పసుపు కలర్‌లో '2024 మారుతి స్విఫ్ట్'.. దీని కోసం షోరూమ్‌లకు మాత్రం క్యూ కట్టకండి!
మారుతి సంస్థ నుంచి వచ్చే స్విఫ్ట్ చాలా మందికి ఫేవరెట్ కారుగా ఉంది. దీని డిజైన్, మైలేజీ, తక్కువ ధరతో అందుబాటులో ఉండటం వల్ల జనాల్లో దీనిపై క్రేజ్ పెరిగింది. ఇప్పటికీ ఈ కారు హాట్ కేకుల్లా సేల్ అవుతుంది. 2004లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 30లక్షలకు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. తాజాగా స్విఫ్ట్ 4th జనరేషన్ కారుని మారుతి సుజుకి విడుదల చేసింది. ఈ కారు సేల్స్‌లో దూసుకుపోతుంది. దీంతో ఆ కంపెనీ 30లక్షల యూనిట్ల సేల్స్ మార్క్‌ని అధిగమించింది.
దేశంలో అత్యధిక వేగంగా అమ్ముడవుతున్న కార్లలో స్విఫ్ట్ ఒకటిగా ఉంది. ఆ కంపెనీ నుంచి ఆల్టో తన ఆధిపత్యం తర్వాత స్విఫ్ట్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే 2024 మే నెలలో లాంచ్ అయిన ఈ 4th జనరేషన్ స్విఫ్ట్ ఇప్పుడు కొత్త కలర్‌లో కనిపించింది. చిన్నపాటి మోడిఫికేషన్స్‌తో ఓ వ్యక్తి స్విఫ్ట్‌ని పసువు కలర్‌లోకి మార్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు..

తాజా 4th జనరేషన్ స్విఫ్ట్‌ని పసుపు కలర్‌లో (Swift Yellow) సందదడి చేసింది. అయితే భారత్‌లో కార్ల కలర్స్, ఇతర మోడిఫికేషన్స్‌పై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఒకరి ఇష్టానుసారం కారు కలర్ మార్చడానికి అనుమతి లేదు. ఇది వ్యక్తి లేదా సమాజాన్ని ప్రభావితం చేయనంత వరకు ఎటువంటి పరిమితులు ఉండవు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయి.
అయితే మారుతి సుజికి స్విఫ్ట్ చాలా సార్లు విభిన్న రూపాల్లో కనిపించింది. దేశంలోని రోడ్డుపై పసుపు రంగు కార్లు కనిపించవు. మారుతి సుజుకి కూడా స్విఫ్ట్‌ని ఎల్లో పెయింట్ ఆప్షన్‌తో అందించదు. అయితే కొందరు స్విఫ్ట్ కార్ల యజమానులు తమ కారును పసుపు రంగులోకి మార్చుకోవడం మనం గతంలో చూశాం. తాజాగా ఓ వ్యక్తి కూడా కారుని పూర్తిగా ఎల్లో కలర్‌లోకి మార్పు చేశాడు.

ఈ ఏడాది మే నెలలో లాంచ్ అయిన 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌కి బ్రైట్ ఎల్లో కలర్ పెయింట్ వేశారు. ఈ ప్రత్యేకమైన కలర్‌లో కనిపించే స్విఫ్ట్ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. రాత్రి సమయంలో స్విఫ్ట్ కారు నడుపుతున్న సమయంలో ఈ వీడియో తీశారు. అయితే సుజుకి స్విఫ్ట్ కొన్ని విదేశీ మార్కెట్లలో ఎల్లో కలర్‌లో లభిస్తుంది.
అయితే ఈ కారు మన దగ్గర ఈ కలర్‌లో అందుబాటులో లేదు. అయితే ఈ కారుని ఆ వ్యక్తి ప్రత్యేకంగా మార్పులు చేసినట్లు వీడియో ప్రకారం తెలుస్తుంది. ముఖ్యంగా కొత్త అల్లాయ్ వీల్స్ మన దృష్టిని ఆకర్షిస్తాయి. అదేవిధంగా, కారు ముందు భాగంలో హెడ్ లైట్ల చుట్టూ రెడ్‌లైట్ కనిపిస్తుంది. ఈ కలర్‌కి రెడ్‌లైట్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. అత్యంత స్టైలిష్ మోడిఫైడ్ స్విఫ్ట్ కారుగా ఇది ఉంది.
ఇప్పటికే చెప్పినట్లు మన దేశంలో కారు మోడిఫికేషన్లపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా కారు రంగును మార్చుకోవచ్చు. అయితే అందుకు కూడా ఆర్టీవోకు దీనికి తగినట్లు సరైన సమాచారం ఇవ్వాలి. కొత్త రంగు మారిన తర్వాత కారును ఆర్టీ కార్యాలయానికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌కి కొత్త చిత్రాలను జోడించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేశాకే వారు రోడ్లపై దీనిని నడిపేందుకు అవకాశం ఉంటుంది.
ఇక 4th జనరేషన్ స్విఫ్ట్ విషయానికి వస్తే ఈ కారు మునుపటి జనరేషన్స్ కంటే భారీ మార్పులతో వచ్చింది. వాటిలో ప్రధానంగా కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ నేచురల్-ఆస్పిరేటెడ్ Z12E పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకువచ్చింది. ఇది 82ps శక్తిని మరియు 112nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








