Alert డ్రైవింగ్ లైసెన్స్ జారీలో భారీ మార్పులు.. జూన్ 1 నుంచి ఆర్టీఓ ఆఫీస్‌కి వెళ్లాల్సిన పనిలేదు
జూన్ 1, 2024 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ భారీ మార్పులు జరగనున్నాయి. ఇక ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ చేయరు. దీనికి సంబంధించి రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. అసలు ఆ ప్రకటనలో ఏముంది? మరీ లైసెన్స్ ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రస్తుతం ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు (ఆర్టీఓ) టెస్ట్ డ్రైవ్స్ కోసం వెళ్తాం. అయితే ఇప్పటి నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ సెంటర్లలో ఈ టెస్ట్‌ని పూర్తి చేసి లైసెన్స్‌ని పొందవచ్చు. అందుకు అనుగుణంగా తీసుకువచ్చిన పలు మార్పులను వెళ్లడించారు. దీని ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ అవసరమైన టెస్ట్‌లు నిర్వహిస్తారు.

ఆ తర్వాత సర్టిఫికెట్స్ కోసం ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ అధికారులకు సమర్పిస్తారు. వారు పరిశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. ప్రస్తుతం రవాణా కార్యాలయాల్లోని సుమారు 900,000 పైగా పాతబడిన ప్రభుత్వ వాహనాలను తొలగించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ వాహనాలు అన్నీ వాతావరణానికి హాని చేసే ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ మార్పులతో కాలుష్యాన్ని తగ్గించాలని కొత్త నిబంధనలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వివిధ స్థాయిలలో ఉన్న పేపర్ వర్క్‌ని తగ్గించి.. కొత్త లైసెన్స్ పొందడాన్ని సులభతరం చేయాలని నిర్ణయించినట్లు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కచ్చితమైన ఆదేశాలతో పాటు పలు నిబంధల్నీ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్లకు మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దాని ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండేలా పర్యవేక్షణ సైతం ప్రభుత్వం అధికారులు చేయనున్నారు.

ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నిబంధనలు: ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కనీసం ఎకరం స్థలం ఉండాలని నిర్ణయించింది. ఈ స్థలం ఆ సంస్థ పేరున లేదు కచ్చితమైన అగ్రిమెంట్ కలిగి ఉండాలి. ఫోర్ వీలర్స్‌కి శిక్షణ ఇవ్వాలంటే వారికి రెండెకరాల స్థలం ఉండాలి. అందుకు తిగనట్లుగా డ్రైవింగ్ స్కూళ్లలో సరైన టెస్టింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలి.
ఇందులో పనిచేసే ట్రైనర్లకు డిప్లొమా లేదా తత్సమాన ఉత్తీర్ణత కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి. బయోమెట్రిక్స్ కనీసం ఐటీ పరిజ్ఞానం శిక్షకులకు ఉండాలి. ఇంకా మరెన్నో కఠినతర ఆంక్షలను మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటేనే వారి అనుమతి లభిస్తుంది. లేదంటే వారికి లైసెన్స్ జారీ చేయడానికి వీలు ఉండదు. కేవలం డ్రైవింగ్ స్కూల్‌కి మాత్రమే వారు కంటిన్యూ చేయవచ్చు.
ఇక తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లైట్ మోటార్ వెహికల్స్ (ఎల్ఎంవీ) కోసం, మొత్తం 4 వారాలలో 29 గంటలు ట్రైనింగ్ పూర్తి చేయాలి. ఇందులో 8 గంటల థియరీ 21 గంటల ప్రాక్టికల్స్‌లో శిక్షణ ఇవ్వాలి. ఇక హెవీ మోటార్ వెహికల్స్ (హెచ్ఎంవీ) కోసం 6 వారాల్లో 38 గంటల్లో శిక్షణ పూర్తి చేయాలి. 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలి.
ఫీజులు: లైసెన్స్ ఫీజులు మరియు ఛార్జీలు కొత్త చట్టాల ప్రకారం లెర్నర్ లైసెన్స్ (ఫారం 3) జారీకి రూ.150, లెర్నర్ లైసెన్స్ టెస్ట్ లేదా రిపీట్ టెస్ట్‌కి అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ కు, లేదా రిపీట్ టెస్ట్ అవసరం అయితే దానికి అదనంగా రూ. 300 పే చేయాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ జారీకి రూ.200, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ పొందడానికి రూ.1,000గా నిర్ణయించింది.
అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న లైసెన్స్‌కు మరో వెహికల్ డ్రైవింగ్‌ని జోడించాల్సి (Add New Vehicle Driving License) వస్తే రూ.500 వసూలు చేయనున్నారు. ప్రమాదకరమైన గూడ్స్ వాహనాలు నడిపే వారికి మంజూరు లేదా పునరుద్ధరణకు రూ.200, స్టాండర్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరించడానికి రూ .200గా ధరలు ఉన్నాయి. ఇక గ్రేస్ పీరియడ్ తర్వాత ఈ పునరుద్ధరణ జరిగితే ఆ ఫీజు రూ. 300కు పే చేయాల్సి వస్తుంది.

గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత సంవత్సరానికి అదనంగా రూ .1000 చెల్లించాలి. ట్రైనింగ్ లేకుండాలైసెన్సులను జారీ చేయడానికి లేదా పునరుద్ధరించడానికి రూ .5,000 ఫీజు ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్స్ నుంచి డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి అదే ఫీజు వర్తిస్తుంది. రూల్ 29 కింద లైసెన్సింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీల్ కు రూ.500, లైసెన్స్‌లో చిరునామా లేదా ఇతర వివరాలను మార్చుకోవడానికి రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇక అతివేగంగా వాహనాలు నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25,000 భారీ జరిమానా విధించనున్నారు. అంతే కాకుండా వాహన యజమాని రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయబడుతుంది. ఆ మైనర్ 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందడానికి వీలు ఉండదు.


Click it and Unblock the Notifications








