Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 16 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు ముఖేష్ అంబానీ. ప్రపంచ కుబేరులలో ఒకరుగా ఉన్న ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇందులో భాగంగానే ముఖేష్ అంబానీ బయటకు వెళ్లే సమయంలో చాలా కార్లు వారు ప్రయాణిస్తున్న కారు ముందు మరియు వెనుక వెళ్తాయి.

ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో అప్పుడప్పుడు రోడ్డుపైన చూస్తూ ఉంటాము. ముఖేష్ అంబానీ యొక్క భద్రతా దళాలలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5, ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా స్కార్పియో మరియు హోండా సిఆర్-వి వంటివి ఉన్నాయి.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో ప్రకారం అంబానీ సెక్యూరిటీలో కొత్త మెర్సిడెస్ బెంజ్ జి-63 ఎఎమ్‌జి కూడా చేరినట్లు తెలుస్తున్నాయి. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే మొత్తం నాలుగు మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి కార్లను చూడవచ్చు. మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి ధర దేశీయ మార్కెట్లో రూ. 3 కోట్లు (ఆన్-రోడ్).
MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్‌లనే మొబైల్ అంబులెన్స్‌లుగా మార్చేశారు..

ముఖేష్ అంబానీ తన భద్రత కోసం ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి కారును కొనుగోలు చేశారు. టయోటా వెల్ ఫైర్ కారును కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఇవన్నీ ముఖేష్ అంబానీ భద్రతా దళాల్లో ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ జి 63 ఎఎమ్‌జి 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 576 బిహెచ్పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఎఎమ్‌జి స్పీడ్-షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది.
MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
అంబానీ కుటుంబం ఇటీవల రెండవ ఖరీదైన మరియు అత్యంత లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ కారును కొనుగోలు చేశారు. ఇంతకు ముందే ఒక రోల్స్ రాయిస్ కారు ఉంది. ఈ రెండవ రోల్స్ రాయిస్ ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంట్లో ఆపి ఉంచిన కారు వీడియో ఇటీవల విడుదలైంది.

ఏది ఏమైనా చాలామంది ప్రముఖులు తమ భద్రతకోసం చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగా భద్రతలో ఉంపయోగించే వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ వంటి వాటిని కూడా కలిగి ఉంటారు. అప్పుడే కొన్ని అనుకోని ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది.
MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు