విదేశాల కారు అయితే ఏంటి.. భారతీయ మట్టి తాకితే సంప్రదాయ పూజ చేయాల్సిందే.. రూ.10.50 కోట్ల కల్లినన్‌కు హారతి!

భారతీయులుగా మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను తప్పనిసరిగా పాటిస్తాము. ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టిన, అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ముందుగా వాటికి పూజ చేయడం తప్పనిసరి. ఇంటికి కొత్తగా కారు, బైకు లేదా ఇతర ఏ వాహనాలను తెచ్చుకున్న పూజ జరిపించిన తరువాతే వాటిని రోడ్లపైకి తీసుకువస్తాము. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్-II లగ్జరీ కారు డెలివరీని అందుకున్న తరువాత ఓనర్ దానికి ప్రత్యేకంగా పూజ జరిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన చాలా మంది ఎన్ని కోట్ల విలువ అయినప్పటికీ మన దేశంలో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేయనిదే రోడ్డు పైకి వాహనాలను తీసుకురారు అనడానికి ఇది నిదర్శనం అని అంటున్నారు.

అత్యంత ఖరీదు చేసే తెల్లటి కల్లినన్ సిరీస్-II లగ్జరీ కారుకు పూజ ఇటీవల బెంగళూరులో జరిగింది. ఆటోమొబైల్ ఆర్డెంట్ ఇండియా అనే సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను షేర్ చేశారు. తెల్లగా అందంగా మెరిసిపోతున్న లగ్జరీ కారును పూజిస్తున్న చిత్రాలు భారతీయ సంస్కృతిని హైలైట్ చేస్తున్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు చేయడం హిందూ సంప్రదాయంలో అందరు పాటిస్తుంటారు.

New Rolls Royce Cullinan Traditional Puja

కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత యజమానులు దేవాలయానికి తీసుకెళ్లడం లేదా ఇంటివద్దే పూజరితో పూజ చేయించడం ఆనవాయితీ. ఇక్కడ కారును ఇంట్లోనే పూజ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోటోలను చూసినట్లయితే కారుతో పాటు మరో విషయాన్ని గమనించవచ్చు పూజారి కూడా కారుకు ఎంతో ఆసక్తిగా పూజ చేశారు. పూజ పూర్తయిన తర్వాత లగ్జరీ కారుతో ఆయన కూడా ఫోటో దిగాడు.

ఈ ఆచారం వాహన యజమానులకు మాత్రమే కాకుండా, పూజ నిర్వహించే పూజారులకు కూడా ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని తాజా సంఘటన నిరూపిస్తోంది. విదేశీ కార్లు ఎంత ఖరీదైనవైనా, ఎంత ఆధునిక సాంకేతికత కలిగినవైనా, భారతీయ మట్టి తాకిన వెంటనే సంప్రదాయ హంగులతో స్వాగతం పలకడం మాత్రం తప్పదు. ఇది భారతీయుల ఆచారాలను, వారి సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేస్తోంది.

New Rolls Royce Cullinan

ఈ సంఘటన, ఎంత ఆధునికత పెరిగినా భారతదేశంలో సంప్రదాయాలను గౌరవించే మనస్తత్వం యథావిధిగా కొనసాగుతోందనే విషయాన్ని చాటిచెప్పింది. కొత్త వాహనాన్ని దేవుని ఆశీర్వాదంతో ప్రారంభించాలనే భావన, తరతరాలుగా వచ్చిన అలవాటు. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, వాహన యజమాని భద్రతకూ, శుభఫలితాలకూ నాంది వేసే శుభసంకేతంగా భావించబడుతుంది.

ఇక రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్-II లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. సాధారణంగా రోల్స్ రాయిస్ తన కార్లను ఎవరికి పడితే వాళ్లకు తన కార్లను విక్రయించదు. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు కలిగిన వారికి ధనవంతులకు మాత్రమే వాటిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్-II లగ్జరీ కారును కూడా ఒక ఫేమస్ వ్కక్తి కొనుగోలు చేశారు.

New Rolls Royce Cullinan Traditional Puja

దీని ఇంజిన్ విషయానికి వస్తే, కల్లినన్ సిరీస్ IIలో శక్తివంతమైన 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 ఇంజిన్‌ను అందించారు. ఇది 571 bhp పవర్, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్‌ను కూడా కలిగి ఉంది. లేటెస్ట్ ఫీచర్స్ బోలెడు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ అందంగా ఉంటుంది. దీంతో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు కారుపైనే ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 25, 2025, 13:00 [IST]
English summary
New rolls royce cullinan its worth rs 10 5 crore got recent traditional puja photos goes viral
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+