నేటి నుంచి ఆర్టీవో ఆఫీస్ బ్రోకర్ల దందాకు చెక్.. ఇకపై అక్కడే మీ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు
దేశంలో నేటి (జూన్ 1-2024) నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. లైసెన్స్ జారీ కోసం ఇకపై ఆర్టీవో ఆఫీస్‌కి వెళ్లాల్సిన పనిలేదు. ఆర్టీవో ఆఫీస్ నుంచి లైసెన్సులు జారీ చేసే ప్రక్రియకు కేంద్రం స్వస్తి పలికింది. లైసెన్స్ ఇతర రెన్యువల్ అవసరాల కోసం ఇకపై ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీరు శిక్షణ తీసుకున్న డ్రైవింగ్ స్కూల్ వద్దనే లైసెన్సులు పొందే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆర్టీవో ఆఫీస్‌లో బ్రోకర్లు (మధ్యవర్తుల) చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. మీరు కారు డ్రైవింగ్ నేర్చుకున్న చోటే లైసెన్స్‌ను పొందనున్నారు. నేటి నుంచి అమలు కాబోయే కొత్త రూల్స్‌కి సంబంధించి తాజా వివరాలు మీకోసం..
ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీతో గణనీయమైన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దరఖాస్తుదారులు ఇప్పుడు గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలల్లో తమ డ్రైవింగ్ పరీక్షను తీసుకుని అక్కడే డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది. తాజా మార్పులు జూన్ 1 నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఇందుకుసంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ ప్రజలకు ఎంతో మేలు చేయనున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆర్టీవో కార్యాలయాల్లో లైసెన్స్ పొందడం అనేది పెద్ద సమస్యగా మారింది. ప్రజలు నేరుగా ఆర్టీవో కార్యాలయాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నా చాలా మంది బ్రోకర్లు జోక్యం చేసుకుని లైసెన్సులు పొందేందుకు కమీషన్లు తీసుకోవడం అలవాటు అయిపోయింది. దీంతో ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. లైసెన్స్ జారీ కోసం అధిక మొత్తంలో సమర్పించుకోవాల్సి వస్తుంది.
అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపే వారిపై కూడా కఠిన చర్యలను అమల్లోకి తెచ్చారు. లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే రూ. 2,000 వరకు స్పాట్‌లోనే జరిమానాలు విధించనున్నారు. ఇక డ్రైవింగ్‌లో మైనర్‌లు పట్టుబడితే వారికి భారీ జరిమానాను విధించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనం నడిపితే రూ.25,000 పడనుంది. దీనితో పాటు తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని రద్దు చేయనున్నారు.

పర్యావరణానికి మేలు చేసే ఉద్దేశ్యంతో ఈ రూల్స్‌ని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ అమలు చేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల వద్ద ఉన్న 90,000లకు పైగా వాహనాలను తొలగించనున్నారు. దీంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం సబ్సిడీని కూడా అందిస్తోంది. కాలం చెల్లిన వాహనాలను తొలగించాలనే మెసేజ్‌ని ప్రజలకు కల్పిస్తున్నారు.
టెస్టింగ్ కోసం ఆర్టీవో కార్యాలయాల్లో వినియోగించే పాత వాహనాల కారణంగా పర్యావరణానికి హాని జరుగుతుందని రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. నిర్వహణ ఖర్చుతో పాటు ఇతర ఇబ్బందులు తలెత్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నప్పటికీ బ్రోకర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తీసుకువచ్చిన ఈ రూల్స్‌తో ప్రజలకు సమయంతో పాటు కొంతమేర డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉండనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








