ఇలాంటి పెళ్లి వేడుక ఎక్కడా చూసి ఉండరు.. ఏకంగా జేసేబీ పైనే వధూవరుల ఊరేగింపు, ఫొటోలు వైరల్
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయేలా ఆ మధుర క్షణాలను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఈ మధ్య వివాహాల ట్రెండ్లే మారిపోయాయి. ఖరీదైన కార్లు, గుర్రపు బగ్గీలపై వధూవరుల ఊరేగింపు జరిపిస్తున్నారు. కానీ వీరి పెళ్లి ఊరేగింపు మాత్రం ఇందుకు విభిన్నం..
వివాహ బంధాన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ యువ జంట(New Couple on JCB). సాధారణంగా పెళ్లి అయిపోగానే పూలతో అందంగా అలకరించిన కారులో లేదంటే మరింత కొత్తగా గుర్రపు బగ్గీలపై వధూవరులను డీజే సౌండ్ మధ్య ఊరేగిస్తారు. ఆ తర్వాత వధువు లేదా వరుడి ఇంటికి తీసుకెళ్తారు. ఈ విషయం మనకు తెలిసిందే.. కానీ కర్ణాటకలో ఓ జంటను ఏకంగా జేసీబీపైనే ఊరేగించారు.

ఉడిపి జిల్లా బ్రమవరలో ఓ జంట పెళ్లి ఊరేగింపు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెళ్లిళ్లు ఇలా కూడా చేసుకుంటారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తమ స్నేహితులు ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కి నూతన వధూవరులు పూజ, మిథున్‌లు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. కొత్త జంట ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి.
ఈ పెళ్లి వేడుకలో కొత్తగా పెళ్లయిన జంట వరుడి ఇంటికి వెళ్లేందుకు వారి స్నేహితులు జేసీబీని ఎంచుకున్నారు. అందుకోసం జేసీబీ ముందు ప్రత్యేక సోఫాను ఏర్పాటు చేశారు. దానిని పూలతో అలంకరించి, దానిపై వధూవరులను కూర్చోబెట్టారు. అలంకరించిన జేసీబీలో కొత్త జంటను ఊరేగిస్తూ.. రోడ్డు పొడవునా స్నేహితులు, బంధువులు సందడి చేసి సంబరాలు జరుపుకొన్నారు.

అయితే ఈ పెళ్లి వేడుకలో మరో ఆకర్షణ కూడా ఉంది. అదేంటంటే.. ఓ వైపు పెళ్లి తంతు జరుగుతుండగా.. మరో వైపు వధూవరుల స్నేహితులు కోడిపందాలు నిర్వహించారు. ఇరు వర్గాల వైపు నుంచి రెండు కోడి పుంజులను తీసుకువచ్చి.. మండపం మీద కోడి పందేలు నిర్వహించడం.. పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు వధూవరులకు కూడా సర్‌ప్రైజ్ అయ్యారు.
అయితే జేసీబీపై వధూవరుల ఊరేగింపు జరగడం ఇది తొలిసారి కాదు. 2018లో కూడా దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరులో ఇలాంటి వివాహ వేడుకే జరిగింది. ఉత్తర భారత్‌లో కూడా పలు చోట్ల ఇలాంటి వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
అంతే కాకుండా గత రెండు, మూడేళ్లుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ట్రెండింగ్ అవుతున్నాయి.

సినిమాటిక్ స్టైల్‌లో చాలా మంది తమ వివాహ వేడుకలను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంటారు. మున్ముందు కూడా పెళ్లి వేడుకలో మరింత కొత్తదనం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా ఇలాంటి సెలబ్రేషన్స్‌ను పాత కాలం జంటలు మిస్సవడం కొంచెం అసంతృప్తిగా ఉన్నా.. ఈ తరం జంటలకు ఇదే సూపర్ ఛాన్స్..
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








