ట్రాఫిక్ రూల్స్ అతిక్రమనకు...మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊహించని ఝలక్ ఇవ్వబోతోంది. ట్రాఫిక్ నిబంధలను మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మోటార్ వెహికల్ బిల్లు సవరణకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఇందులో ఉన్న కొత్త ట్రాఫిక్ అతిక్రమన జరిమానా ఎలా ఉన్నాయో చూద్దాం రండి...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం మోటారు వాహన (సవరణ) బిల్లుకు ఆమోదం తెలిపింది. వివిధ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి కొత్త జరిమానా విధానాలను ఇందులో పొందుపరిచారు అని తెలిసింది.

ఈ బిల్లులో రోడ్డు భద్రత విభాగంలో జువెనైల్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, తాగిన డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ మరియు ఓవర్ లోడింగ్ వంటి నేరాలకు సంబంధించి కఠినంగా జరిమానా విధించే నిబంధనలను ప్రతిపాదించారు. అర్థం కాలేదా అయితే వివరంగా తెలుసుకొందాం.

పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ద్వారా 18 రాష్ట్రాల నుంచి రవాణా అధికారుల సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో
రోడ్డుపై ఎవరైనా అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వెహికల్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంది.

క్యాబ్, ట్యాక్సీ వంటి సేవలు అందించే అగ్రిగ్రేటర్లు డ్రైవింగ్ లైసెన్స్ రూల్‌ను అతిక్రమిస్తే ఏకంగా రూ.లక్ష వరకు పెనాల్టీ పడుతుంది. అతివేగంతో (ఓవర్ స్పీడ్) వాహనం నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు చెల్లించుకోవలసి వస్తుంది.

ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 ఫైన్ కట్టాల్సిందే. హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే రూ.1,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌పై మూడు నెలలపాటు సస్పెన్సన్ ఉంటుంది.

మైనర్లు వాహనాన్ని నడిపితే ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అలాగే వారి సంరక్షుడు లేదా వెహికల్ ఓనర్ మూడేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. రూ. 25,000 పెనాల్టీ పడుతుంది. ఆర్‌సీ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసినా ఇదే పెనాల్టీ కట్టాలి. ర్యాష్ డ్రైవింగ్‌కు జరిమానా రూ.5,000. మద్యం తాగి వెహికల్ నడిపితే రూ.10,000 కట్టాలి. వెహికల్‌పై ఓవర్‌లోడ్‌తో వెలితే రూ.రూ.20,000 జరిమానా పడుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 పెనాల్టీ.

అమలు చేసే అధికారుల ద్వారా నేరాలకు పాల్పడిన వారికి, జరిమానా రెట్టింపు చేయాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్టం కింద డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ కూడా బలపడింది. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయాలని, మంచి సమరయ మార్గదర్శకాలు బిల్లులో పొందుపరిచామని.

పార్లమెంట్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ గతంలో చెప్పిన విధంగా మోటారు వాహనాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని తెలిపారు. లోక్ సభ ఆమోదించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు ఏప్రిల్ 2017 లో ఎగువ సభలో ప్రవేశపెట్టబడింది కానీ ప్యానల్ సిఫారసును పరిగణలోకి తీసుకున్న తర్వాత రాజ్యసభలో బిల్లును తిరిగి ప్రవేశపెట్టినా బిల్లుపై చర్చ మాత్రం అసంపూర్ణంగా ఉండిపోయింది.
Source:The Hindu


Click it and Unblock the Notifications








