ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

డిజిటల్ ఇండియా క్యాంపైన్ మరియు కరోనా మహమ్మారి నేపథ్యంలో, దేశంలోని అనేక రకాల సేవలు ఆన్‌లైన్ అయ్యాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలు అందించే కొన్ని రకాల సేవలు కూడా ఆన్‌‌లైన్ చేయబడ్డాయి. ఇటీవలి కాలంలో, దేశంలో లెర్నర్స్ లైసెన్స్ మరియు డ్రైవర్స్ లైసెన్స్ పొందే ప్రక్రియ కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేయబడింది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

ఈ నేపథ్యంలో, 2021 లో డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, డ్రైవింగ్ లైసెన్స్ విధివిధానాల్లో మార్పులు చేసింది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు ప్రైవేట్ వాహన తయారీదారులు, ఎన్జీవోలు మరియు ఆటోమొబైల్ అసోసియేషన్లు ప్రభుత్వం ఆమోదించిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను నిర్వహించగలవు. నిర్దేశిత శిక్షణ పూర్తి చేసుకున్న వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి కూడా వారికి అనుమతి ఉంటుంది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

దీనికి సంబంధించిన మార్గదర్శకాలను భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ బుధవారం నాడు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, పైన తెలిపిన సంస్థలు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులతో పాటుగా ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీవోల) ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

ఆగష్టు 2, 2021 న జారీ చేసిన ఒక ప్రకటనలో, "ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ కోసం కంపెనీలు, అసోసియేషన్లు, సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేట్ సంస్థలు / ఆటోమొబైల్ అసోసియేషన్లు / వాహన తయారీదారుల సంఘాలు / స్వయంప్రతిపత్త సంస్థలు / ప్రైవేట్ వాహన తయారీదారులు మొదలైన చట్టబద్ధమైన సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

మోటార్ వాహనాల చట్టం 1989 ప్రకారం, డ్రైవింగ్ శిక్షణ అందించే శిక్షణా కేంద్రాలు నిర్దేశించిన భూమిపై అవసరమైన మౌలిక సదుపాయాలు లేదా సౌకర్యాలను కలిగి ఉండాలని రవాణా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అలాంటి సంస్థలు లైసెన్స్ కోసం తమ క్లీన్ ఇమేజ్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడానికి దరఖాస్తుదారు తగిన వనరులను మరియు తమ ఆర్థిక సామర్థ్యాన్ని చూపించాలని ఈ మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

డ్రైవింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సెంటర్ కోసం దరఖాస్తును చేసుకున్న తర్వాత, సంబంధిత అథారిటీ దరఖాస్తు స్వీకరించిన అరవై రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తుంది. గుర్తింపు పొందిన శిక్షణ కేంద్రం యొక్క వార్షిక పనితీరు నివేదికను సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీవోలు) / జిల్లా రవాణా కార్యాలయాలు (డిటిఓల)కు సమర్పించాలి.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

అటువంటి గుర్తింపు పొందిన కేంద్రాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంట్ ఇవ్వదు. ఏదేమైనప్పటికీ, సంస్థలు కార్పొరేట్ సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఏదైనా ఇతర పథకం కింద (సిఎస్ఆర్) క్రింద మద్దతును పొందే అవకాశం ఉంటుంది.

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం చాలా సులభం.. ఎలాగంటే..?

అదనంగా, గుర్తింపు పొందిన కేంద్రాలు శిక్షణ యొక్క సిలబస్, నిర్మాణం, సమయం మరియు పని దినాలపై సమాచారాన్ని కలిగి ఉన్న ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేయాలని ఈ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్‌లో శిక్షణ పొందుతున్న వ్యక్తుల జాబితా మరియు శిక్షణ పొందడం, శిక్షకుల వివరాలు, శిక్షణ ఫలితం, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సెలవుల జాబితా, శిక్షణ ఫీజు మొదలైన వివరాలు కూడా పొందుపరచాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
New driving license rules can make auto makers ngos to run driving training centers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X