మీ పిల్లలకు కార్లు, బైకులు ఇవ్వకండి.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్.. 25,000 ఫైన్‌, జైలు శిక్ష పడే అవకాశం

డ్రైవింగ్‌ కోసం కారు లేదా బైక్‌ ఇవ్వాలని మీ ఇంట్లో మీ పిల్లలు ఇబ్బంది పెడితే కరిగిపోకండి. ఎందుకంటే తాజాగా మారిన రూల్స్‌ మారాయి. జూన్‌ 1 ఈ రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఈ సరికొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాక భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంటుంది. ఈ రూల్స్‌ ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు. మారిన నియమాల ప్రకారం ఎలాంటి సాకులు చెప్పినా పోలీసులు వినరు. రూల్స్‌ ప్రకారం వారికి శిక్ష పడుతుంది. దీనికి తోడు వారిపై పలు ఆంక్షలు సైతం విధించనున్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందు కొత్త మోటార్‌ వాహనాల చట్టంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ పట్టుపడితే కఠిన నియమాలు అమలు చేయనున్నారు. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ కఠిన రూల్స్‌ని అమల్లోకి వస్తాయి. వీటిని అతిక్రమించినా లేదా ఈ చర్యలకు సహకరించే వారికి శిక్ష పడనుంది. మైనర్లు డ్రైవింగ్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

Minor-Driving-Rules

కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని పుణెలో పోర్షే సూపర్ కారు నడుపుతున్న ఓ 17 ఏళ్ల బాలుడు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది. అంతేకాకుండా అతను మత్తులో ఉన్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. అయితే కొన్ని గంటల్లోనే బాలుడికి బెయిల్ రావడం వివాదాస్పదం అయ్యింది.

ఈ ప్రమాదానికి సంబంధించి పలు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ బాలుడి తండ్రి మహారాష్ట్ర రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తిగా వార్తలు వచ్చాయి. అతడు పేరున్న కన్‌స్ట్రక్షన్ కంపెనీ నడుపుతున్నట్లు తెలిసింది. దీంతో తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో తన కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని తేలింది. అందుకే బెయిల్‌ కూడా లభించిందని మండిపడుతున్నారు. ఈ ఘటనతో ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pune-Car-Crash

ముఖ్యంగా బాలుడిని కాపాడే క్రమంలో ఇంట్లో పనిచేసే డ్రైవర్‌ని ప్రమాదానికి బాధ్యత వహించాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా ఇటీవల బాలుడి రక్త నమూనాల కోసం మరో వ్యక్తి రక్త నమూనాలను కూడా ఇచ్చారు. ఇలా కేసు నుంచి తప్పించుకునేందుకు బాలుడి తండ్రి వ్యవస్థల్నీ మేనేజ్‌ చేస్తూ వచ్చాడు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. బాలుడి రక్తనమూనాలను మార్చిన వైద్యులు అతనికి సహకరించిన మరికొందరు ఇప్పుడు పోలీసులు కటకటాల పాలయ్యారు.

బాలుడికి మద్యం విక్రయించిన ప్రైవేట్ బార్‌ని కూడా సీజ్ చేశారు. ఈ ఒక్క కుర్రాడు చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలన రేపిన ఈ ప్రమాదంతో రోడ్డు రవాణా శాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. 18 ఏళ్ల లోపు మైనర్ వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన రిజిస్ట్రేషన్ రద్దవడంతో పాటు వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోనున్నారు.

Pune-Car-Accident-Father

కొత్త మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం ఎవరైనా మైనర్‌ కారుని నడిపితే రూ. 25 వేల జరిమానా విధిస్తారు. అంతే కాకుండా అతడికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరాదనే కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఎల్లుండి (జూన్ 1) నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఇక ఇతరులు ఎవరైనా అతివేగంతో కారు నడిపితే వారికి రూ. 1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధిస్తారు.

మితిమీరిన వేగం వల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఫలితంగా ఈ కఠిన నిబంధనల్నీ అమలు చేయబోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో కొత్త మోటార్‌ వెహికిల్‌ చట్టంలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేస్తే మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నిబంధనలతో రోడ్డు ప్రమాదాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 30, 2024, 14:00 [IST]
English summary
New driving rules on minors they can be fined up to rs 25 000 and sentenced to jail
Read more on: #off beat #road safety #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+