కళ్ళ ముందే లోయలో పడిపోయిన 'మహీంద్రా స్కార్పియో'.. అలాంటి సమయంలో ఎవరేమీ చేయలేరు

భారతదేశంలో మహీంద్రా వాహనాలు భద్రతకు పటిష్ఠతకు మారు పేరు. ఈ కారణంగా చాలామంది మహీంద్రా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. మహీంద్రా వాహనాలు ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే కొన్ని సార్లు పరిస్థితి చేయిదాటితే అనుకోని ప్రమాదాలు సంభవిస్తాయి.

మహీంద్రా వాహనాలు వరదల్లో కూడా అవలీలగా బయటపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో మహీంద్రా కంపెనీ యొక్క స్కార్పియో కారు అమాంతం వరదనీటి ప్రవాహానికి లోయలో పడిపోవడం చూడవచ్చు. ఇది చూసేవారికి ఒక రకమైన భయాన్ని తపకుండా కలిగిస్తుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న నీటిలో 'మహీంద్రా స్కార్పియో' చిక్కుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

వరద దాటికి లోయలో పడిన మహీంద్రా స్కార్పియో

నిజానికి వేగంగా ప్రవహిస్తున్న నీటిని దాటుకుంటూ మహీంద్రా స్కార్పియో డ్రైవర్ ముందుకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు, అయితే కొంత దూరం ముందుకు వెళ్లిన తరువాత అది సాధ్యం కాదని అతనికి అర్థమవుతుంది. అయితే కారుని వెనక్కు తీసుకురావడానికి కూడా చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు, అది కూడా ఫలించలేదు. కానీ ఆ ప్రవాహం నుంచి కారు డ్రైవర్ ఎలాగోలా బయటపడతాడు. కానీ తన కారుని మాత్రం బయటకు తీసుకురాలేకపోయాడు.

మొత్తానికి ఆ డ్రైవర్ ఆ నీటి ప్రవాహనంలోనే కారుని వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంక చేసేది లేక కారుని అక్కడే వడిలో అవతలి వైపుకి వెళ్ళిపోతాడు. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉండటం వల్ల ఆ కారు మెల్లగా లోయవైపుకి కదులుతూ క్రమంగా లోయలోకి పడిపోతుంది. ఈ సంఘటన మొత్తం ఆ కారు డ్రైవర్ చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. కారు లోయలో పడిపోయింది, కానీ డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు.

లోయలో పడిపోయిన కారు ఎంతవరకు దెబ్బతినింది, ఆ లోయ ఎంత లోతుగా ఉందనే విషయాలు తెలియదు, కానీ మొత్తానికి ఆ కారు పనికిరాకుండా పోయి ఉంటుందని తెలుస్తుంది. స్కార్పియో కారు లోయలో పడిపోయిన తరువాత మరే ఇతర వాహనాలు ఆ ప్రవాహం గుండా వెళ్లడానికి సాహసం చేయలేదు. ఒక వేళా అలాంటి సాహసం చేసినా ఇలాంటి ప్రతి ఫలమే లభిస్తుంది. కావున ఎవరు ముందుకు వెళ్ళలేదు.

మహీంద్రా స్కార్పియో మీద ఎలాంటి భీమా కూడా లేదని తెలుస్తుంది. కావున స్కార్పియోకి జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అంతే కాకుండా ఈ కారుకి నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడం వల్ల అది ఇటీవల కొనుగోలు చేసిన కారుగా భావిస్తున్నారు. భీమా వంటివి మునిగిపోయిన అండర్ పాస్ ల్లోనికి తమ వాహనాలను నడిపే వారికి లభించే అవకాశం లేదు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.

ఒక వ్యక్తి ఒక వాహనం కొనుగోలు చేసిన తరువాత తప్పకుండా ఆ వాహనం యొక్క పరిమితులను తప్పకుండా తెలుసుకోవాలి. ఆ వాహనం యొక్క పరిమితులను బట్టి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. పరిమితులకు తగిన విధంగా డ్రైవ్ చేస్తే ప్రమాదాల నుంచి తప్పకుండా బయట పడవచ్చు. పరిమితులను అతిక్రమించే డ్రైవింగ్ చేస్తే చెడ్డ ఫలితాలే లభిస్తాయి. దీనిని తప్పకుండా వాహన వినియోగదారులు గుర్తుంచుకోవాలి.

మహీంద్రా స్కార్పియో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. దీనిని ఎక్కువమంది ప్రజలు ఇష్టపడి మరి కొనుగోలు చేస్తుంటారు. ఇది ఆఫ్-రోడింగ్ కి కూడా ఉపయోగపడుతుంది. కానీ భారీ ప్రవాహాల్లో చిక్కుకున్న ఎలాంటి ఆఫ్ రోడర్ అయినా తప్పకుండా పట్టు కోల్పోతుంది. అప్పుడు పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాల వల్ల వాహనాలు మాత్రమే కాదు, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
New mahindra scorpio falls from cliff details
Story first published: Saturday, November 26, 2022, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X