కారు డెలివరీ.. తొలి రైడ్‌లోనే గుంతలోకి దూసుకెళ్లిన కారు.. కొత్త కారు నడిపేటప్పుడు ఇవి తెలుసుకోవాలి!!

కొత్త మారుతి సెలెరియో డెలివరీ సమయంలో గుంతలోకి దూసుకెళ్లింది. ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. క్షణాల వ్యవధిలో షోరూం ముందు ఉన్న గుంతలోకి కారు పడిపోయింది. ఊహించని విధంగా ప్రమాదం జరగడంతో అక్కడి వారు అవాక్కయ్యారు. వెంటనే వారికి సహాయక చర్యలు చేపట్టారు.

వీడియో ప్రకారం కారు డెలివరీ సమయంలో కుటుంబంతో షోరూంకి చేరుకున్న తర్వాత వారికి షోరూమ్‌ సిబ్బంది కారుని కస్టమర్‌కి అప్పగించారు. కారుని స్టార్ట్ చేసి ఆరంభించిన కాసేపటికే కారు లోయలోకి దూసుకెళ్లింది. కారు కొన్న ఆనందంలో ఆ క్షణాలను బంధించే వారి బంధువుల అరుపులతో ఒక్కసారి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

Maruti-Celerio-Delivery-Goes-Wrong

డ్రైవర్ సీట్‌లో కూర్చున్న మహిళ అనుకోకుండా యాక్సిలరేటర్‌ను ఎక్కువగా తొక్కడంతో ఈ ఆకస్మిక పరిణామం చోటుచేసుకుందని స్థానికులు ప్రాథమికంగా అంచనా వేశారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అక్కడే ఉన్న రెస్క్యూటీమ్‌ చర్య వల్ల కారులో ఉన్న వారిని వెంటనే రక్షించారు. అయితే ఎదురుగా ఉన్న రోడ్డు కిందకు దూసుకువెళ్లే క్రమంలో మహిళా డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేకులు వేయడానికి తగినంత సమయం ఉన్నాకాని కారుని అదుపు చేయలేక పోయింది.

ప్రమాద సమయంలో నష్టాన్ని అంచనా వేయడానికి స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దెబ్బతిన్న కారు యథాస్థితిని నోట్‌ చేసుకున్నారు. పూర్తిగా దెబ్బతిన్న మారుతి సెలెరియో కారుని రిపేర్‌ కోసం సర్వీస్ సెంటర్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

Maruti-Celerio-Delivery-Goes-Wrong

బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ఆవశ్యకత గురించి ఈ వీడియో ఒక గుణపాఠం కానుంది. ముఖ్యంగా కొత్త కారు డెలివరీ వంటి ఉత్సాహం ఉన్న క్షణాల్లో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూ ఉండటం విశేషం. ఈ ఘటనకు సంబంధించి డీలర్‌షిప్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అయితే కొత్త కార్ డెలివరీ తీసుకునే కొన్ని విషయాలను కస్టమర్లు గమనించాలి. కారును డెలివరీ చేయడం అనేది ఒక ముఖ్య ఘట్టం అయితే అంతే మొత్తంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం షోరూమ్ యొక్క ప్రథమ కర్తవ్యం. షోరూం ముందు రహదారి సాఫీగా ఉండేలా చేయాలి. కారు డెలివరీని సురక్షితంగా తీసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు మీకోసం.

Maruti-Celerio-Delivery-Goes-Wrong

నియంత్రణలోకి తీసుకోండి: డ్రైవింగ్ చేసే ముందు, కొత్త కారు కాబట్టి దానిని అర్థం చేసుకుని నియంత్రణలోకి తీసుకుని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఇందుకు కావాల్సిన సమయాన్ని తీసుకోండి. అద్దాలను సర్దుబాటు చేసి, హెడ్‌లైట్లు, విండ్‌షీల్డ్ వైపర్‌లు మరియు ఎమర్జెన్సీ బ్రేక్‌లు వంటి ముఖ్యమైన కంట్రోల్‌ ప్యానల్‌ని అర్థం చేసుకోండి. ఏవైనా ప్రశ్నలు ఉంటే డీలర్‌షిప్ సిబ్బందిని అడగడానికి వెనుకాడకండి. మోడల్ ఫీచర్లు, నిర్వహణ, ఏదైనా నిర్దిష్ట డ్రైవింగ్ టిప్స్‌ని అడగండి.

డెలివరీకి ముందు టెస్ట్ డ్రైవ్: వీలైతే, టెస్ట్ డ్రైవ్‌ కోసం షోరూం సిబ్బందిని అడగండి. కారుపై ఏవైనా సమస్యలు లేదా డౌట్స్‌ ఉంటే మీకు సహాయపడతాయి. అంతే కాకుండా సేఫ్టీ ఫీచర్లను అర్థం చేసుకోండి. యాంటీ-లాక్ బ్రేక్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరంగా అడగండి. అత్యవసర పరిస్థితుల్లో ఈ వివరాలు మిమ్మల్న ప్రమాదం నుంచి రక్షిస్తాయి.

పరిసర ప్రాంతాలను తనిఖీ చేయండి: డీలర్‌షిప్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీ పరిసరాలను తనిఖీ చేయడానికి కొంత సమయం కేటాయించండి. సురక్షితమైన ప్రదేశంలో డ్రైవ్‌ చేయడం కోసండీలర్‌షిప్ లేదా ప్రొఫెషనల్‌ని సంప్రదించండి. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మీరు షోరూం నుంచి కొత్త కారు ద్వారా సురక్షితంగా బయటకు రావచ్చు. చిన్నపాటి పొరపాట్లను అధిగమిస్తే మీ కొత్త కార్‌ జర్నీ సాఫీగా సాగుతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 27, 2024, 17:55 [IST]
English summary
New maruti celerio crashes outside the showroom just moments after being delivered
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+