Kawasaki Z650RS బైక్ Royal Enfield కి ప్రత్యర్థిగా నిలుస్తుందా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ అయిన Kawasaki భారతీయ మార్కెట్లో కొత్త Z650RS (జెడ్650 ఆర్ఎస్) బైక్ ఆవిష్కరించింది. అయితే ఈ కొత్త Kawasaki Z650RS మిడ్ వెయిట్ బైక్ వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Kawasaki Z650RS బైక్ భారతీయ మార్కెట్లో ఉన్న Royal Enfield Interceptor 650 (రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650) మరియు Continental GT650 (కాంటినెంటల్ జిటి650) వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త బైక్ అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

Kawasaki Z650RS బైక్ దాని Z900RS పై ఆధారపడి లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, దాని చుట్టూ క్రోమ్ కలిగి ఉంటుంది. దీనితో పాటు ఇందులో రౌండ్ రియర్ మిర్రర్స్, ఫ్లాట్ సీట్ ఫినిష్, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్, స్ప్లిట్-స్పోక్ వీల్స్, మరియు డ్యూయల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

ఈ కొత్త Z650RS బైక్ టియర్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, లెడ్ లైటింగ్ సిస్టమ్ పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ పైన బ్రాండ్ నేమ్ ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ యూరోపియన్ మార్కెట్లలో, ఈ బైక్ ని మూడు కలర్ ఆప్సన్స్ లో అందిస్తోంది. అవి ఎమరాల్డ్ గ్రీన్, మెటాలిక్ మూండస్ట్ గ్రే మరియు మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్స్.

ఈ బైక్ యొక్క అల్లాయ్ వీల్స్ చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఇవి ఆకర్షణీయమైన గోల్డ్ కలర్ పొందుతాయి. కేవలం గోల్డ్ కలర్ మాత్రమే కాకుండా ఇది మరో రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవి కూడా చూడటానికి ఆకర్షహనీయంగా ఉన్నాయి. అయితే బాడీ గ్రాఫిక్స్ మాత్రమే విభిన్న రంగులలో ఉంటుంది.

Kawasaki Z650RS బైక్ ఎలిమెంట్స్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సిస్టమ్, స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ తో పాటు వర్టికల్ హ్యాండిల్ బార్ మరియు కొద్దిగా వెనుక భాగంలో మౌంట్ చేయబడిన ఫుట్‌పెగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ బైక్ యొక్క రూపాన్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Kawasaki Z650RS మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీనికోసం ఇందులో 649 సిసి ప్యారలల్ ట్విన్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 67.3 బిహెచ్‌పి మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లతో పోలిస్తే, కొత్త బైక్ 20 బిహెచ్‌పి పవర్ మరియు 12 ఎన్ఎమ్ టార్క్ తక్కువ ఉత్పత్తి చేస్తుంది,

Kawasaki Z650RS మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుకవైపు బ్యాక్‌లింక్ మోనోషాక్ సెటప్ ఉన్నాయి. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇక బ్రేకింగ్ విషాయానికి వస్తే, 300 మిమీ ట్విన్ రోటర్స్ మరియు సింగిల్ పిస్టన్ రియర్ కాలిపర్‌తో సింగిల్ 220 మిమీ సింగిల్ డిస్క్ బ్రేక్‌తో డ్యూయల్-పిస్టన్ ఫ్రంట్ కాలిపర్‌లతో అందించబడింది. ఇవి రోడ్డుపై వేగంలో ఉన్నప్పుడు కూడా బైక్ ని కంట్రోల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Kawasaki India ఇటీవల తన 2022 కవాసకి జెడ్650 బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Kawasaki Z650 బైక్ ధర రూ. 6.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). మిడిల్ వెయిట్ స్ట్రీట్ న్యాక్డ్ మోటార్‌సైకిల్ సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది 'కాండీ లైమ్ గ్రీన్ టైప్ 3' అనే కొత్త సింగిల్ కలర్‌లో లభిస్తుంది.

Kawasaki యొక్క Z650 బైక్ మునుపటి మోడల్ లోని 649 సిసి ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పి శక్తిని మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 64 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌లో కంపెనీ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించింది.

ఈ కొత్త బైక్ యొక్క బాడీ కలర్స్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ బైక్ లో కొత్త రంగు కాకుండా, పెద్ద మార్పులు లేవు. కొత్త కవాసకి Z650 RS బైక్ బరువు 187 కిలోగ్రాములు. ఈ కొత్త బైక్ 820 మిమీ సీటు ఎత్తు కలిగి ఉంది.
Kawasaki భారతీయ మార్కెట్లో త్వరలో Kawasaki Z650RS విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఈ బైక్ యొక్క ధర మరియు ఇతర వివరాలను అధికారికంగా అందించలేదు. అయితే కంపెనీ ఈ బైక్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేసే సమయంలో ఇవన్నీ అధికారికంగా వెల్లడిస్తుంది. కొత్త Kawasaki Z650RS బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లకంటే కూడా చాలా స్టైలిష్ గా ఉంది.


Click it and Unblock the Notifications








