New Traffic Rules: ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించకపోతే మీ ఉద్యోగం పోయినట్లే..!

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇప్పటివరకూ జరిమానాలు విధించడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇకపై ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమిస్తే ఏకంగా ఉద్యోగమే పోతుందని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.. ఇంతకీ ఇది ఎక్కడ.. పూర్తి సమాచారం ఈ కథనంలో

భారత్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. దీన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య తగ్గడంలేదు. ఒక్కో రాష్ట్రంలో రూ. కోట్లలో చలాన్ల బకాయిలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

New-Traffic-Rules-In-Bengaluru

ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీ నగరాల్లో ట్రాఫిక్‌కు గురించి తెలియనిది కాదు. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు ఇప్పుడు వినూత్న పథకాన్ని ప్రారంభించారు. నగరంలో ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

దీని ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనదారుల వివరాలను వారు పనిచేస్తున్న కార్యాలయాలకు తెలియజేస్తారు. ప్రయోగాత్మకంగా అధికారులు ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కాగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు గత 20 రోజులుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.

New-Traffic-Rules-In-Bengaluru

ఈ ప్రాజెక్టు కింద, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారు పనిచేసే కంపెనీల గుర్తింపు కార్డును తనిఖీ చేస్తామని ట్రాఫిక్‌ పోలీసు అధికారులు చెబుతున్నారు. దీని తర్వాత వారు ఏ నిబంధనలను ఉల్లంఘించారో నోట్‌ చేసుకుని.. వారు పనిచేసే కంపెనీకి ఈ వివరాలను పంపుతామన్నారు. అంతే కాకుండా జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే ఉద్యోగుల గురించి ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పంపించబోమని.. ట్రాఫిక్‌ అధికారులు అంటున్నారు. వారు చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి మాత్రమే సమాచారాన్ని పంపిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.. తప్ప మరి ఇంకే దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.

New-Traffic-Rules-In-Bengaluru

ఐటీ నగరం బెంగళూరులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇందుకు ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ప్రధాన కారణాల్లో ఒకటి. కాబట్టి అక్కడ ఇటువంటి కార్యకలాపాలు చాలా అవసరమని ట్రాఫిక్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ తరుణంలో, అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ట్రాఫిక్ నిబంధనల గురించి మరింత అవగాహన కల్పించడం అవసరం.

ఇది జరిమానాలతో సహా చర్యల నుంచి మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల వంటి ప్రమాదాల నుండి కూడా వారిని కాపాడుతుంది. రాబోయే కాలంలో భారతదేశంలోని ఇతర నగరాలకు ఇటువంటి చాలా భిన్నమైన కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే కార్యాలయానికి తెలియజేసే ఈ చర్యను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

New-Traffic-Rules-In-Bengaluru

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2023, 10:14 [IST]
English summary
New project to reduce traffic violations in bengaluru check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+