

మానవ కార్సినోజెన్ అసిటాల్డిహైడ్ కూడా చైనా జాతీయ భద్రతా అవసరాల కంటే 60.5% స్థాయిలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అస్థిర సేంద్రీయ సమ్మేళనాల మిశ్రమాలు అధిక సంభావ్య ఆరోగ్య ప్రమాదంగా పరిగణించబడే సాంద్రతలలో ఉన్నట్లు కనుగొనింది. కొత్త కార్లలో వాటి విలక్షణమైన రసాయనాల వాసన డ్రైవర్లకు అధిక ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని చెప్పింది.
కారులో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, సమ్మేళనాల సాంద్రత కూడా పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. ఫార్మాల్డిహైడ్ గది ఉష్ణోగ్రత వద్ద రంగులేని, మండే స్వభావం కలిగిన వాసనను కలిగి ఉంటుందని చెప్పింది. పర్మినెంట్ ప్రెస్ టెక్స్ టైల్స్, పెయింట్స్ అండ్ కోటింగ్స్, లక్కర్స్, ఫినిషర్స్ వంటి రోజువారీ గృహ వినియోగం అనేక వస్తువులలో ఇది ఉంటుంది.

ఎసిటాల్డిహైడ్ అనే మరో రసాయనం ఇతర రసాయనాల సంశ్లేషణలో మధ్యరకంగా ఉపయోగించబడుతుంది. దీనిని ప్రాథమిక రంగులు, పాలిస్టర్ రెసిన్ సువాసనలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి కొత్త కార్లలో ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల ఇలా జరుగుతుందని చెప్పింది. దీనికి గల కారణాలను అధ్యయనం పూర్తి స్థాయిలో వెళ్లడించలేదు.
ఇలాంటి అధ్యయనాలు ఇది వరకు చాలాసార్లు జరిగాయి. 2021 లో, రివర్సైడ్లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు కొత్త వాహనాన్ని ఎక్కువసేపు నడపడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని, 20 నిమిషాల కంటే ఎక్కువ డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదకరమైన రసాయనాలకు గురవుతుందని పేర్కొన్నారు.
తమ వాహనాల్లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులకు బెంజీన్, ఫార్మాల్డిహైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాన్ని ఈ అధ్యయనం హైలైట్ చేసింది. విభిన్న వాతావరణాలలో వివిధ దేశాలలో ఈ అధ్యయనం చేయగా ఇది కాన్సర్ కి దారితీస్తున్నట్లు తెలిపింది. బెంజీన్, ఫార్మాల్డిహైడ్ లు ప్రాప్ 65(క్యాన్సర్, పునరుత్పత్తి / అభివృద్ధి విషపూరిత కెమికల్స్) జాబితాలో ఉన్నందున కొత్త వాహనాలలో కాన్సర్ కి గురిచేస్తున్నట్లు తెలిపింది. దీనిపై పూర్తి పరిశోధనలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications








